స్త్రీకి యవ్వనం ఎన్ని రోజులు ఉంటుందో తెలుసా.?

1104

యవ్వనం నుంచీ వృధ్ధాప్యం వరకూ ప్రజల జీవితాన్నే పాలించే మహా మహా శక్తిని గురించి రాయడంగానీ, మాట్లాడడం గాని బూతైపోయింది. అందువల్ల ప్రేమ విషయమై నిర్మలమైన జ్ఞానం నశించి, ఎవరి వూహలు వాళ్ల మనసుల్లోనే కుళ్లి చెడిపోతున్నాయి. ఒకరు పొందగలిగిన అనుభవ లాభం ఇంకొకరికి లభించడం లేదు. కామం సిగ్గుపడవలసిన విషయం అనుకోవడం వల్ల, వారి ఊహలూ, కోర్కెలూ ఎవరితోనూ చెప్పుకోకపోవడం వల్ల ప్రజలలో దీనిని గురించి చాలా తప్పు అభిప్రాయాలు బైలుదేరాయి. ఈ అజ్ఞానం అధికమైన దుఃఖాన్నీ, బాధనీ కలిగిస్తోంది. స్త్రీకి యవ్వనం ఉన్నన్ని రోజులు ఆమె చుట్టూ మగాళ్లు ఈగల్లాగా వాలుతూనే ఉంటారు. అయితే స్త్రీకి యవ్వనం ఎన్ని రోజులు ఉంటుంది అంటే ఆమె చనిపోయేంతవరకు ఉంటుంది. యవ్వనం అంటే పైకి కనపడేది కాదు అది లోపల ఉంటుంది. ఆమెలోని వాయువు బయట కలిసిపోయేంతవరకు ఆమె యవ్వనంగానే ఉంటుంది.

కామం, ప్రేమ సంబంధమైన ఇన్ని మూఢాభిప్రాయాలూ, అన్యాయమైన నిబంధనలూ కలగడానికి ఈ విషయాల్లో అనుభవమే కారణం. కామం లేనివాడికి కామం కలవాడు పాపాత్ముడివలె కనబడతాడు. భార్యమీద ఇష్టం కలవాడికి వ్యభిచారం అర్థంకాదు. ఎప్పుడూ ఒక భార్యతోనే కొందరు ఎట్లా కాపరం చెయ్యగలరా అని వ్యభిచారికాశ్చర్యం. అందం అర్థంకానివాడికి అందం కోసం చెవులు కోసుకునే వాడు ఉన్మత్తుడివలె తోస్తాడు. ఒకరి స్వభావం ఇంకోరికి రాదు. కొందరు కామాన్ని అణుచుకుంటారు. అణుచుకోగలిగినంత కొంచెమై వుంటుంది. అణుచుకోలేని వాళ్లూ, అణుచుకోలేనంత ఎక్కువ కామోద్రేకం కలవారూ వుంటారనే సంగతి మరిచిపోయి అందరూ అణుచుకొని తీరాలి అని శాసిస్తారు. స్త్రీ స్వభావమూ, కామమూ పురుషుడికి అర్థంకాదు. పురుషుడి వ్యవహారం స్త్రీకి అర్థంకాదు. భారత స్త్రీలని చూసికూడా బానిసలనడం పాశ్చాత్యులకి మామూలు. పాశ్చాత్యుల్ని చూడకుండానే వాళ్లందరూ దుర్నీతిపరులనడం ఈ దేశస్తుల మర్యాద. ఈ గోలంతా ఈ విషయమై మనుషులు బైటికి మాట్లాడకపోవటం చేత వచ్చిన తిప్పలు. చర్చలూ, పుస్తకాలు, అభిప్రాయాలూ విచ్చలవిడిగా ఈ జ్ఞానాన్నివ్వాలి. చాలా మంది పెద్దమనుషులూ, స్త్రీల విషయంలో మనసే ఉన్నట్లు కనబడనివాళ్లూ, ఒంటరిగా మిత్రమండలితో కలిసినప్పుడు నాలికలు సళ్లు చేసి ఇంక వినరాని అనరాని మాటలన్నీ మాట్లాడతారు. కానీ, ఆ సంభాషణకీ, స్పష్టమైన బూతులకీ కారణం వేరు. సరైన మార్గాన తృప్తి పడడం చేతగాక, దప్పిక తీరక, నాలికద్వారా వాగి తృప్తి పడతారు. పతివ్రతలమనుకునే గొప్ప స్త్రీలు ఏకాంతంగా నలుగురు పోగైనప్పుడూ అంతే. కానీ, శాస్త్రరీత్యా, ఆరోగ్యవంతంగా, సిగ్గుపడకుండా, బహిరంగంగా మాట్లాడేవారు అరుదు.

Related image

దొంగ అమాయకత్వాన్ని మనదేశం క్రిష్టియను మతస్థుల దగ్గర్నించి నేర్చుకుంది. పూర్వం గృహస్తులు కామమన్నా, కామ శాస్త్రాలన్నా, కామ విధులన్నా, స్త్రీని అనుభవించడమన్నా సిగ్గుపడే దుర్నీతిలో ఎన్నడూలేరు. మొహమాటం లేకుండా అన్ని విధాలా సౌఖ్యం పొందేవారు. వారి మనసులు పరిశుభ్రంగా వుండేవి. క్రిష్టియను మతసాంగత్యం వొచ్చిన తరువాత, స్త్రీ సాంగత్యమే బూతుపని అయ్యింది. ముఖ్యంగా స్త్రీలకి పురుష వాయువులు నరకంనించి వీచే విషజ్వాలలైనాయి. ఆ పని తమకే తెలీకుండా పొదచాటున శరీరవాంచని ఓర్చుకోలేక బలహీనత్వంచేత, ఆ పురుష పశువు ప్రోద్బలం చేత ఆ పని జరిగినా దానిని గురించి మాట్లాడకూడదు, తెలుసుకోకూడదు, తలుచుకోకూడదు.తెలిసినా తెలిసినట్లు ప్రవర్తించ కూడదు, జరగనట్లే వుండాలి, భార్యాభర్తలైనా సరే రాత్రింబగళ్లు విడిగా ఉన్నట్లే కనబడాలి. ఎవరికీ తెలీని సమయంలో, చీకట్లో అర్థరాత్రి దొంగతనంగా సిగ్గుపడుతూ తిట్టుకుంటూ ప్రార్థనలు చేసుకుంటూ ఒక్క నిమిషంలో కళ్లుమూసుకుని బహిర్భూమికి వెళ్లినట్టు యేమూలో ఆ కార్యం ముగించి చడీ చప్పుడు కాకుండా మర్యాదస్తులవలె యేమెరగనట్టు ఇంకో ధ్యాసలో కనబడాలి. సంసార కార్యం వల్ల సౌఖ్యం కలుగుతోందని వొప్పుకోకూడదు. దాని సంగతి నేర్చుకుని ఇంకా ఎక్కువ ఆనందాన్ని సంపాయించుకోడానికీ, తెలుసుకోడానికీ ప్రయత్నమన్నా చెయ్యకూడదు. ఇట్లాంటి గతికి వొచ్చింది అతి సుందరమైన, సరళమైన సృష్టికార్యం. సృష్టి కార్యంలో సిగ్గుపడవలసింది ఏమీ లేదు. సౌఖ్యాల్లోకెల్లా సౌఖ్యమయిందది. ఇంకొక జీవితో శరీరమే కాకుండా ఆత్మకూడా ఏకీభవించిందా, ద్వంద్వమనేదే ఆ నిమిషాన నశించిందా అన్నంత సమీపానికి వస్తాము. అప్పుడు ప్రపంచాలు సృజించే ఈశ్వరుని అంశని మనలో వ్యక్తీకరింప చేసుకుంటాము. ఆ శక్తిని చూసి ప్రతి మనుష్యుడూ గర్వపడవలసిన విషయము. అది ఈ కాలంలో నీచంగా మారింది. దానికి సంబంధించిన పనులన్నీ దొంగతనాలై పోయాయి.