బిగ్ బాస్ షాకింగ్ నిర్ణయం.. ఈ రోజు మిడ్‌ వీక్ ఎలిమినేషన్‌.. దీప్తి నల్లమోతు ఔట్.?

377

బిగ్ బాస్ సీజన్ 2 కంప్లీట్ అవ్వడానికి దగ్గర పడింది.ఇంకొక 3 రోజుల్లో కంప్లీట్ అవుతుంది.ఇప్పుడు అందరిలో ఒకటే ఉత్కంఠ.ఎవరు బిగ్ బాస్ టైటిల్ గెలుస్తారా అని చాలా అతృతతో ఎదురుచూస్తున్నారు.ఒకరిద్దరి పేర్లు గట్టిగా వినిపిస్తున్నా ఎవరు గెలుస్తారో పక్కా చెప్పలేము.ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో ఏమైనా జరగొచ్చు.ఇప్పుడు అదే నిజమవుతుంది.అందరు ఫైనల్స్ కు వెళ్ళాం అని చాలా సంతోషంలో ఉన్నారు.అయితే ఇప్పుడు ఇంటి సభ్యులకే కాదు సామాన్య ప్రజలకు కూడా షాకింగ్ లాంటి విషయం బిగ్ బాస్ లో జరిగింది.మరి ఆ విషయం గురించి పూర్తీగా తెలుసుకుందామా.

బిగ్ బాస్ షో గత 100 రోజులుగా మన అందర్నీ ఆనందపరుస్తుంది.మొదట్లో వ్యతిరేకం వచ్చిన ఆ తర్వాత ఇంట్లో జరిగిన పరిస్థితులు అలాగే బయట ఏర్పడుతున్న ఆర్మీల వలన షో కు చాలా క్రేజ్ వచ్చింది.ఆ షో అంతలా చూస్తున్నారంటే కౌశల్ ఆర్మీ అనేది ఒక ముఖ్య కారణం అనే చెప్పుకోవాలి.కౌశల్ ఆర్మీ అనేది ఏర్పడిన తర్వాతే షో మీద జనాలకు ఆసక్తి ఏర్పడింది అంటే అతిశయోక్తి కాదు.ఇప్పుడు ఐదు మంది ఫైనల్స్ కు వెళ్లారు.కౌశల్ గీతామాధురి తనీష్ దీప్తి నల్లమోతు,సామ్రాట్..వీళ్ళందరూ టైటిల్ కోసం పోటీపడుతున్నారు.అయితే షో స్టార్టింగ్ లో నాని ఒక మాట చెప్పేవాడు.‘బిగ్‌బాస్ షోలో ఏదైనా జరగొచ్చు’ అని నాని చెప్పేవాడు.. అది నిజమేననిపిస్తోంది కొన్ని ఘటనలు చూస్తుంటే.

ఇక ఫినాలేకు మూడు రోజులే టైమ్ ఉంది. ఈలోగా ఎవ్వరూ ఊహించని రీతిలో ఓ కంటెస్టెంట్ ఎలిటిమినేట్ అవబోతున్నారనే ప్రచారం నెట్టింట్లో జోరుగా జరుగుతోంది. ఆ కంటెస్టెంట్ ఎవరో కాదు… దీప్తి నల్లమోతు. కొన్ని వారాల క్రితం వరకూ ఎలా ఉన్నా తాజా పరిస్థితులు మారిపోయాయి.ఓటింగ్ విషయంలో కౌశల్ మొదటి స్థానంలో ఉంటే దీప్తి రెండో స్థానంలో కొనసాగుతూ ఇతర కంటెస్టెంట్లకు గట్టి పోటీ ఇస్తోంది. ఇలాంటి తరుణంలో మిడ్‌ వీక్ ఎలిమినేషన్‌లో భాగంగా ఆమె ఎలిమినేట్ అవుతుందనే న్యూస్ బాగా వైరల్ అవుతోంది. ఈరోజు(గురువారం) ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లోనే ఈ ఎలిమినేషన్ ఉండబోతోందట. ఆమె ఎలిమినేషన్‌కి కారణం ఫేక్ ఓటింగ్ అనే చర్చ నడుస్తోంది. మరి దీప్తి నిజంగా ఎలిమినేట్ అయ్యారా? లేదంటే ఇది రూమరా? అనే విషయం మరికొన్ని గంటల్లో తెలుస్తుంది.చూడాలి మరి ఏం జరుగుతుందో.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.