ఎర్ర‌గ‌డ్డ ఘ‌ట‌న తెలియ‌గానే మారుతిరావు ఎలా ఫీల‌య్యాడో తెలిస్తే మ‌తిపోవ‌డం ఖాయం

416

కాళ్లపారాణి కూడా ఆరని వధూవరులపై నెత్తురు చిమ్మింది! మొన్నటికి మొన్న మిర్యాలగూడలో ప్రణయ్‌ హత్య ఘటనను మరువకముందే అదే తరహాలో హైదరాబాద్‌ నడిబొడ్డున దారుణం జరిగింది. కూతురు తక్కువ కులం వాడిని పెళ్లి చేసుకుందని తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయాడా తండ్రి! అయితే, మారుతీరావులా కూతురిని బెదిరించలేదు.. హత్య కోసం ఎవరికీ సుపారీ ఇవ్వలేదు. అతడిలానే అల్లుడినే టార్గెట్‌ చేసుకున్నాడు. ఇందుకు.. తాను మారినట్లు నటించాడు. అప్పటిదాకా తిట్టిపోసిన నోటితోనే కూతురి పెళ్లిని స్వాగతించాడు. తన కళ్లతో పెళ్లిని చూడలేకపోయానని.. రిసెప్షన్‌ను అయినా ఘనంగా జరిపిస్తానని నమ్మబలికాడు. కొత్తబట్టలు ఇప్పిస్తానని.. బట్టల దుకాణానికి రావాలని చెప్పాడు.

నమ్మి ఇద్దరూ వెళ్లగా.. వెంట తెచ్చుకున్న కొబ్బరిబోండాలను నరికే కత్తితో అల్లుడిపై విచక్షణారహితంగా దాడి చేశాడు.అయితే ఈ విష‌యాన్నిపోలీసుల రిమాండ్ లో ఉన్న మారుతిరావుకి పోలీసులు తెలియ‌చేశారు అని తెలుస్తోంది.. ఈ స‌మ‌యంలో మారుతిరావు ఎటువంటి మాట మాట్లాడ‌లేద‌ని మ‌నోహ‌ర‌చారి నీలాగే పెళ్లి చేసుకున్న త‌న కూతురిపై కూడా దాడి చేశాడు అని పోలీసులు తెలియ‌చేశారు అని తెలుస్తోంది, అయితే మారుతిరావు మాత్రం కుమార్తెల పై ప్రేమ ఉన్న‌వాళ్లు చేసే ప‌ని ఇంతే అని, ప్రేమించిన వాడికంటే మాకే ఎక్కువ ప్రేమ ఉంటుందని అన్నాడ‌ట, మారుతి రావు కామెంట్లు విని షాకైన పోలీసులు మారుతిరావు ఇంకా మార‌లేదు అని అనుకున్నార‌ట‌,అయితే ఇలాంటి దాడులు చేయ‌డానికి ఇంకా త‌ల్లిదండ్రులు వెనుకాడ‌టం లేదు అని చ‌ర్చించుకుంటున్నారు అంద‌రూ, ఇప్పుడు వీదివీదికి ఓ మారుతిరావు త‌యారు అవుతున్నారు అని అంటున్నారు, ఇక్క‌డ కులాల కోసం హ‌త్య‌లు చేస్తున్నారా లేదా త‌మ కూతురు ప్రేమ పెళ్లి చేసుకుంది అని హ‌త్య‌లు చేస్తున్నారా అనేది అంద‌రూ చ‌ర్చించుకుంటున్న అంశం, అగ్ర‌వ‌ర్ణాలు అనే మాట అమ్మాయిల నుంచి వ‌స్తోంది.

నిమ్న కులాలు అనే మాట ఇరువురు అబ్బాయిల పై వ‌స్తోంది, మొత్తానికి ఇలాంటివి స‌మాజంలో ఉండ‌కూడ‌దు అంటే.కుల‌వివ‌క్ష‌త చూపించ‌కూడ‌దు, కులం గోడ‌లు బ‌ద్ద‌లు కొడితేనే ఇలాంటి దారుణాలు జ‌రుగ‌వు అంటున్నారు యువ‌త‌, ఇక సొంత అల్లుడ్ని చంపిన మారుతిరావు మాత్రం తానుచేసింది క‌రెక్ట్ , అందుకే ఇప్పుడు కూడా మ‌నోహ‌ర‌చారి చేశాడు అనేలా స్టేట్ మెంట్లు ఇస్తున్నాడు అని తెలుస్తోంది, ఇలాంటి దారుణాలు జ‌రుగుకుండా ఆపాల్సిన బాధ్య‌త అంద‌రిపైనా ఉంది, మ‌రి మారుతీరావు చేసిన కామెంట్ల పై మీ అభిప్రాయాన్ని తెలియ‌చేయండి.