భర్తతో హనీమూన్ కు వెళ్లడమే ఆమె పాలిట శాపం అయ్యిందా.!ఈ డాక్టర్ కు ఎంత అన్యాయం జరిగిందో తెలిస్తే షాక్.

424

సమాజంలో స్త్రీలను ప్రశాంతంగా ఉండనిచ్చేటట్టు లేరు కొంతమంది మగాళ్లు.ఆడపిల్లగా ఎందుకు పుట్టాం అని ఆడపిల్లలు భయపడే స్థితికి వచ్చేశారు.ఎందుకంటే వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు అలా ఉన్నాయి మరి.తల్లిదండ్రుల వద్ద ఉన్నంతవరకే వారికి సంతోషము.ఒక్కసారి పెళ్ళైతే ఇక వారి జీవితం అంతే సంగతి.ప్రతిక్షణం భయపడుతూ బతకాల్సిన పరిస్థితి.కట్టుకున్న భర్త చేతిలో అత్తామామ చేతిలో నరకం అనుభవిస్తున్న ఆడపిల్లలు ఎందరో.వాటిని భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్న వాళ్ళు ఎందరో.ఇప్పుడు మరొక యువతీ అదే పని చేసింది.మరి ఆ ఘటన గురించి పూర్తీగా తెలుసుకుందామా.

అతని పేరు కార్తీక్. ఆయనది హైదరాబాద్‌లోని అల్వాల్‌లో ఉన్న వెస్ట్ వెంకటాపురం. భార్య పేరు జయ శ్రీ. ఆమెది కోదాడ.వారిద్దరూ డాక్టర్లు, చైనాలో కలిసి ఎంబీబీఎస్ చదువుకున్నారు. ఈ క్రమంలోనే ఒకరినొకరు ప్రేమించుకున్నారు. మేం ఇద్దరం ప్రేమించుకున్నామని చెప్పడంత. పెద్దలు పెళ్లి చేశారు. కూతురికి రూ.25 లక్షలు, 45 తులాల బంగారం, రెండు కిలోల వెండిని గురవయ్య కట్నంగా ఇచ్చాడు.హనీమూన్ కోసం నాగ్‌పూర్, సింగపూర్ వెళ్లొచ్చారు. ఇప్పటి దాకా కథ సాఫీగానే సాగింది. కానీ ఇక్కడే భర్త తన అసలు నైజం చూపించాడు. హనీమూన్‌కు అయినా ఖర్చు కూడా ఇవ్వాలని మామ గురవయ్యను కార్తీక్ డిమాండ్ చేశాడు. ఆయన ఇవ్వలేనని చెప్పడంతో అత్తింటి వారి నుంచి జయ శ్రీకి వేధింపులు మొదలయ్యాయి. ఎంతకూ ఈ వేధింపులు తగ్గకపోవడంతో.. విసిగిపోయిన ఆమె గుండె వేగం మందగించే మందులు వేసుకుంది.

ఒక్కసారిగా కింద పడిపోవడంతో గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. గురవయ్యకు ఫోన్ చేసి జయ శ్రీకి సీరియస్‌గా ఉందని చెప్పారు.కూతురి దగ్గరకు ఆయన హుటాహుటిన చేరుకునే లోపే జయ శ్రీ ప్రాణాలు వదిలింది. తన బిడ్డ ఆత్మహత్యకు పాల్పడటానికి ఆమె భర్త కార్తీక్, అత్తమామలే కారణమని జయ శ్రీ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.చూశారుగా ప్రేమించి పెళ్లి చేసుకుని డబ్బుల కోసం కట్టుకున్న భార్యను వేధించి చివరికి ఆమె ఆత్మహత్య చేసుకోడానికి కారణం ఎలా అయ్యాడో.