భర్త భార్యకు మల్లెపూలు కొనిస్తే…ఏం జరుగుతుందో తెలుసా.? ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలి

497

మల్లెపూలు… ఈ మాట వినగానే మగువలు మనసు పారేసుకుంటారు. మనకు తెలిసినంత వరకు మల్లెపూలు మహిళలకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఇదొక్కటే కాదండోయ్… ఈ పూలలో అనేక ఔషధగుణాలు ఉన్నాయని మరచిపోకండి.ప్రతిరోజూ మల్లెపూలను తలలో పెట్టుకోవడం వల్ల ఆహ్లాదంగా ఉండడమే కాదు.వారి కళ్లకూ మేలు జరుగుతుంది. మనతోపాటే మనలోని అవయవాలు అలసిపోతాయి. కళ్లు బాగా అలసినప్పుడు కొన్ని మల్లెపూలను రెప్పలపై పెట్టుకుంటే చల్లగా ఉంటుంది. అంతేకాదు మంచి నిద్ర పడుతుంది.అయితే మీ భర్త మీకోసం మల్లెపూలు తీసుకొస్తున్నాడా..తీసుకురావడం లేదా..అయితే రోజు మీ భర్తతో మల్లెపూలు తీసుకురమ్మని చెప్పండి.ఎందుకు అనుకుంటున్నారా..అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ విషయం గురించి వినండి.

ఇంటి గడపపై కాళ్లు పెట్టకూడదు..ఒక వేళ అలా పెడితే మొక్కుకోవాలి..నల్లపిల్లి ఎదురైతే కీడు..ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు తుమ్మడం అపశకునం ఇలా ఎన్నో నమ్మకాల గురించి మన ఇళ్లల్లో మనం నిత్యం వింటూనే ఉంటాం..వీటిని కొందరు మూఢనమ్మకాలని కొట్టిపారేసినా..మరికొందరు ఇప్పటికి పాటిస్తూనే ఉంటారు.మనిషి ఏ ఉద్యోగం చేసినా వ్యాపారం చేసిన ఏవో ఒక ఒడిదుడుకులు ఉంటూనే ఉంటాయి. కష్టాలు, నష్టాలు లేకుండా మనిషి జీవితం ఎక్కడ సాగుతుందండి. అవి ఉండటం ఎంత సహజమో, మనం ధైర్యంతో వాటిని ఎదుర్కోవడం అంత అవసరం.అలాగే ఇంటిని చూసి ఇల్లాలిని చూడమన్నారు పెద్దలు.నిజమే ఇంట్లో ఆడవారుంటే ఆ కళే వేరు..అలాంటి ఆడవారు ఎప్పుడూ సంతోషంగా ఉంటే,ఆ కుటుంబమే సంతోషంగా ఉంటుంది.ఆడవాళ్ళు ఎంత ఆనందంగా సంసారాన్ని సాగిస్తే ఆ ఇంట్లో వారి జీవితం అంత ఆనందంగా ఉంటుంది.ఇల్లు ఇల్లాలు కళగా ఉంటె లక్ష్మీదేవి పిలవకుండానే వస్తుందని పురాణసారం.

ఎప్పుడు కూడా ఇల్లు, ఇల్లాలు కలగా ఉండాలి. ఇంటిని చూసినా ఇలాల్లిని చూసిన మగవాడిలో ఆనందం, బ్రతకాలనే ఆశ, బ్రతికించాలనే పట్టుదల కలిగేలా ఉత్తేజాన్ని ఇవ్వాలి.ఆడవాళ్ళు ఎంత ఒద్దిగ్గా, అందంగా, ఆనందంగా సంసారాన్ని సాగిస్తే ఆ ఇంట్లో వారి జీవితం అంత ఆనందంగా ఉంటుంది.మనిషిని వేదించే సమస్యల్లో ఒకటి ఆర్దికసమస్యలు..అలాంటి సమస్యలు దూరం కావాలంటే ముందు మీ ఇంటి ఆడవారిని సంతోషంగా ఉంచండి. మగవారు భార్యకు రోజు మూరడు మల్లెపూలను కొని తీసుకువెళ్తే చాలా మంచిది.మీకు ఉద్యోగంలో, వ్యాపారంలో తగినంత సంపాదన లేక పోతే ఇలా తప్పకుండా చేయండి.ప్రతి రోజు ఆమె తలలో మల్లె పూలు సింగారించుకొంటే శుక్రుడు అనుగ్రహిస్తాడు.. ఇదే కాక పరిమ భరితమైన జాజి, విరజాజివి వంటివి కూడా ఇవ్వచ్చు.. శుక్రుడు అనుగ్రహిస్తే ఉద్యోగ, వ్యాపారాలు కలిసి వచ్చి సంపద కలుగుతుందని శాస్త్రాలు చెపుతున్నాయి.విన్నారుగా భార్యకు రోజు మూరెడు మల్లెపూలు తీసుకెళ్తే మనకు ఎంత మంచి కలుగుతుందో.కాబట్టి మీ భార్యలకు మల్లెపూలు తీసుకెళ్లడం అలవాటు చేసుకోండి.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.