రాత్రి 12 గంటల సమయంలో పిజ్జా ఆర్డర్ చేసిన యువతిని డెలివిరీ బాయ్ ఏం చేసాడంటే

399

ఇప్పుడు అంతా ఆన్ లైన్లోనే ఫుడ్ డెలివ‌రీలు రావ‌డం చూస్తున్నాం…ఇక ఇంటి ఫుడ్ కాస్త బ‌య‌ట రెస్టారెంట్ల నుంచి ప‌ది నిమిషాల్లో మ‌న ఇంటికి డెలివ‌రీ వ‌స్తున్నాయి. కాని ఇలా ఫుడ్ డెలివ‌రీ బాయ్ ఓ యువ‌తి ప‌ట్ల ఎలాంటి బిహేవియ‌ర్ చూపించాడో తెలిస్తే మ‌తిపోవ‌డం ఖాయం.అది బెంగుళూరు నగరం. అక్కడొక అమ్మాయి పిజ్జా ఆర్డర్ చేసింది. అయితే ఆ అమ్మాయికి పిజ్జా నచ్చకపోవడంతో తిరిగి పంపించింది. ఆ పిజ్జా డెలివిరీ బాయ్ మాత్రం ఆమెను ఖచ్చితంగా తీసుకోవాల్సిందేనని బలవంతం చేసాడు. ఆమె రిజెక్ట్ చేసి తిరిగి పంపించడంతో రెచ్చిపోయిన పిజ్జా బాయ్ ఆ అమ్మాయిని వేదింపులకు గురిచేశాడు. తను మాత్రమే కాకుండా తన గ్యాంగ్ మొత్తాన్నీ ఆమె మీదకు ఉసిగొల్పాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతణ్ని అరెస్ట్ చేశారు.

Image result for pizza delivery boy

బెంగళూరులోని జేపీ నగర్కు చెందిన స్మిత అనే యువతి గత శుక్రవారం రాత్రి ఆన్లైన్ ద్వారా మెక్డోనాల్డ్స్లో ఓ పిజ్జా ఆర్డర్ చేసింది. రాత్రి పది గంటల సమయంలో పిజ్జా డెలివరీ బాయ్ దానిని తీసుకుని వచ్చాడు. అయితే ఆ పిజ్జా తనకు నచ్చలేదని, దానిని రిటర్న్ తీసుకువెళ్లిపోవాలని కోరింది. ఒక్కసారి ఆర్డర్ చేసిన ఐటెమ్ను రిజెక్ట్ చేయడం కుదరదని, డబ్బులు ఇవ్వాలని డెలివరీ బాయ్ పట్టుబట్టాడు. ఇక ఇద్ద‌రి మ‌ధ్య వాద‌న అయితే జ‌రిగింది, తాను డెలివ‌రీ క‌చ్చితంగా ఇవ్వాల్సిందే అని అత‌ను ప‌ట్టుబ‌ట్టాడు త‌న‌కు లేట్ అవ‌డం వ‌ల్ల ఈ పిజ్జా టేస్ట్ ఉండ‌దు అని తాను తీసుకోను అని చెప్పింది..అయితే డ‌బ్బులు ఇచ్చెయ్యాలి అని అత‌ను వాగ్వాదానికి దిగాడు కాని ఆమె అత‌నికి రూపాయి కూడా ఇవ్వ‌ను అని వార్నింగ్ ఇచ్చింది.స్మిత డబ్బులు ఇచ్చేది లేదని, తలుపులు వేసుకుని వెళ్లిపోయింది. ఆ పిజ్జాను అక్కడే వదిలేసిన డెలివరీ బాయ్ ఆమెకు గుణపాఠం చెప్పాలనుకున్నాడు. పది నిమిషాల తర్వాత ఆమెకు ఫోన్ చేసి బూతులు మాట్లాడుతూ, తన కోరిక తీర్చాలని డిమాండ్ చేశాడు. ఆమె తిట్టి ఫోన్ పెట్టేయడంతో, ఆ నెంబర్ను తన వాట్సాప్ గ్రూప్ మెంబర్లకు పంపించి, ఆమె ఒక వేశ్య అని, డబ్బులు మాట్లాడుకుని ఎంజాయ్ చేయండని చెప్పాడు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇక ఆ రోజు రాత్రి పిజ్జా రిజ‌క్ట్ చేసిన గంట నుంచి ఆమె నెంబ‌ర్ల‌కు ఫోన్లు వ‌చ్చేవి, అకౌంట్ నంబ‌ర్ పంపిస్తే డ‌బ్బులు ఇస్తాము రూమ్ కి రావాలి అని మీ ఫోటో పంపాలి అని అనేక ఫోన్లు వ‌చ్చేవి ..కాని ఆమె చిరాకు తెచ్చుకుంది. ఇలా వారంతా ఆమెకు ఫోన్ చేసి వేధించారు. ఆ రాత్రంతా వివిధ నెంబర్ల నుంచి ఆమెకు ఫోన్లు వస్తూనే ఉన్నాయి. తర్వాతి రోజు స్మిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. డెలివరీ బాయ్ను అరెస్ట్ చేసిన పోలీసులు మిగిలిన వారి గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. మ‌రి చూశారుగా ఇలాంటి ఆలోచ‌న ఎంత క్రూరంగా ఉంటుందో. మ‌రి దీనిపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి. ఇలాంటి సంఘ‌ట‌న‌లు మీరు ఎప్పుడైనా ఎదురుకొన్నారా వాటి గురించి కూడా తెలియ‌చేయండి.