ఈరోజు బోటు బ‌య‌ట‌కు తీస్తాం ధ‌ర్మాడి స‌త్యం ప్ర‌క‌ట‌న

448

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు దగ్గర గోదావరిలో మునిగిన బోటు కోసం గాలింపు కొనసాగుతోంది. వరుసగా నాలుగో రోజు ధర్మాడి సత్యం టీమ్ తమ ప్రయత్నాలు కొనసాగించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు బోటును బయటకు లాగేందుకు ప్రయత్నాలు చేశారు. లంగర్లు వేసినా బోటు మాత్రం దొరకలేదు. 48 అడుగుల లోతులో ఉన్న బోటును ఒడ్డుకు చేర్చేందుకు శతవిధాలా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. బోటు నదిలో 48 అడుగుల లోతులో ఉన్నట్లు ధర్మాడి సత్యం టీమ్ చెబుతోంది.. తమ ప్రయత్నాలను కొనసాగిస్తామంటోంది.

Image result for boat incident

ఆరు రోజులుగా మునిగిన బోటును బయటకు తీసేందుకు ఆపరేషన్ రాయల్ వశిష్టను రెండోసారి ధర్మాడి సత్యం టీమ్ చేపట్టింది. లంగరు వేయగా బలమైన వస్తువు తగలడంతో బోటుగా భావించారు. దాన్ని బయటకు లాగేందుకు ప్రయత్నించారు. ఆ మరుసటి రోజు మధ్యాహ్నం కొద్దిసేపు పనులు నిలిచిపోయాయి.. తర్వాత కాకినాడ పోర్టు నుంచి వచ్చిన నిపుణుల పర్యవేక్షణలో ఈ వెలికితీత పనులు మళ్లీ కొనసాగించారు. లంగరుకు తగిలిన బలమైన వస్తువును బయటకు లాగే ప్రయత్నాలు చేస్తున్నారు…. రోప్‌ల సాయంతో దానిని బయటకు లాగుతున్నారు.. రోప్ మరింత బిగియడంతో జేసీబీల సాయంతో బయటకు తీసే ప్రయత్నాన్ని కొనసాగించారు. కానీ బోటు 48 అడుగుల దగ్గరే ఆగిపోయింది.

ఈ క్రింద వీడియో చూడండి

వెంటనే గోదావరికి వరద ఉధృతి పెరగడంతో బోటు బయటకు తీసే ప్రయత్నాలు టీమ్ తాత్కాలికంగా నిలిపివేశారు. వరద తగ్గుముఖం పట్టడంతో మళ్లీ ఇప్పుడు ప్రయత్నాలు ప్రారంభించారు. వెలికితీత చర్యల్లో పాల్గొనేందుకు కచ్చులూరు ద‌గ్గ‌ర ఎనిమిది మంది అండర్ వాటర్ డ్రైవర్లు చేరుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నంకు విశాఖ నుంచి స్కూబా డైవర్లు చేరుకున్నారు… కచ్చులూరు ద‌గ్గ‌ర గోదావరి నదిలో మునిగిపోయిన రాయల్‌ వశిష్ట‌ బోటు ఎక్కడ ఉన్నది స్పష్టంగా తెలియడంతో స్కూబా డైవర్ల అవసరం ఉందని రెస్క్యూటీం నాయకుడు ధర్మాడి సత్యం అధికారులకు తెలియజేసిన విషయం తెలిసిందే…దీంతో నీటిలోకి వెళ్లి బోటుకు కొక్కేలు వేయనున్నారు డీప్ వాటర్ డ్రైవర్లు . ప్రస్తుతం ఒడ్డుకు 190 అడుగులు దూరం, గోదావరిలో 38 అడుగుల లోతులో బోట్ ఉన్నట్లు నిర్ధారించారు. డీప్ వాటర్ డ్రైవర్ల రాకతో నేడు ఆపరేషన్ వేగవంతమై బోట్ బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి…. అటు క‌నిపించ‌కుండా పోయిన ప్ర‌యాణికులు చివ‌రి చూపు కోసం వారి కుటుంబాలు సైతం ఎదురుచూస్తున్నాయి.