ఆరుగురితో ఆ పని చేస్తూ..చివరికి ఎలా బుక్కైయాడో తెలిస్తే షాక్

239

కులం.. మతం ఏదైనా మన దేశంలో వివాహ బంధానికి ఒక పవిత్ర త ఉంది. వేద మంత్రాల సాక్షిగా వధూవరులు ఒక్కటై కష్టం..సుఖంలో జీవి తాంతం తోడునీడగా ఉంటానని ప్రమాణం చేసి వివాహం చేస్తుంటారు.వంద అబద్ధాలు చెప్పి ఒక పెళ్లి చేయమంటారు. అంతకన్నా కూడా ఎక్కువ అబద్ధాలే చెప్పి ఒక వ్యక్తి ఏకంగా ఐదుగురిని పెళ్లి చేసుకున్నాడు.. ‘బంగారం’ లాంటి భర్త దొరికాడు అని భార్య మురిపెం సాంతం తీరకుండానే, ఆమెను మోసం చేసి వదిలేసేవాడు.ఆరు పెళ్లిళ్లతో మోసాలకు పాల్పడిన ఈ నిత్య పెళ్లికొడుకు మోసాలు పోలీసులనే నివ్వెరపరుస్తున్నాయి.మరి అతని గురించి ఆయన చేసిన మోసాల గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for marriages

తమిళనాడు దిండుక్కల్, తెన్నంపట్టి ప్రాంతానికి చెందిన మురుగన్ ఓ కిరాణా కొట్టు యజమాని. ఇతడు ఆరుగురిని ప్రేమ పేరుతో మోసం చేసి వివాహం చేసుకున్నాడు. ఆరోసారిగా రాధ అనే మహిళను పెళ్లాడాడు. పెళ్లైన కొద్దిరోజులకు వీరి వివాహం సజావుగా సాగింది. వీరికి ఓ అబ్బాయి పుట్టాడు. రాధ రెండోసారి గర్భం దాల్చింది. కానీ ‌మురుగన్‌కున్న అప్పులతో ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో మురుగన్ కొద్ది రోజుల క్రితం కనిపించకుండాపోయాడు. భర్త కనిపించకపోవడంతో రాధ పోలీసులకు ఫిర్యాదు చేసింది.రాధ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ విచారణలో పోలీసులకు షాకయ్యే వివరాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

మురగన్ ఐదుగురు మహిళలను వివాహం చేసుకుని మోసం చేశాడని, ఆరో భార్య రాధను వదిలి ఏడోసారిగా ఓ అమ్మాయితో లేచిపోయాడని తెలిసింది. దీంతో తాను మోసపోయాననే వార్త విని ఆ గర్భిణిగా వున్న రాధ షాకైంది. పరారీలో వున్న మురుగన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుడిపై బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.ఈ కేసులో కోర్టు అతనికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అప్పటి నుంచి నిందితుడు తప్పించుకుని తిరుగుతున్నాడు.పోలీసులు తీవ్రంగా శ్రమించి అతని కోసం గాలించగా నిందితుడిని కోయంబత్తూర్ లో అరెస్ట్ చేశారు. చూశారుగా ఈ నిత్య పెళ్లికొడుకు పెళ్లిల గురించి.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.ఈ నిత్య పెళ్లి కొడుకు గురించి అలాగే ఈయన చేసిన మోసాల గురించి అలాగే ఇలా పెళ్లిళ్ల పేరు చెప్పి మోసాలకు పాల్పడే వారి గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.