ఆర్టీసీ చరిత్రలోనే అతిపెద్ద ప్రమాదం: డ్రైవర్ స్నేహితుడితో చెప్పిన షాకింగ్ నిజాలు

410

జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొండగట్టుకు వెళ్లి తిరిగివస్తున్న ఆర్టీసీ బస్సు సమీపంలోని ఘాట్ రోడ్డులో అదుపుతప్పి లోయలో పడింది.ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య యాభైకి పైగా పెరిగింది. ప్రమాదం సమయంలో బస్సులో 80 మందికి పైగా ఉన్నారని తెలుస్తోంది. మృతుల్లో 32 మంది మహిళలు, 15 మంది పురుషులు, 4గురు చిన్నారులు ఉన్నారు..అయితే ఈ ప్రమాదం జరగడానికి గల ముఖ్య కారణం ఆ బస్సు డ్రైవర్ చెప్పాడు.మరి ఆ విషయం గురించి తెలుసుకుందామా.

Image result for bus accident in telangana

జగిత్యాల జిల్లా కొండగట్టులో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో డ్రైవర్ శ్రీనివాస్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను ఆసుపత్రికి తరలించారు. అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమాదంలో గాయపడ్డ వారిని జగిత్యాల, హైదరాబాద్, కరీంనగర్ ఆసుపత్రులకు తరలించారు. జగిత్యాల ఆసుపత్రికి కేటీఆర్, మహేందర్ రెడ్డి, ఎంపీ కవితలు వచ్చారు. వారు బాధిత కుటుంబాలను పరామర్శించారు.ఆర్టీసీ చరిత్రలోనే ఈ ప్రమాదం అతిపెద్దదిగా చెబుతున్నారు.మృతుల్లో అధికశాతం పెద్దపల్లి, జగిత్యాలలకు చెందినవారే. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగిస్తున్నారు.

Image result for bus accident in telangana

బస్సు ప్రమాదంపై డ్రైవర్ శ్రీనివాస్ బంధువులు స్పందించారు. బస్సు ఫిట్‌నెస్ లేదని శ్రీనివాస్ ముందే చెప్పాడని అన్నారు. డ్యూటీకి వెళ్లేది లేదని డ్రైవర్ శ్రీనివాస్ మారాం చేశారని ఆవేదనగా చెప్పారు.అయినా విధులకు హాజరు కావాలని డిపో మేనేజర్ ఆదేశించారని మండిపడ్డారు.అతను ఆదేశించకుంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగేది కాదని డ్రైవర్ బంధువులు ఆరోపిస్తున్నారు.ఈ ప్రమాదం జరగడానికి కారణం డిపో మేనేజర్ అని డ్రైవర్ బంధువులు ఆరోపిస్తున్నారు.బస్సు ప్రమాదం చాలా బాధాకరమని ఈటెల రాజేందర్ అన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు తెలిపారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

మృతుల్లో రైతులు ఉంటే బీమా ద్వారా మరో రూ.5 లక్షలు పొందే అవకాశముందన్నారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందిస్తామని చెప్పారు.కొండగట్టులో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై మాట్లాడేందుకు మాటలు రావడం లేదని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని అన్నారు.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.ఈ ప్రమాదం గురించి అలాగే బస్సు ఫిట్ నెస్ సరిగ్గా లేదని చెప్పిన పంపించిన డిపో మేనేజర్ గురించి అలాగే డిపో మేనేజర్ మీద డ్రైవర్ బంధువులు చేసిన ఆరోపణల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.