బయటపడ్డ 17వ శతాబ్దం నాటి రేప్ కథ ..

561

సమాజంలో ఎక్కడ చుసిన ఆడవాళ్ళ మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి.ఆడపిల్ల ఒంటరిగా కనపడితే చాలు అఘాయిత్యం చెయ్యడానికి సిద్దంగా ఉంటున్నారు.అయితే ఇలాంటి ఘటనలు ఇప్పుడే కాదు ఎన్నో వందల ఏళ్ల నుంచి జరుగుతున్నాయి.రాజుల కాలంలో అయితే మహిళలను చాలా దారుణంగా చూసేవాళ్ళు.వాళ్ళను సెక్స్ కోసం ఉపయోగించుకున్న రాజులు ఎందరో.వాళ్ళ బారిన పడి వారిని ఎదురించలేకపోయిన మహిళలు అప్పటి కాలంలో కొక్కోల్లలు.అయితే ఇప్పుడు 17 శతాబ్దానికి చెందినా ఒక రేప్ ఘటన వెలుగులోకి వచ్చింది.మరి ఆ ఘటన గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Related image

ప్రపంచవ్యాప్తంగా మీ టూ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్నది. తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి మహిళలు ధైర్యంగా బయటపెడుతున్నారు.సెలెబ్రిటిలు ఈ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారు.సినీ తారలు తమకు ఎదురైనా చేదు అనుభవాలను పంచుకుంటున్నారు.దాంతో గతంలో చోటుచేసుకున్న ఘటనలు ఎన్నో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. దీంతో వివిధ రంగాల్లోని ప్రముఖులు సైతం ఇరుకునపడుతున్నారు. పలువురు కటకటాల పాలవుతున్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ హాస్య, టీవీ నటుడు బిల్ కాస్బీ వంటి ప్రముఖుడు కూడా జైలుపాలుకాక తప్పలేదు. ఈ నేపథ్యంలో చరిత్రకారులు 17వ శతాబ్దానికి చెందిన ఓ లైంగికదాడి, దాని పర్యవసనాలను వెలికితీశారు.

Related image

బ్రిటన్‌కు చెందిన ఎడ్వర్డ్ బార్లో అనే వ్యక్తి గురించి తెలిసి ఉండకపోవచ్చు. కానీ, బ్రిటిష్ సముద్రయాన చరిత్ర అధ్యయనకారులకు మాత్రం ఆయన పేరు తప్పక తెలుస్తుంది. ఆయన డైరీలో రాసుకున్న దినచర్య ఎన్నో విషయాలను బయటపెట్టింది.బార్లో తొలుత ఓడల్లో సహాయకుడిగా జీవితాన్ని ప్రారంభించాడు. ఆ రోజుల్లోనే పనిమనిషి మేరీ సైమన్స్‌పై లైంగికదాడికి పాల్పడినట్టు తన డైరీలో రాసుకున్నాడు. తాను చేసింది చట్టపరంగా సరైందికాదని, సభ్యమైందని అసలేకాదని అందులో పేర్కొన్నాడు.మరో సముద్రయానం తర్వాత ఇంటికి తిరిగొచ్చిన బార్లోకు.. మేరీ కన్నీరుమున్నీరుగా విలపిస్తూ కనిపించింది. తన జీవితం వ్యర్థమైపోయిందని బాధపడింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

దీంతో బార్లో పశ్చాత్తాపానికి గురై ఆమెను పెండ్లి చేసుకున్నాడు.లైంగికదాడిని మాత్రం దాచేందుకు ప్రయత్నించాడు. అప్పట్లోనూ లైంగికదాడి అనేది ఏమాత్రం ఆమోదయోగ్యమైన విషయం కాకపోవడమే అందుకు కారణమని చరిత్రకారులు చెప్తున్నారు.విన్నారుగా 17 వ శతాబ్దంలో జరిగిన కథ గురించి.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.సమాజంలో జరుగుతున్న దారుణాల గురించి అలాగే ఇప్పుడు బయటపడ్డ 17 వ శతాబ్ద రేప్ ఘటన గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.