ఆస్థి కోసం ఈ అమ్మాయి కన్న తల్లిదండ్రుల్ని ఏం చేసిందో తెలిస్తే ఛీ ఛీ అంటారు..

205

మానవ సంబంధాలు మరీ దిగజారిపోతున్నాయి. మనిషి అన్నవాడు పూర్తీగా మాయమవుతున్నాడు. మనిషి పూర్తీగా డబ్బుకే ఇంపార్టెంట్ ఇస్తున్నాడు. డబ్బే సర్వస్వము అనుకుంటున్నాడు. డబ్బు కోసం అయినా వాళ్ళను కూడా మోసం చేస్తున్నాడు. అవసరం అయితే చంపేస్తున్నాడు కూడా. ఆస్థి కోసం సొంత అన్నదమ్ములు కొట్టుకున్న ఘటనలు చంపుకున్న ఘటనల గురించి విన్నాం. ఇప్పుడు సొంత కూతురు ఆస్థి కోసం తల్లిదండ్రులను చంపేసింది.మరి ఆ ఘటన గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for dead bodys

పశ్చిమ విహార్‌కు చెందిన జగీర్ కౌర్, గుర్మీత్ సింగ్ దంపతులకు దవీందర్ కౌర్ కూతురు. ఆమెకు వివాహంకాగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తర్వాత భర్తతో విభేదాలు రావడంతో కౌర్ తల్లిదండ్రుల దగ్గరకు వచ్చేసింది. ఈ క్రమంలో ఆమెకు ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలో పనిచేసే ప్రిన్స్ దీక్షిత్‌తో పరిచయం ఏర్పడింది.. తర్వాత ఆ బంధం వివాహేతర సంబంధంగా మారింది. ప్రియుడి మోజులో పడిన కౌర్‌కు తల్లిదండ్రుల ప్లాట్‌పై కన్నుపడింది. ఆ ప్లాట్‌ను తనపేరుపై రిజిస్ట్రేషన్ చేయాలని కౌర్ తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చింది. ఆస్తి ఇవ్వడానికి తల్లిదండ్రులు నిరాకరించడంతో.. వారిని చంపేస్తే ఆస్తి తనపేరు మీదకు వస్తుందని ఆశపడింది. ప్రియుడితో కలిసి పేరెంట్స్ హత్యకు స్కెచ్ వేసింది. కొద్దిరోజుల క్రితం కౌర్ తన తల్లిదండ్రులతో కలిసి పంజాబ్‌లోని సొంత ఊరికి వెళ్లింది. తర్వాత తండ్రితో కలిసి తిరిగి ఢిల్లీకి వచ్చింది. ఇంట్లో తల్లికూడా లేకపోవడంతో హత్యకు పథకాన్ని అమలు చేసింది.

ఈ క్రింది వీడియో చూడండి

తండ్రి జగీర్ కౌర్‌కు టీలో మత్తు బిళ్లలు కలిపి ఇచ్చింది. తర్వాత ప్రియుడితో కలిసి తండ్రిని హత్యచేసి ముక్కలు చేసి సూట్‌కేసులో కుక్కి డ్రేనేజ్‌లో పడేశారు. కొద్దిరోజుల తర్వాత తల్లి కూడా ఇంటికి రాగా.. ఆమెకు మత్తు బిళ్లలు కలిపిన టీ ఇచ్చి చంపేసి సూట్‌కేసులో కుక్కి డ్రేనేజ్‌లో పడేశారు. రెండు రోజుల క్రితం సూట్‌కేసుల్ని గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కౌర్ తీరుపై అనుమానంతో ఆమెను ప్రశ్నించగా.. ముందు తనకు ఏమీ తెలియదని.. ఆసమయంలో తాను ఢిల్లీలోలేనని బుకాయించింది. తర్వాత సీసీ కెమెరా ఫుటేజ్‌ పరిశీలించడంతో ఈ హత్య వ్యవహారం బయటపడింది. దీంతో చేసిన నేరం ఒప్పుకోగా.. కౌర్‌తో పాటూ ఆమె ప్రియుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆస్తి పిచ్చిలో పడి కన్నతల్లిదండ్రుల్ని చంపుకున్న కౌర్ ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కబెడుతోంది. చూశారుగా ఆస్థి కోసం తల్లిదండ్రులను ఎలా చంపేసిందో. మరి తల్లిదండ్రులను చంపిన ఈ కూతురి ఘటన గురించి అలాగే ఇలా ఆస్థి కోసం అయినా వాళ్ళను చంపే వాళ్ళ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.