ఆవుపేడతో వీరు తయారు చేసిన వస్తువుకి కోట్ల రూపాయలు వచ్చింది.. అదేంటో తెలిస్తే షాక్

478

గోవును హిందువులు పవిత్రంగా పూజించే విషయమూ తెలిసిందే. ప్రస్తుతం దేశంలో గోవుకు ఎంత ప్రాధాన్యత పెరుగుతుంది.ఈ నేపధ్యంలో గోమూత్రం, పేడ కూడా అత్యంత విలువైనవిగా మారిపోతున్నాయి.గోమూత్రాన్ని పూజలప్పుడు ఇంటి శుద్ది చేయడానికి,గోవు పేడను ఇంటి ముందు కల్లాపి చల్లుకోవడానిక,పిడకలు కొట్టడానికి ఉపయోగిస్తారని మనకు తెలుసు.అయితే కొన్ని ఊర్లలో గోవు పేడ అలా పేరుకుపోతుంది.దానిని ఏం చెయ్యాలో తెలియక కొన్ని అవసరాలకు ఉపయోగించి మిగిలిన దానిని అలాగే ఉంచుతారు.కానీ ఇక నుంచి ఆ పేడను అలాగే ఉంచకండి.దానితో డ్రెస్ తయారుచేసుకోండి.పేడతో డ్రెస్ ఏమిటి అనుకుంటున్నారా..ఒక వ్యక్తి పేడతో డ్రెస్ చేసుకుని అందరిని ఆశ్చర్య పరిచాడు.మరి ఆ విషయం గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for cow dung

నెదర్లాండ్‌లోని ఒక స్టార్టప్ కంపెనీ ఆవు పేడనుంచి సెల్యూలోజ్ వేరుచేసి, దానితో ఫ్యాషనబుల్ డ్రెస్‌లను రూపొందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. నెదర్లాండ్‌కు చెందిన బయోఆర్ట్ ఎక్స్‌పర్ట్ జలిలా ఎసాయిదీ ఈ స్టార్టప్ కంపెనీని నిర్వహిస్తున్నారు.ఆ కంపెనీ గోవుపేడ నుంచి సెల్యూలోజ్‌ తీసి అందమైన దుస్తులు తయారు చేస్తోంది.ఆమె 15 మంది రైతులతో కలిసి భారీ పేడ శుద్ధి కర్మాగార నిర్మించారు.ఆమె ఈ విషయం గురించి మాట్లాడుతూ..గోమయాన్ని సేకరించినప్పుడు అందులో 80 % నీరే ఉంటుంది. అందులోంచి తడి, పొడి పదార్థాలను వేరు చేస్తాం. తర్వాత ఫెర్మెంటేషన్‌ ప్రక్రియ ద్వారా సెల్యూలోజ్‌గా మారుస్తామని ఆమె తెలిపారు.

Image result for cow dung

ఇలా ముడిసరుకు వచ్చిన తర్వాత వివిధ దశల్లో వస్ర్తాల తయారీ జరుగుతుంది.వస్త్ర పరిశ్రమల్లో క్రాఫ్ట్‌ పద్ధతి కంటే మా పని సులువుగా అవుతుంది. ఇక్కడ ఎక్కువ ఒత్తిడిఅవసరం ఉండదు. ఎందుకంటే ఫైబర్‌ను మృదువుగా చేసే పని చాలావరకు ఆవు కడుపులోనే అయిపోతుందని ఆమె వివరించారు.మోడల్స్‌ వాటిని ధరించి ర్యాంప్‌పై క్యాట్‌వ్యాక్‌ చేస్తున్నారు. భవిష్యత్తులో గోమయ వస్త్రాలు ఫ్యాషన్‌ ప్రపంచాన్ని ముంచెత్తినా ఆశ్చర్యం లేదని చెబుతోంది. సిల్కు దుస్తులు మర్చిపోండి.. వీటిని కట్టుకోండి అంటూ ప్రచారం చేస్తోంది.ప్రజల్లో ఉన్న అనుమానం ఏమిటంటే ఆవు పేడ దుస్తులు కంపుకొడతాయా అని. దీన్ని నివృత్తి చేసేందుకు ఆర్‌టీఎల్‌ అనే డచ్‌ టీవీ చానల్‌ చొరవ తీసుకుంది. ఈ దుస్తులను వీధుల్లో ఊరేగించి జనానికి చూపించింది. వాటిని వాసన చూసిన జనం ధరించడానికి మాకేం అభ్యంతరం లేదని చెప్పారు.కాగా జలిలా దీనిని ఫ్యూచర్ ఫ్యాబ్రిక్‌గా పేర్కొంటున్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఆవు పేడతో రూపొందించిన దుస్తులు ఎంతో అందంగా ఉంటాయని జలిలా అన్నారు. ఆవుపేడ పొలాల్లో క్రిమిసంహారిణిగా ఉపయోగపడుతుందని తెలుసు కాని,అందమైన డ్రెస్ గా కూడా ఉపయోగపడుతుందని తెలుసుకుని అందరూ ఆశ్చర్యపోతున్నారు..ఆమె వినూత్న ఆలోచనలు, కృషి ఇప్పటికే పలు అవార్డులు గెలుచుకున్నాయి. ఈ నూతన ఆవిష్కరణకు చివాజ్ వెంచర్ అండ్ హెచ్ఎం ఫౌడేషన్ గ్లోబల్ అవార్డు పురస్కారంతోపాటు, రూ. 1.40 కోట్ల నగదు బహుమతి లభించింది.నిజంగా గ్రేట్ ఐడియా కదా.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.ఆ పేడ దుస్తుల మీద అలాగే ఆవుపేడతో దుస్తులు చేస్తున్న విధానం మీద అలాగే వాటిని వేసుకుంటే కలిగే లాభనష్టాల మీద మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రుపంలో చెప్పండి.