వీర్యం ఎక్కువగా పోవడం వలన ఏమి జరుగుతుందో మీకు తెలుసా

721

పురుషుల్లో చాలా మందికి వీర్యం ఎక్కువ‌గా పోతే, శ‌రీరంలో ఎటువంటి ప‌రిస్దితి వ‌స్తుంది అని భ‌య‌ప‌డుతూ ఉంటారు.. సెక్స్ కోరిక‌లు స‌రిగ్గా రావా అని ఆలోచిస్తారు. అలాగే సెక్స్ సామ‌ర్ధ్యం త‌క్కువ‌గా ఉంటుంది అని భ‌య‌ప‌డతారు.. వీరికి మ‌రి కొంద‌రు తోడై ఇదే నిజం అని వారిని మ‌రింత భ‌య‌పెడతారు.. అస‌లు వాస్త‌వంగా డాక్ట‌ర్లు ఏం చెబుతున్నారు అనేది ఈరోజు తెలుసుకుందాం.. వీర్యం ఎక్కువ‌గా పోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎటువంటి హానీ జ‌రుగుతుంది, అస‌లు మంచి జ‌రుగుతుందా హాని జ‌రుగుతుందా అనేది తెలుసుకుందాం.

Image result for sperm

గ‌తంలో పురుషుల‌కు వీర్యం బ‌య‌ట‌కు పోతే చాలా స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని ముఖ్యంగా స‌న్న‌గా అయిపోతారు అని చెబుతారు… ఇలా పుకార్లు ప్ర‌చారం చేసేవారు.. మ‌న శ‌రీరంలో ఇదే బ‌ల‌మైన శ‌క్తివంత‌మైన ప‌దార్ధం అనేలా చెప్పేవారు. ఇక సైన్స్ ఇంత అభివృద్ది చెందినా ఇప్పుడు కూడా ఇలాంటి మాట‌లే చెబుతున్నారు. ఇది క‌రెక్ట్ కాదు అని సెక్సాల‌జిస్టులు చెబుతున్నారు. ఇక వంద‌ర‌క్త‌పు బొట్ల‌తో ఓ వీర్య‌పు బొట్టు స‌మానం అనిఇప్ప‌టికీ చెబుతున్నారు ఇవ‌న్నీ న‌మ్మ‌కూడ‌దు అని అదంత బ‌లైమ‌న ప‌దార్ధం కాదు అని చెబుతున్నారు.

Image result for sperm

ఇది సైన్స్ కూడా ఫ్రూవ్ చేసింది అంటున్నారు.. వీర్యం ఎలా త‌యారు అవుతుంది అనేది తెలుసుకుంటే..టెస్టిక‌ల్స్ లో వీర్య‌క‌ణాలు త‌యారు అవుతాయి ..ఈ వీర్య‌క‌ణాలు త‌యారు అయి శుక్ర‌కోశాల్లో చేర‌తాయి..త‌ర్వాత అక్క‌డ స్టోర్ అవుతాయి.. ఆ ప్రాంతంలో శుక్ర‌క‌ణాలు బ్ర‌త‌క‌డానికి ఓ ద్ర‌వం త‌యారు అవుతోంది.. దీనికి విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ తోడు అవుతాయి దీనివ‌ల్ల ఆ వీర్యం బ‌లంగా మారుతుంది.. ముఖ్యంగా ఈ ద్ర‌వం శుక్ర‌క‌ణాలు బ్ర‌త‌క‌డానికి తోడ్ప‌డుతుంది.. ఇక సెక్స్ కోరిక‌లు వ‌చ్చిన స‌మ‌యంలో శుక్ర‌క‌ణాలు ముడుచుకుని ఉంటాయి ఆ స‌మ‌యంలో ప్రొటెస్ట‌డ్ గ్రంధి వీర్య‌క‌ణాల‌ను బ‌య‌ట‌కు పంపుతుంది. ఇలా చేసిన త‌ర్వాత వారి వీర్యం బ‌య‌ట‌కు పోతుంది.

ఒక వ‌న్ సీసీ పరిమాణంలో వీర్యం తీసుకుంటే 5 శాతం వీర్య‌క‌ణాలు మాత్ర‌మే ఉంటాయి.. మిగిలిన 95 శాతం వీర్య‌క‌ణాలు బ‌య‌ట‌కు నెట్ట‌డానికి మాత్ర‌మే ఆ ద్ర‌వం ఉప‌యోగ‌ప‌డుతుంది.. ఇక ఇలాంటి విష‌యాల్లో సెక్స్ గురించి చెప్పేవి చాలా మంది అపోహ‌లు మాత్ర‌మే, ఇవ‌న్నీ మోస‌గాళ్లు చెప్పే ప్ర‌చారం.. అందుకే అటువంటి మాట‌లు న‌మ్మ‌కండి అని చెబుతున్నారు వైద్యులు.. వీర్యం పోవ‌డం వ‌ల్ల మ‌నిషి బ‌క్క‌చిక్కిపోతాడు అని చెప్పేది అంతా ఓ అవాస్త‌వం అని సెక్సాల‌జిస్టులు చెబుతున్నారు. హ‌స్త‌ప్ర‌యోగం చేసుకోవ‌డం వ‌ల్ల కూడా ఎటువంటి ప్ర‌మాదం లేదు కాని, అదే పనిగారోజూ హ‌స్త‌ప్ర‌యోగం చేయ‌డం వ‌ల్ల కొద్దిగా దుష్ప‌లితాలు వ‌స్తాయి అని అంటున్నారు శృంగార నిపుణులు. చూశారుగా ఈ వీడియోపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.