పాము వ‌ల్ల చిక్కుల్లో ప‌డ్డ ఎస్సై..చివ‌ర‌కు ఉద్యోగం కూడా పోయింది ఆ ఎస్సై చేసిన ప‌నేంటో తెలుసా

1045

కొన్ని కొన్ని న‌మ్మ‌కాలు మ‌న‌ల్ని ఎంత దూరం తీసుకు వెళ‌తాయో తెలిసిందే….ఇక వారి అభిమానం మూడ న‌మ్మకం హ‌ద్దులు దాటి ఆన‌క‌ట్ట‌లు కూడా నిలువ‌రించ‌లేనంత ఉంటుంది.. ఈ స‌మ‌యంలో వారు ఎటువంటి నిర్ణ‌యాలు తీసుకుంటున్నారో కూడా తెలియ‌దు.. ఇక చాలా వ‌ర‌కూ మూడ‌న‌మ్మ‌కాలా చుట్టూనే న‌డుస్తోంది ఈ ప్ర‌పంచం. ఇక మ‌నం మొక్క‌ల‌ను జంతువుల‌ను ప్ర‌తీ ప్రాణిని దైవ స్వ‌రూపంగా కొలుస్తాం వాటికి ఏ హానీ చేయ‌కుండా వాటిని కూడా దైవ స్వ‌రూపాలుగా కొలుస్తాం. ఇక ప్ర‌తీ జీవికి దేవునికి సంబంధించి ఓ గాధ‌ని చెబుతాం.

Image result for 26 days snake

అలాగే మ‌నం పాముల‌ను చూస్తే వెంట‌నే నాగ‌రాజు అని కొలుస్తాం.. పాముని దేవునిగా చూస్తాం, ఇక విష‌స‌ర్పం ఇంట్లోకి వ‌స్తే కొంద‌రు దానిని బ‌య‌ట‌కు పంపిస్తే మ‌రికొంద‌రు క‌ర్ర‌తో కొట్టి చంపేస్తారు.. ఎవ‌రి మ‌నోభావాలు వారివి.. ఇక ఓ ఎస్సైకి పాము ఎటువంటి ప్ర‌తిఫ‌లం ఇచ్చిందో తెలుసుకుంటే ఆశ్చ‌ర్య‌పోతారు.. పాము విష‌యంలో ఆ ఎస్సై ఉద్యోగం పోయింది. అస‌లు ఈ విష‌యాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for 26 days snake pooja

తూర్పుగోదావ‌రి జిల్లా పిఠాపురంలో గత కొన్ని రోజులుగా జిల్లా ప్రజలు దేవుడని కొలుస్తూ ఓ పాముకు పూజలు చేస్తున్నారు.. ఇక వీరి మ‌నోభావాలు ఎలా ఉన్నాయో రోజూ పేప‌ర్ల‌లో మీడియాలో వార్త‌లు కూడా వ‌చ్చాయి..ఈ పాము తాజాగా మృతిచెందింది. అస‌లు ఈ విష‌యంలోకి వెళ్తే…గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలోని ఓ రైతు పొలంలో 26 రోజుల క్రితం కనిపించిన పామును గ్రామ ప్రజలు సుబ్రమణ్య స్వామి స్వరూపం అంటూ పూజలు చేశారు. ఆ పాము గ్రామస్తుల దగ్గరికి వెళ్లినా వారిని కాటు వేయకపోవడంతో సాక్షాత్తు దేవుడేనంటూ మరింత నమ్మకం ఏర్పరుచుకున్నారు. బుధవారం కుసుం విడిచిన పాము అనుకోకుండా మృతి చెందడంతో గ్రామస్తులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Related image

గత కొన్ని రోజులుగా భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్న పాము మృతిచెందటానికి గొల్లప్రోలు ఎస్సై శివకృష్ణ కారణమంటూ దుర్గాడ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తక్షణమే ఎస్సైను సస్పెండ్‌ చేయాలంటూ గ్రామస్తులు జాతీయరహదారిపై బైఠాయించి ఆందోళనలు చేస్తున్నారు… పాము మృతి చెందిన స్థలంలో గుడి కట్టాలని గ్రామ ప్రజలు భావిస్తున్నారు. వీటిని న‌మ్మ‌కూడ‌దు అని ఎస్సై చెప్ప‌డంతో ఆ ఎస్సై పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అతన్ని విధుల్లోంచి తొల‌గించాల‌ని పై అధికారుల‌కు చెబుతున్నారు.

మొత్తానికి వీరి మూడ న‌మ్మకాలు ఇంత‌లా ఉండ‌టంతో అధికారులు కూడా ఇక్క‌డ ఆచితూచి అడుగులు వేస్తున్నారు.. ఇక్క‌డ గుడిక‌ట్టే ఆలోచ‌న‌లో ఆ గ్రామ‌స్తులు ఉన్నారు.. ఇక్క‌డ పాము మృతి చెందిన చోట గ్రామ‌స్తులు అంద‌రూ గుడి క‌ట్టాలి అని భావిస్తున్నారు… మ‌రి చూశారుగా దీనిపై మీ అభిప్రాయం కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.

పవన్ పత్రిక వచ్చేసింది..పేరేంటో తెలుసా