పగలంతా ఆమె స్టూడెంట్.. రాత్రి అయితే చాలు రోడ్డు మీదకు వచ్చి డబ్బు సంపాదిస్తుంది..

286

కష్టపడే తత్వం ఉంటె చాలు ఎవరైనా లక్ష్య సాధన వైపు అడుగులు వెయ్యొచ్చు. ఎన్ని అవాంతరాలు వచ్చినా సరే నిర్దిష్ట లక్ష్యం కళ్ళముందు కనపడితే ఆ అవాంతరాలు కూడా గడ్డిపోచలాగా మారిపోతాయి. లక్ష్య సాధనకు అవి అడ్డు కావు. సరిగ్గా ఇలా అనుకుంది కాబట్టే ఆ యువతీ లక్ష్యం కోసం కష్టపడుతుంది. ఎనిమిది గంటలు కష్టపడితేనే ఆపసోపాలు పడతాం.. అమ్మో.. అయ్యో అని నీరసాలు. ఇంకేదైనా పెద్ద కష్టం వస్తే భరించలేం. ఇలాంటి వారికి భిన్నం ఈ యువతి. ఉదయం అంతా క్లాసుల్లో ఉంటుంది.. సాయంత్రం అయితే రోడ్డు పక్కన పరోటాలు అమ్ముతుంది. చదువుపై ఉన్న తపన ఆ అమ్మాయికి నిద్ర లేకుండా చేస్తోంది. మరి ఆ యువతీ ఎవరు ఎంత కష్టపడుతుందో తెలుసుకుందామా..

Image result for teachers

మహారాష్ట్రకి చెందిన స్నేహ లింబ్గా ఓంకార్ (28) కేరళ రాష్ట్రం త్రివేండ్రంలోని కేరళ యూనివర్సిటీలో బయో ఇన్ఫర్మాటిక్స్ డిపార్ట్ మెంట్ లో PhD రీసెర్చ్ స్కాలర్ గా చేస్తుంది. రెండేళ్లు కంప్లీట్ చేసింది. స్కాలర్ షిఫ్ కూడా వచ్చింది. మూడో సంవత్సరం చేస్తోంది. వర్సిటీ ఇవ్వాల్సిన ఫెలోషిఫ్ మాత్రం అందలేదు. కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే. ఇంటి నుంచి డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. డబ్బులు లేక మధ్యలో వదిలేస్తే జీవితమే నాశనం అవుతుంది. ఎలాగైనా రీసెర్చ్ కంప్లీట్ చేయాలని భావించిన లింబ్గా ఓంకార్.. స్వయం ఉపాధి చూసుకుంది. త్రివేండ్రం సిటీ యూనివర్సిటీ సమీపంలోనే రాత్రులు పరోటా దుకాణం ఓపెన్ చేసింది. తనే స్వయంగా పరోటాలు తయారు చేస్తూ డబ్బులు సంపాదిస్తుంది. దాంతో వచ్చిన డబ్బుతో జీవనం సాగిస్తుంది.

ఈ క్రింది వీడియో చూడండి

ఉదయం వర్సిటీలో రీసెర్చ్ వర్క్.. సాయంత్రం నుంచి రాత్రి 11 గంటలకు పరోటా వ్యాపారం ఇలా రెండింటితో నెట్టుకొస్తుంది ఓంకార్. ఇటీవల ఈ యువతి గురించి తెలిసిన యూనివర్సిటీ స్టూడెంట్స్ అక్కడికే వచ్చి టిఫిన్ చేస్తున్నారంట. చుట్టూ పక్కల ఐటీ ఉద్యోగులు కూడా ఓంకార్ పరోటా సెంటర్ కే వస్తున్నారు. కొందరు సాయం చేస్తామని ముందుకు వచ్చినా నిరాకరిస్తుంది లింబ్గా ఓంకార్. ఈనెల మీరు ఇస్తారు.. వచ్చే నెలా ఎవరు ఇస్తారు అని ఎదురు ప్రశ్నిస్తుంది. నాకు పరోటాలు చేయటం బాగా వచ్చు.. నా దగ్గర టిఫిన్ చేస్తే చాలు ఆ వచ్చిన ఆదాయంతో బతికేస్తానని ధీమా చెబుతుండటం అక్కడి వారికి గుండెలను బరువెక్కిస్తోంది. గతంలో మహారాష్ట్ర రెవెన్యూ డిపార్ట్ మెంట్ లో జాబ్ చేసిన స్నేహ PhD చేయడం కోసం రాజీనామా చేసింది. చదువంటే ప్రాణం, దాని కోసం ఎన్ని కష్టాలనైనా ఇష్టంతో ఎదుర్కొనడానికి సిధ్ధం అంటోంది స్నేహ. ఈమెకు పెళ్లి కూడా అయ్యింది. భర్తకు అనారోగ్యం కారణంగా అతని సొంత ఊరు జార్ఖండ్ లోనే ఉంటున్నాడు.ఈమె ఎప్పటికైనా తన లక్ష్యాన్ని చేరుకోవాలని కోరుకుందాం. మరి ఈ అమ్మాయి గురించి అలాగే చదువు కోసం ఈమె పడుతున్న కష్టాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.