నిన్నటి కేసీఆర్ స‌భ‌లో హైలెట్ గా నిలిచింది ఈ ఇద్దరు పోలీసులే..అసలు నిజం తెలిసి దేశం మొత్తం షాక్

411

హైద‌రాబాద్ గులాబీ పండుగ ఎంతో క‌న్నుల‌పండుగ‌గా జ‌రిగింది. అలాగే అక్క‌డ ఓ అరుదైన సంఘ‌ట‌న తెలంగాణ అంతా వైర‌ల్ అయింది. ఇంత‌కీ ఏమి జ‌రిగింది అని అనుకుంటున్నారా? అదే స్టోరీ ఇప్పుడు తెలుసుకుందాం..కొంగర కలాన్ ప్రగతి నివేదన సభ ప్రాంగణంలో ఓ అరుదైన సంఘట చోటు చేసుకుంది. ఒక వేదిక వద్ద తండ్రి, కూతురు బందోబస్తు అధికారులుగా విధులకు హాజరైయ్యారు. కూతురు ఐపీఎస్‌గా… తండ్రి 33 ఏండ్ల సర్వీసు అనుభవంతో నాన్ క్యాడర్ ఎస్పీగా పదొన్నతి పోంది డీసీపీ విధులు నిర్వహిస్తున్నారు. ఇలా తండ్రి, కూతురు ఒకే చోట ఉన్నతాధికారులుగా విధుల నిర్వహించడం చాలా మంది పోలీసు అధికారులు దృష్టిని ఆకర్షించింది. ఆసక్తికరమైన తండ్రి,కూతుళ్ల విధుల దృశ్యాన్ని చూసిన చాలా మంది పోలీసు బాసులు మురిసిపోయారు.

ఇంతకీ ఈ తండ్రి…కూతురు ఎవరో తెలుసా…మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వరశర్మ తండ్రి కాగా, జిగిత్యాల ఎస్పీ సింధూ శర్మ ఆయన కూతురు. ఈ ఇద్దరు ప్రగతి నివేదన ప్రాంగణంలో పోలీసు డ్యూటీ చేశారు. ఇందులో ఐపీఎస్ సింధూశర్మ సాంస్కృతిక వేదికతో పాటు మహిళలకు కేటాయించిన గ్యాలరీలకు ఇంచార్జీగా బాధ్యతలను అప్పగించారు. మొత్తం మహిళా పోలీసు సిబ్బందికి సూచనలు ఇస్తూ మహిళలకు బందోబస్తు నిర్వాహణపై ప్రణాళికలను రూపొందించారు. అక్క‌డ అంద‌రినుంచి మ‌న్న‌న‌లు పొందారు.

ఇక మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వర శర్మ సభా వేదిక వద్ద బందోబస్తుకు ఇంచార్జీగా వ్యవహరించారు.. మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వర శర్మ 1985 సంవత్సరంలో ఎస్‌ఐగా పోలీసు ఉద్యోగంలో చేరి అంచెఅంచెలుగా ఎదిగి నాన్‌క్యాడర్ ఎస్పీ హోదాకు వచ్చి ప్రస్తుతం మల్కాజిగిరి డీసీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ..సింధూశర్మ 2014 బ్యాచ్ ఐపీఎస్‌గా ఎంపికై మొదటి పోస్టింగ్ పెద్దపల్లి చేసి రెండు రోజుల కిందట జగిత్యాల ఎస్పీగా పోస్టింగ్‌ను పొందింది. ఈ విధంగా పోలీసు డ్యూటీలో భాగంగా తండ్రి నాన్ క్యాడర్ ఎస్పీ హోదాలో ఐపీఎస్ అధికారిని కూతురు సింధూ శర్మకు సెల్యూట్ చేయడం అరుదైన అంశంగా అందరికి ఆనందాన్ని ఇచ్చింది.

దీనిపై ఆమె మాట్లాడుతూ ఇలా నేను నా తండ్రి ఒకేచోట విధులు చెయ్య‌డం నాకు చాలా గర్వంగా ఉంది అని సింధూ శర్మ అన్నారు..
అలాగే మా కుమార్తె ఇంత పెద్ద హోదాలో ఉండ‌టం, ఆమెతో క‌లిసి విధులు చేయ‌డం చాలా సంతోషంగా ఉంది అని ఉమామ‌హేశ్వ‌ర‌శ‌ర్మ అన్నారు. మ‌రిచూశారుగా పుత్రికోత్సాహం ఆయ‌న‌కు ఎంత క‌లిగిందో. పిల్లలు ప్ర‌యోజ‌కులు అయితే అంత‌కంటే సంతోషం మ‌రొక‌టి ఏమి ఉంటుంది చెప్పండి.