కండోమ్ లేకుండా రోజు సెక్స్ చేస్తున్నారా…అయితే ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే

718

కండోమ్ వినియోగం అన్నివేళల సురక్షితమే.ఎయిడ్స్‌, సుఖ వ్యాధులకు అడ్డుకట్ట వేసేదే కండోమ్‌! గర్భనిరోధకానికి ఇది అత్యుత్తమ కవచం. అయినా మెజారిటీ ప్రజలు కండోమ్‌ వద్దే వద్దని అంటున్నారు. శృంగార సమయంలో సంతృప్తి, భావప్రాప్తికి కండోమ్‌ను అడ్డుగా భావిస్తున్నారు!అందుకే కండోమ్ లేకుండానే సెక్స్ చేస్తుంటారు.అయితే ఇలా కండోమ్ లేకుండా సెక్స్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా..ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for condom

గర్భాన్ని నిరోధించే వాటిలో అందరికి తెలిసిన మరియు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలిసినది కండోమ్. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 100 కన్నా ఎక్కువ కండోమ్’లను తయారుచేసే బ్రాండులు అందుబాటులో ఉన్నాయి. సంభోగంలో కండోమ్ వాడకం తప్పనిసరి మరియు తృప్తిని కలిగించే, సురక్షిత పధ్ధతి అని చెప్పవచ్చు.లైంగిక సంబంధిత వ్యాధులు వ్యాపించకుండా మరియు గర్భధారణను నిరోధించుటలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.కండోమ్‌లను ఎందుకు ఉపయోగిస్తారు..? అరక్షిత శృంగారం కారణంగా హెచ్ఐవీ, ఇతర సుఖ రోగాల బారిన పడకుండా ఉండేందుకు కదూ.సుఖవ్యాధుల్లో అత్యంత తీవ్రమైన వ్యాధి ‘సిఫిలిస్‌’! స్త్రీ, పురుషులిద్దరిలో సిఫిలిస్‌ బ్యాక్టీరియా మర్మాంగాలు, నోరు, పెదవులు, మలద్వారాలను ఇన్‌ఫెక్ట్‌ చేస్తుంది. ఈ వ్యాధి ఉన్న వ్యక్తితో లైంగికంగా కలవడం ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది. గర్భిణికి ఈ వ్యాధి ఉంటే బిడ్డకూ సోకుతుంది.

Image result for condom

ప్రారంభంలో నొప్పి లేని, చిన్న పుండులా ఏర్పడుతుంది. దీని చుట్టుపక్కల ప్రాంతాల్లోని లింఫ్‌ గ్రంథుల వాపు కూడా కనిపిస్తుంది. దీనికి వెంటనే చికిత్స చేయకపోతే, చర్మం మీద దురద లేని దద్దుర్లు చేతులు, పాదాల మీద మొదలవుతాయి.ఈ వ్యాధి లక్షణాలు అందరిలోనూ కనిపించకపోవచ్చు. సంవత్సరాలకొద్దీ శరీరంలో సిఫిలిస్‌ బ్యాక్టీరియా దాక్కుని ఉండి దీర్ఘకాలం రకరకాల రుగ్మతలతో ఇబ్బంది పెడుతుంది. సిఫిలి్‌సలో భాగంగా తలెత్తే పుండ్లు హెచ్‌ఐవి ఇన్‌ఫెక్షన్‌ తేలికగా సోకడానికి దోహదపడతాయి. సిఫిలి్‌సతో ఉన్న మరో ప్రధాన సమస్య ఇది. సిఫిలిస్‌ సోకిన మహిళలు గర్భం దాల్చితే బిడ్డకు పలు రకాల ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇక ఈ వ్యాధి సోకకుండా కండోమ్స్‌ కొంతవరకూ ఉపయోగపడే మాట నిజమే! అయినా పాలీయురేథేన్‌ కండోమ్స్‌ సైతం ఈ వ్యాధిని సమూలంగా అడ్డుకోలేవు. కాబట్టి పెళ్లికి ముందు అపరిచితులతో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం ప్రమాదకరం. ఒకవేళ సిఫిలిస్‌ వ్యాధి సోకిందని అనుమానంగా ఉంటే వెంటనే సెక్సాలజి్‌స్టని సంప్రతించి చికిత్స తీసుకోండి.విన్నారుగా సెక్స్ చేసేటప్పుడు కండోమ్ ఉపయోగించకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయో.కాబట్టి వీలైనంతవరకు సెక్స్ చేసేటప్పుడు కండోమ్ ను ఖచ్చితంగా వాడండి.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.సెక్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఉపయోగించాల్సిన కండోమ్ గురించి అలాగే కండోమ్ ఉపయోగించకపోవడం వలన మనకు కలిగే అనర్ధాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.