మీ గోర్లు చెప్పే విషయాలు.. ఇలా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా?

434

మన శరీరంలో రోగ నిరోధక శక్తిని,ఆరోగ్యాన్ని తెలిపే ఎన్నో విషయాలు ఉంటాయి.అరచేతిలో ఉండే రేఖల వలన భవిష్యత్ ను వేళ్ళను చూసి మన స్వభావాన్ని అంచనా వేసినట్టు మన గోళ్ళ మీద కనిపించే అర్ధచంద్రాకార గుర్తు మన ఆరోగ్యం గురించి చాలా విషయాలను తెలుపుతుంది.అది ఏమి చెబుతుందో మనకు తెలీదు.ఇప్పుడు మీకు ఆ విషయాల గురించి చెబుతా వినండి.

Image result for nails

చేతి వేలి గోర్ల‌పై కింది వైపుకు ఉండే భాగంలో అర్ధ‌చంద్రాకారంలో నెల‌వంక‌ను పోలిన ఓ ఆకారం ఉంటుంది. దాన్ని మీరు ఎప్పుడైనా గ‌మ‌నించారా? గ‌మ‌నించే ఉంటారు లెండి. కానీ దాని గురించి మీకు తెలిసి ఉండ‌దు. కాగా ఆ ఆకారాన్ని ‘లునులా (lunula)’ అని పిలుస్తారు. ఈ లునులా మ‌న శ‌రీరంలోని అత్యంత సున్నిత‌మైన భాగాల్లో ఒక‌టిగా చెప్ప‌బ‌డుతోంది.ఈ లునులా దెబ్బ‌తింటే మాత్రం ఆ గోరు పూర్తిగా నాశ‌న‌మ‌వుతుంద‌ట‌. ఒక వేళ ఏదైనా గోరును స‌ర్జ‌రీ చేసి తీసేసినా లునులా మాత్రం దెబ్బ‌తిన‌ద‌ట‌. అది ఎంత కాల‌మైనా అలాగే ఉంటుంద‌ట‌. ఈ క్ర‌మంలో లునులా ఉండే ఆకారాన్ని, రంగును బ‌ట్టి మ‌నం ఎదుర్కొంటున్న ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా సుల‌భంగా తెలుసుకోవచ్చ‌ట‌.అవేమిటి అంటే..

Related image

వేలి గోరుపై లునులా అస‌లు లేక‌పోతే వారు రక్త‌హీన‌త‌, పౌష్టికాహార లోపం వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నార‌ని తెలుసుకోవాలి.ఒక‌వేళ లునులా రంగు నీలం లేదా పూర్తిగా తెలుపులో పాలి పోయి ఉంటే వారికి డ‌యాబెటిస్ రాబోతుంద‌ని అర్థం చేసుకోవాలి.లునులా మీద ఎరుపు రంగులో మ‌చ్చ‌లు ఉంటే వారికి గుండె సంబంధ వ్యాధులు ఉన్నాయ‌ని తెలుస్తుంది.లునులా ఆకారం మ‌రీ చిన్న‌గా, గుర్తు ప‌ట్ట‌లేనంత‌గా ఉంటే వారు అజీర్ణంతో బాధ‌ప‌డుతున్నార‌ని, వారి శ‌రీరంలో విష, వ్య‌ర్థ పదార్థాలు ఎక్కువ‌గా పేరుకుపోయాయ‌ని తెలుసుకోవాలి.కొందరిలో కాళ్లు లేదా చేతి గోర్లు పాలిపోయినట్లుగా ఉంటాయి. అంటే వీరి శరీరంలో ఐరన్ శాతం తక్కువైందని అర్థం. దీని కారణంగా రక్తహీనత, హార్ట్ ఎటాక్ మరియు లివర్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

గోర్లు పసుపు వర్ణంలో ఉండి మళ్ళీ సాధారణ స్థితికి చేరి, మళ్ళీ పసుపు రంగులోకి మారుతూ ఉంటాయి. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే తీవ్రమైన ఇన్ఫెక్షన్స్ కారణం. ముఖ్యంగా ఊపిరితిత్తుల సమస్య మరియు మధుమేహంతో బాధపడేవారిలో ఇలా ఎక్కువగా కనిపిస్తాయట.చూశారుగా మన గోరుపై ఉండే అర్ధచంద్రాకార గుర్తు గురించి కొన్ని ముఖ్య విషయాలు.మరి మేము ఇచ్చిన ఈ సమాచారం గురించి మీరేమంటారు.చేతి గోరుపై ఉండే ఆ గుర్తు గురించి అలాగే ఆ గుర్తు వలన మన ఆరోగ్య సమస్యలను తెలుసుకోవచ్చు అన్న అంశం మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.