ప్యాకెట్ పాల‌ను మ‌రిగించ‌రాదు… ఎందుకో తెలుసా..? తప్పక తెలుసుకోండి లేదంటే నష్టపోతారు!

62

మనం రోజు తీసుకొనే ఆహారంలో పాలు అనేవి చాలా ముఖ్యమైన, ఖచ్చితమైన ఆహారంగా మారిపోయింది. కొన్ని వేల సంవత్సరాలకు ముందు నుండి ప్రతి రోజు పాలు తీసుకోవాలి అనే విషయాన్ని మనం ఒక అలవాటుగా పాటిస్తూ ఉన్నాం. ఎందుకంటే, అందులో ఉండే కాల్షియమ్ ఎముకలు ఆరోగ్యవంతంగా ఉండటానికి, పళ్ళు దృఢంగా తయారవ్వడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కండరాలు పెరగడానికి కూడా పాలు ఎంతగానో సహాయపడుతుంది. అంతే కాకుండా కండరాలు దృఢంగా చేసే గుణాలు ఎన్నో పాలలో ఉన్నాయి. భారతదేశంలో ఎన్నో తరాల నుండి పచ్చిపాలలో ఆరోగ్యవంతమైన లాభాలు ఉన్నాయనే ఉద్దేశ్యంతో అలానే తాగేవారు. అయితే, అందులో కొన్ని ప్రాణాంతక క్రిమికీటకాలు కూడా ఉంటాయి. వీటి వల్ల ఎన్నో భయంకర వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. వీటన్నింటి మూలంగానే పచ్చిపాలను మరగపెట్టడం అనే ప్రక్రియను మనం అలవర్చుకున్నాం. ప్రస్తుతం ఉన్న ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరు పాలను పాల ప్యాకెట్ల ద్వారానే తెచ్చుకోవడం జరుగుతుంది. మరి ఈ ప్యాకెట్ పాలను మరగించవచ్చా.. మరిగిస్తే ఏమవుతుంది..మరిగించకుండా తాగితే ఏమవుతుంది.. ఇలా అనేక విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం.

Image result for packet milk

సాధార‌ణంగా ఏ డెయిరీలో అయినా పాల‌ను అధిక ఉష్ణోగ్ర‌త‌కు మ‌రిగిస్తారు. 161.6 డిగ్రీల ఫారెన్‌హీట్ టెంప‌రేచ‌ర్‌కు పాల‌ను మ‌రిగించి వెంట‌నే 15 సెకండ్ల‌లోనే చ‌ల్లారుస్తారు. ఇలా చేయడాన్ని పాశ్చ‌రైజేష‌న్ అంటారు. దీని వ‌ల్ల పాల‌లో ఉండే హానికార‌క సాల్మొనెల్లా బాక్టీరియా తొల‌గిపోతుంది. అయితే ఇలా ఒక‌సారి మ‌రిగించాక ఆ పాల‌ను ప్యాక్ చేస్తారు. అనంత‌రం వాటిని మ‌నం మ‌ళ్లీ మ‌రిగిస్తే వాటిల్లో ఉండే పోష‌కాలు నశిస్తాయి. క‌నుక ప్యాకెట్ పాల‌ను మ‌ళ్లీ మ‌రిగించాల్సిన ప‌నిలేదు.. కాక‌పోతే చ‌ల్ల‌గా ఉంటాయ‌నుకుంటే కొద్దిగా వేడి చేసి తాగ‌వచ్చు. కానీ మ‌రిగించ‌రాదు. ఇక ప్యాకెట్ పాలు కాకుండా నేరుగా గేదెల వ్యాపారుల నుంచి పాల‌ను కొనేవారు మాత్రం ఆ పాల‌ను క‌చ్చితంగా మ‌రిగించాలి. దాంతో ఆ పాలల్లో ఉండే సాల్మొనెల్లా బాక్టీరియా న‌శిస్తుంది. అప్పుడు ఆ పాల‌ను నిర‌భ్యంత‌రంగా వాడుకోవ‌చ్చు. క‌నుక ఇక‌పై ఎవ‌రూ ప్యాకెట్ పాల‌ను మ‌రిగించకండి.

Image result for packet milk

అయినా కానీ కొందరు మరగిస్తారు. ప్యాకెట్ పాలను మరిగించే క్రమంలో కొన్ని పద్దతులను పాటించడం ద్వారా మనం అవసరమైన పోషకాలు ఏవి కోల్పోకుండా కాపాడుకోవచ్చు. అవేమిటో ఇప్పుడు చూద్దాం.

  1. తరచూ పాలను వేడిచేయడం లేదా మరిగించడం చేయకండి. ఇలా చేయడం వల్ల అందులో ఉన్న పోషక విలువలపై ప్రభావం చూపుతుంది.
  2. పాలు మరుగుతున్న సమయంలో అప్పుడప్పుడు పాలను అలా కలుపుతూ ఉండటం మంచిది.
  3. పాలను తక్కువ వేడి పై వేడిచేయండి లేదా మరిగించండి. ఎందుకంటే, ఎక్కువ వేడి పై కనుక మరిగిస్తే అది ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.
  4. ఒకసారి పాలను మరిగించి చల్లార్చిన తర్వాత అలానే ఎక్కువ సేపు బయట ఉంచకండి, త్వరగా ఫ్రిడ్జ్ లో పెట్టేయండి. ఆ తర్వాత అవసరమైనప్పుడు వాడుకోండి. ఇలా చేయడం వల్ల పాలు మరింత తాజాగా ఉంటాయి.
  5. పాలను మంటపై మాత్రమే మరిగించండి. మైక్రో ఒవేన్ లలో అస్సలు మరిగించకండి.

ఈ క్రింద వీడియో చూడండి

ఇలా వివిధ మరిగించే మార్గాలను పాటించడం ద్వారా ప్యాకెట్ పాలలో ఉండే పోషక విలువలను కోల్పోకుండా మనం జాగ్రత్త పడవచ్చు. ఇలా చేయడం వల్ల పాలల్లో ఉండే విటమిన్లు, పోషక విలువల యొక్క సమతుల్యత దెబ్బతినదు. అంతే కాకుండా ఇలా మరిగిస్తే పాల రుచి కూడా మరింతగా పెరుగుతుంది. కాబట్టి పాటించండి.