అబ్బాయి పుడితే అమ్మాయని నమ్మించడానికి ఆ డాక్టర్ ఎంత నీచమైన పని చేసాడో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు

557

మ‌నం డాక్ట‌ర్ల‌ని దేవుడి రూపంగా కొలుస్తాం… ఎటువంటి ఆరోగ్య‌స‌మ‌స్య వ‌చ్చినా ప్ర‌త్య‌క్షంగా కాపాడే వ్య‌క్తి డాక్ట‌ర్ అని విశ్వ‌సిస్తాం.. అయితే ఇప్పుడు న‌కిలీ డాక్డ‌ర్లు కూడా పెరిగిపోవ‌డంతో, ఎవ‌రు స‌రైన డాక్ట‌ర్ అనేది తెలుసుకోలేక‌పోతున్నాం..నేటి త‌రుణంలో ఎక్క‌డ చూసినా న‌కిలీల బెడ‌ద ఎక్కువైపోయింది.. దీంతో వారు జ‌నాల ప్రాణాల‌తో ఆట‌లాడుకుంటున్నారు. వైద్యం చేయ‌డం తెలియ‌క‌పోవ‌డంతో వారి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే అమాయ‌కులు ప్రాణాలు కోల్పోతున్నారు…ఇలా ఓ న‌కిలీ డాక్ట‌ర్ వ‌ల్ల అప్పుడే క‌ళ్లు తెరిచిన చిన్నారి త‌న ప్రాణాల‌ను విడిచింది ..ఈ డాక్ట‌ర్ చేసిన దారుణ‌మైన ప‌ని ఏమిటో తెలిస్తే అత‌నికి మ‌ర‌ణశిక్ష విధించాల‌ని అంటారు అస‌లు విష‌యంలో కి వెళితే..

Image result for operation theatres

అది జార్ఖండ్‌లో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రి. అనుజ్ కుమార్ అనే వ్య‌క్తి ఆ హాస్పిట‌ల్‌ను ర‌న్ చేస్తున్నాడు. నిజానికి అత‌ను డాక్ట‌ర్ కాదు. న‌కిలీ డాక్ట‌ర్‌…. డాక్ట‌ర్ అవ‌తారం ఎత్తి ఆ ప్రాంతంలో జ‌నాలకు వైద్యం చేస్తూ వారిని మోసం చేస్తున్నాడు. అయితే ఆ విష‌యం తెలియ‌ని గుడియా దేవి అనే మ‌హిళ 8 నెల‌ల గ‌ర్భంతో ఆ హాస్పిట‌ల్‌లో చేరింది. ఈ క్ర‌మంలో పుట్ట‌బోయేది ఆడ‌పిల్ల అని అనుజ్ గుడియా దేవికి చెప్పాడు. తాను స్కానింగ్ చేశాన‌ని, అందులో ఆడ‌పిల్ల అని తెలిసింద‌ని అత‌ను చెప్పాడు.

Image result for operation theatres

అలా హాస్ప‌ట‌ల్‌లో చేరిన గుడియా దేవి కొన్ని రోజుల‌కు ప్ర‌స‌వించింది. డెలివ‌రీ చేసినందుకు గాను మొత్తం .10వేలు అవుతాయ‌ని అనుజ్ చెప్పాడు. అందులో భాగంగా గుడియా దేవి కుటుంబ సభ్యులు ముందుగా .5వేల‌ను ఆస్ప‌త్రిలో పే చేశారు. అయితే గుడియా దేవి మాత్రం మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. దీంతో తాను అంత‌కు ముందు ఆడ‌పిల్ల పుడుతుంద‌ని అనుజ్ గుడియాకు చెప్పిన విష‌యాన్ని గుర్తు చేసుకున్నాడు. విష‌యం తెలిస్తే త‌న ప‌రువు పోతుంద‌ని, దీంతో త‌న దందాకు ఇబ్బంది క‌లుగుతుంద‌ని భావించిన అనుజ్ ఆ మగ‌బిడ్డ జ‌న‌నావ‌య‌వాల‌ను క‌ట్ చేశాడు. తర్వాత‌ గుడియా దేవి కుటుంబానికి ఆడ‌పిల్ల పుట్టింద‌ని, కానీ కొన్ని లోపాలున్నాయ‌ని అనుజ్ చెప్పాడు. ఇది నిజ‌మేన‌ని గుడియా దేవి కుటుంబ స‌భ్యులు న‌మ్మారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అయితే జ‌న‌నావ‌య‌వాల‌ను క‌ట్ చేసినందున ఆ మ‌గ‌బిడ్డ కొంత సేప‌టికి చ‌నిపోయాడు… దీంతో గుడియా దేవి కుటుంబానికి అస‌లు విష‌యం తెలిసింది. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు… పోలీసులు కేసు న‌మోదు చేసుకుని అనుజ్‌ను అరెస్టు చేశారు. అత‌నికి డాక్ట‌ర్ డిగ్రీ లేద‌ని, న‌కిలీ డాక్ట‌ర్ అని పోలీసులు వెల్ల‌డించారు..చూశారుగా ఇలాంటి న‌కిలీ డాక్ట‌ర్లు దందాలు చేస్తూనే ఉన్నారు.. బీ కేర్ ఫుల్ .. చూశారుగా ఈ డాక్ట‌ర్ కి ఎటువంటి శిక్ష విధించాలో తెలియ‌చేయండి.