ఆమె కడుపులో నుంచి ఏం వచ్చిందో చూసి షాకయిన డాక్టర్లు

951

ఈమె ప్రెగ్నెంట్ అనుకుంది.. మరికొద్ది రోజుల్లో ఓ బిడ్డ‌కు జ‌న్మ‌నిస్తాన‌నుకుంది ఈ మ‌హిళ‌ కానీ చివరికి ఏం జ‌రిగిందంటే బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌లేదు. అస‌లు ఆమె గర్భవతే కాదని తెలిసింది. .ఆస్ట్రేలియాలోని పెర్త్ కు చెందిన లారెన్ నోలెస్ జీవితంలో చోటుచేసుకున్న ఘటన ఇది. ఆస్ట్రేలియాకు చెందిన ఈ మహిళ తాను ప్రెగ్నెంట్‌ననుకుంది.

ఈ క్రింది వీడియో చూడండి.

అయితే నిజం తెలిసే సరికి ఆమెకు ప్రాణాలు పోయినట్లనిపించింది. మొదట్లో లారెన్స్ తన కడుపులో పెరుగుతోంది ఓ బిడ్డ అని అనుకుంది. ప్రెగ్నెన్సీ టెస్టులు చేపిస్తే పాజిటివ్ అనే వచ్చాయి. కానీ ఏడో వారం తర్వాత చూస్తే ఆమె కడుపులో పెరుగుతోంది ట్యూమర్ అని స్కానింగ్ లో తేలింది.అయితే ఆమె పొట్ట గర్భవతిలా ఉబ్బడానికి ముఖ్య కారణం ట్యూమర్ వ్యాధి అట..! ఓ భయంకరమైన వ్యాధి త‌న‌కు సోకిందని ఇప్పుడు ఆమెకు తెలిసివచ్చింది.

Image result for pregnant woman
లారెన్ తన జీవితంలో చోటుచేసుకున్న ఈ చేదు ఘటనను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.యుటరస్‌లో పిండం తయారయ్యే ప్రాంతంలో ఆమెకు ట్యూమర్ ఏర్పడింది. అయితే ఈ విషయాన్ని లారెన్ గుర్తించలేదు. ఆమె శరీరంలో కూడా ప్రెగ్నెన్సీ సమయంలో మాదిరిగానే హర్మోన్లు విడుదలయ్యాయి.

Related image

అయితే స్కానింగ్ రిపోర్టులో ఆమెకు యుటరస్ క్యాన్సర్ అని తేలింది. దీంతో చికిత్స చేయించుకోవడం ప్రారంభించిన ఆమె, చివరికి ట్యూమర్ నుంచి బ‌య‌ట‌ప‌డింది. అయితే ఆమె ఇక తల్లి అయ్యే అవకాశాలు తక్కువని వైద్యులు తేల్చిచెప్పారు. అయితే ఒక ఏడాది తరువాత లారెన్ తిరిగి గర్భం ధరించి ఒక బిడ్డకు జన్మనిచ్చింది

Image result for pregnant woman

కడుపులో బిడ్డ ఎలా ఎదుగుతుందో లారెన్ కడుపులో ట్యూమర్ కూడా అలాగే పెరుగుతూ వెళ్ళింది. ప్రెగ్నెన్సీ సమయంలో శరీరంలో ఎలాంటి హార్మోన్లు ఉత్పన్నమవుతాయో అలాంటి హార్మోన్లే తనకు ట్యూమర్ వచ్చినప్పుడు ఉన్నాయని లారెన్ పేర్కొంది. మొదట్లో తాను అంతా సాధారణంగానే ఉందని అనుకున్నానని కానీ ఏడో వారం నుండి బ్లీడింగ్ మొదలైందని లారెన్ తెలిపింది. ఆమె వైద్యులను సంప్రదిస్తే ఇది కూడా ఓ తరహా క్యాన్సర్ అని.. కడుపులో పెరుగుతోంది ట్యూమర్ అని చెప్పారు. దీనినిమోలర్ ప్రెగ్నెన్సీ అని అంటారని వైద్యులు తెలిపారు. దీంతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు.

Image result for pregnant woman

ఇక ఆమెకు కీమోథెరపీ నిర్వహించారు కూడా. ఆమె ఆసుపత్రిలో ఉండగా ఓ రోజు విపరీతమైన కడుపునొప్పి వచ్చింది. ఆ సమయంలో ఆమె కడుపు లోని ట్యూమర్ బయటకు వచ్చింది. సాధారణంగా ప్రసవం సమయంలో బిడ్డ కడుపులో నుండి బయటకు ఎలా వస్తుందో.. అచ్చం అలాగే ట్యూమర్ బయటకు వచ్చేసింది. అలా ట్యూమర్ బాధ నుండి ఆమె బయటకు వచ్చేసింది. అప్పుడు డాక్టర్లు ఇకపై నువ్వు తల్లివి కాలేవు అని చెప్పారు. కానీ సంవత్సరం తర్వాత లారెన్ ఓ అమ్మాయికి జన్మనిచ్చింది. లారెన్ కు ఇంతకు ముందే ఒక కొడుకు కూడా ఉన్నాడు.