ముద్దుపెట్టుకుంటే శరీరంలో ఏమవుతుందో తెలుసా.?

274

ఈ ప్రపంచంలో ఎన్నో రకాల జీవరాశులు జీవిస్తున్నాయి. వాటిలో మానవుడు కూడా ఒక జాతికి చెందుతాడు. అయితే మనిషి తప్ప ఏ ఇతర జీవరాశి అయినా తన ప్రేమను, ఆప్యాయతను ఇతర జీవుల పట్ల ఎలా పంచుకుంటుంది? జంతువులైతే తమ ముక్కులను ఒకదానితో ఒకటి రాసుకుని ప్రేమను కనబరుస్తాయి. అదే మనిషి విషయానికి వస్తే ఆయా ప్రాంతాల వ్యవహార శైలులకు అనుగుణంగా కొందరు ఆప్యాయంగా కౌగిలించుకుంటారు. మరికొందరు ముద్దు పెట్టుకుని తమ అభిమానాన్ని ఇతరుల పట్ల చాటుకుంటారు.ఫ్రెంచ్ కిస్, ఇంగ్లిష్ కిస్… ఇలా ముద్దుల్లో అనేక రకాలు ఉన్నాయి. మన దగ్గరైతే దాన్ని శృంగార ప్రక్రియలో ఒక భాగంగా తీసుకుంటారు విదేశాల్లో ముద్దు పెట్టుకోడం అంటే చాలా కామన్. ముద్దు పెట్టుకోవడమనే క్రియ ద్వారా వారి ఆరోగ్యానికి మంచే జరుగుతుందట. మరి కిస్సింగ్ వల్ల కలిగే ఆ హెల్త్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందామా..

Image result for kissing

‘‘ముద్దు’’ అనేది ఓ తీయని అనుభూతి. ప్రేమకు ప్రతిరూపంగా ముద్దును ఉపయోగిస్తారు. ముద్దులో రకాలు కూడా ఉంటాయి. ముద్దులన్నింటినీ శృంగారంతో ముడిపెట్టలేం. ఎందుకంటే.. తల్లి బిడ్డలు, అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ములు, తండ్రి కూతుళ్లు, భార్య భర్తలు.. ఇలా ప్రతి బంధంలోనూ ఏదో ఒక సమయంలో తమ ప్రేమను వ్యక్తపరిచేందుకు ముద్దు పెడుతూనే ఉంటారు. ముద్దు పెట్టుకోవడం వలన కపుల్స్ ఎక్కువ సంతోషంగా ఉంటారట. ఒకరి భావాలను మరొకరితో పంచుకునేందుకు కూడా ముద్దు ఉపయోగపడుతుందట.స్ట్రెస్, డిప్రెషన్ దూరమవుతుంది. ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడుతుంది.ముద్దు పెట్టుకునే ప్రక్రియలో శరీరం అడ్రినలిన్ అనే రసాయనాలను విడుదల చేస్తుందట. దీని వల్ల వివిధ రకాల నొప్పులు తగ్గిపోతాయట.ముద్దు పెట్టుకునే సమయంలో ఎక్కువగా ఉత్పన్నమయ్యే సలైవా (ఉమ్మి) దంతాలను సంరక్షిస్తుందట. దీని వల్ల దంత క్షయం దూరమవడంతోపాటు వాటిలో పేర్కొన్న వ్యర్థాలు తొలగింపబడతాయట.

ఈ క్రింది వీడియో చూడండి 

కిస్ చేయడం వల్ల సెరటోనిన్, డోపమైన్, ఆక్సిటోసిన్ వంటి రసాయనాలు శరీరంలో విడుదలవుతాయట. ఇవి రిలాక్స్‌డ్ ఫీలింగ్‌ను ఇవ్వడమే కాదు, మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తాయట.అంతేకాదు తలనొప్పి కూడా తగ్గుతుంది. ముద్దు పెట్టుకోవడం వల్ల ఆడ, మగ ఇద్దరిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందట.మెడ, దవడ కండరాలకు వ్యాయామం జరిగి అవి మంచి షేప్‌కు వస్తాయట.నిమిషానికి 2 నుంచి 3 క్యాలరీలు ఖర్చవుతాయట. దీంతోపాటు శరీర మెటబాలిక్ రేట్ కూడా పెరుగుతుందట. ఈ క్రమంలో బరువు తగ్గేందుకు కూడా అవకాశం ఉంటుందట.రక్తపోటును నియంత్రించడంలోనూ కిస్సింగ్ బాగానే పనిచేస్తుందట.కాబట్టి వీలైనంతవరకు ముద్దు పెట్టుకోండి.మరి ముద్దు పెట్టుకోవడం కలిగే లాభాల గురించి అలాగే ఇంకా ముద్దు వలన కలిగే లాభాలు ఏంటో మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.