అత్తాపూర్ ర‌మేష్ హ‌త్య‌కు ముందు స్కెచ్ ఎక్క‌డ వేశారో తెలుసా

378

హైదరాబాద్ ప్రజలను భయబ్రాంతులకు గురిచేసిన అత్తాపూర్ లోని ర‌మేష్ హత్య వెనుక కారణం అక్రమ సంబంధమని తెలిసింది. బుధవారం హత్యకు గురైన వ్యక్తి సిద్ధి అంబర్‌ బజార్‌కు చెందిన రమేష్ అని పోలీసులు గుర్తించారు. ఓ వివాహిత మహిళతో అక్రమ సంబంధం విషయంలో రమేష్ తన ప్రాణ స్నేహితుడు మహేష్ గౌడ్‌ను దారుణంగా హత్య చేశాడు.

Image result for attapur murder

గ‌తంలో మహేష్ గొంతు కోసి, శంషాబాద్‌లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించాడు స‌ద‌రు వ్య‌క్తి . ఈ కేసులో ఉప్పరపల్లి కోర్టులో హాజరై ఆటోలో తిరిగి ఇంటికి వెళ్తున్న రమేష్‌ను ఇద్దరు దుండగులు వెంటాడారు. దీంతో రమేష్ ఆటో నుంచి బయటకు దూకి పరుగులు తీశాడు. తనను కాపాలని వేడుకున్నాడు. ఇది గమనించిన ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ దుండగులను అడ్డుకోడానికి ప్రయత్నించారు. గొడ్డలితో వెంటాడుతున్న ఓ వ్యక్తిని పట్టుకున్నారు. ఈ లోగా మరో దుండగుడు రమేష్‌ను గొడ్డలితో నరికాడు. కానిస్టేబుల్‌ను విదిలించుకుని వచ్చిన దుండగుడు ప్రాణం పోయే వరకు నరుకుతూనే ఉన్నాడు. స్థానికులు సైతం వారిని అడ్డుకోడానికి విఫలయత్నం చేశారు. ఇది పెను సంచ‌ల‌నం అయింది న‌డిరోడ్డుపై హ‌త్య‌లకు తెగ‌బ‌డటం పై అంద‌రూ షాక్ అయ్యారు.

Image result for attapur murder

పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నా.. దుండగులు భయపడలేదు. రమేష్ చనిపోయాడని నిర్ధారించుకున్న దుండగుల్లో ఒకరు ‘‘పెద్ద అల్లుడా పంపిచేశారా.. మహేషా పంపించేశారా నీ కాడికి’’ అని అరుస్తూ ప్రతీకారేచ్చతో రగిలిపోవడం కనిపించింది. పక్కా ప్రణాళిక ప్రకారమే దుండగులు ఈ హత్యకు పాల్పడ్డారని తెలుస్తోంది. రమేష్ చేతిలో హత్యకు గురైన మహేష్ గౌడ్‌ తండ్రి, మేనమామ ఈ హత్య చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

మహేష్ హత్య తర్వాత రమేష్ పై కక్ష పెంచుకున్న మహేష్ కుటుంబ సభ్యులు, అదును కోసం వేచి చూశారు. బుధవారం కోర్టుకు వెళ్లి తిరిగి వస్తున్న రమేష్‌ను అత్తాపూర్ వద్ద గొడ్డళ్లతో వెంబండించారు. అందరూ చూస్తుండగానే హత్యచేశారు. ఘటనా స్థలికి వచ్చిన పోలీసులతో.. మహేష్ హత్యకు ప్రతీకారంగానే రమేష్‌ను హత్యచేశామని చెప్పారు. అయితే అత‌ను ఈసారి దొర‌క‌క పోతే వ‌చ్చేసారి అయినా కోర్టుకు వ‌చ్చే స‌మ‌యంలో అత‌న్ని మ‌ట్టుబెట్టాలి అని ఇంటి ద‌గ్గ‌ర వీరు ఇద్ద‌రు ప్లాన్ వేసుకున్నారు అని తెలుస్తోంది. ఇక త‌మ కుటుంబం ఏ ప‌గ లేకుండా ఉంది అని ర‌మేష్ అనుకున్నాడు ఈ స‌మ‌యంలో అటాక్ చేయాలని భావించారు అని తెలుస్తోంది…చివ‌ర‌కు అదే ప్ర‌తీకారంతో ప‌గ తీర్చుకున్నారు అని తెలుస్తోంది.