వీడేమి బాబారా బాబు..సమస్యలు తీరుస్తా అని 2 ఏళ్ల పాపను నీటిలో ముంచి ఎంతటి దారుణానికి ఒడిగట్టాడో చూస్తే షాక్..

286

జనం మూఢ విశ్వాసాలను ఆసరాగా చేసుకుని అందినకాడికి దోచేసుకుంటున్నారు నకిలీ బాబాలు. అవసరాల కోసం మితిమీరిన విశ్వాసాలను ఒంటబట్టించుకుని నకీలీ స్వాముల లీలల ముందు బోల్తా పడుతున్నారు చాలామంది. ఇటువంటి సంఘటనలు గురించి నిత్యం అనేక వార్తలు వస్తున్నా జనంలో మాత్రం మార్పు రాకపోవడంతో మాయగాళ్లు రెచ్చిపోతున్నారు.అలాగే దేవుడిని నమ్మాలి కాని మూడంగా, మూర్ఖంగా నమ్మొదు. మూడ నమ్మకంగా దేవుడిని నమ్మాల్సిన అవసరం లేదు. దేవుడిని మనస్ఫూర్తిగా పూజిస్తే చాలు.. కాని కొందరు మాత్రం దేవుడి పూజా అంటూ ప్రాణాల మీదకు తెచ్చుకునే పరిస్థితి వస్తుంది.ఇప్పుడు ఒక పూజారి చేసిన పని తెలిస్తే మీరు షాక్ అవుతారు.మరి ఆ పూజారి ఏం చేశాడో తెలుసుకుందామా.

రష్యాలో ఒక బాప్టిజం పూజారి ఉన్నాడు. ఆయనంటే అక్కడి భక్తులకు చాలా నమ్మకం. ఏ సమస్య వచ్చిన అతను తీరుస్తాడని ఎలాంటి ఆరోగ్య సమస్య ఉన్న నయం చేస్తాడని అక్కడివారు నమ్ముతారు.అయితే అతను చేసే వైద్యం అలా ఇలా ఉండదు.చాలా దారుణంగా ఉంటుంది.ఏ మతంలో కూడా, ఏ దేవుడు కూడా పిల్లలను హింసిచమని, చనిపోయే వరకు కొట్టమని, తమ కోసం ప్రాణాలు ఇవ్వమని మాత్రం చెప్పలేదు, అడగలేదు. కాని రష్యాకు చెందిన బాప్టిజం పూజారి అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నాడు.తన వద్దకు స్వస్థత కోసం వచ్చిన వారిని అత్యంత హీనంగా శారీరకంగా శిక్షిస్తాడు. పెద్దా చిన్నా అనే తేడా లేకుండా వారిని శారీరకంగా హింసించి వారిని స్వస్థత చేస్తానంటాడు. తాజాగా ఈయనకు సంబంధించిన ఒక వీడియో సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున హల్‌ చల్‌ చేస్తోంది.రెండు సంవత్సరాల పాపను అనారోగ్యం కారణంగా తల్లిదండ్రులు ఆయన వద్దకు తీసుకు వెళ్లడం జరిగింది. ఆ పాపను చూసి ఆ పూజారి ఏదో మంత్రించి ఆ పాపను నీటితో నిండి ఉన్న పెద్ద పాత్రలో పడేశాడు.

ఆ పాపను అలా పడేయడం చూసి తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.పాపను పూజారి ఏం చేస్తున్నాడో అని ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.నీటిలో బాబు పడేయడంతో గిలిగిల కోట్టుకున్నాడు. కొద్ది సేపు మొత్తం నీటిలో ముంచి ఉంచిన ఆ పూజారి పైకి తీయగానే ఆ బాబు నీటిని కక్కడంతో పాటు కొద్ది సమయం కకావికలం అయ్యాడు. దాంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది మరీ ఇలాంటి వైధ్యం ఏంటీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతను చేసిన వైద్యం నచ్చక పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. ఆశ్రమం దగ్గరకు పోలీసులు రావడంతో విషయం కాస్త సీరియస్‌ అయ్యింది. ఆ బాప్టిజం పూజారిని పోలీసులు అరెస్ట్‌ చేసినా కూడా ఇలాంటి సంఘటనలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.చూశారుగా ఈ పూజారి ఎంతటి పని చేశాడో. ఆరోగ్యం బాగుచెయ్యమని వెళ్తే ఏకంగా ప్రాణాలు పోయేంత వైద్యం ఎలా చేశాడో.మరి ఈ ఘటన గురించి మీరేమంటారు.