ఏపీలో 48 గంటల్లో డేంజర్ హెచ్చరిస్తున్న సైంటిస్టులు

243

అరగంట వర్షం వస్తే నీరు అంతా రోడ్లపైనే ఉంటుంది .. ఇక రెండు మూడు గంటలు వర్షం కురిస్తే వారం రోజుల పాటు వర్షం నీరు రోడ్లపై ఉండి నగరం ముంచెత్తుతుంది. ముంబయి నగరంలో ఎంత ఎండ అయినా ఒకే కాని వర్షం పడితే మాత్రం ఈ నరకం భరించలేము అంటున్నారు అక్కడ జనంముంబైలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు 16 మందిని పొట్టునబెట్టుకున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు శిథిలావస్థలో ఉన్న కట్టడాలు కూలుతున్నాయి. తాజాగా మలాడ్ ఈస్ట్ ప్రాంతంలోని పింప్రిపాదలో గోడకూలి 12 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటనలో మరో 13 మంది గాయపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. క్షతగాత్రులు కాండ్వాలీలోని శతాబ్ది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.

Image result for heavy rains mumbai

ముంబై సమీపంలోని కల్యాణ్లో పాఠశాల గోడ కూలి ఓ మూడేళ్ల బాలుడు సహా ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనలో మరో నలుగుర్ని సురక్షితంగా బయటకు తీశారు. మరోవైపు, భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. పురాతన భవనాలు పక్క గుడిసెల్లో నివస్తున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా లోకల్ రైళ్లను నిలిపివేశారు. 54 విమాన సర్వీసులను సమీపంలోని విమానాశ్రయాలకు మళ్లించారు. గతేడాది నల్లాస్పొరలో 72 గంటల పాటు 550 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా దీన్ని ప్రస్తుత వర్షాలు అధిగమించాయి. గడిచిన 72 నుంచి 75 గంటల్లో 1000 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇది సాధారణ వర్షపాతం కంటే 200 మి.మీ. అధికం.

Image result for heavy rains mumbai

సోమవారం గంట సేపు సమయంలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. పరేల్ ప్రాంతంలో 43 మిల్లీమీటర్లు, వర్లిలో 35 మిల్లీమీటర్లు, వడాలలో 32 మిల్లీమీటర్లు, హాజి అలీ ప్రాంతంలో 26 మిల్లీమీటర్లు, బాండ్రాలో 53 మిల్లీమీటర్లు, చెంబూర్ ప్రాంతంలో 37 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. భారీ వర్షంతోపాటు వీచిన గాలులతో నిర్మాణంలో ఉన్న భవనం పైనుంచి వెదురు కర్రలు కింద పడ్డాయి. దీంతో చర్చ్ గేటు, మెరైన్ లైన్ ల మధ్య ట్రాఫిక్ స్తంభించి పోయింది. పాల్ఘార్ ప్రాంతంలో కురిసిన వర్షాల వల్ల పట్టాలపైకి వరదనీరు చేరడంతో ముంబై -వల్సాద్ మార్గంలో రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. దాదర్ ఈస్ట్ వద్ద వరదనీరు మోకాలి లోతు చేరింది. దీంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు వరదనీటిలోనే పాఠశాలలకు వచ్చారు. సియాన్ -మాటుంగా రైల్వే స్టేషన్ల మధ్య వరదనీరు పట్టాలను ముంచెత్తడంతో ఈ మార్గంలో రైళ్లను నిలిపివేశారు. వరదనీటితో రోడ్లు ఏర్లుగా మారడంతో గాంధీమార్కెట్, ఎస్ వీరోడ్డు, నేషనల్ కాలేజీ రోడ్లను మూసివేసి ట్రాఫిక్ ను దారి మళ్లించారు. ముంబై నగరంలో కురుస్తున్న భారీవర్షాలతో స్థానిక ప్రజలు అవస్థలు పడుతున్నారు.అలాగే ముంబయి శివారులో కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో పుణెలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లోనావాలా జాంరుంగా వద్ద గూడ్స్ పట్టాలు తప్పింది. దీంతో ముంబయి నుంచి బయలుదేరాల్సిన పలు రైళ్లు రద్దు అయ్యాయి.ముంబయి విమానాశ్రయంలో విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం చూపింది.

ఈ క్రింది వీడియో చూడండి

ముంబైలోని ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని మహారాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ముంబైలోని రహదారులపై భారీగా వర్షం నీరు నిలిచిపోయింది. కింగ్ సర్కిల్లో వర్షం నీరు ఇళ్లలోకి చేరింది. జులై 3 నుంచి 5 వరకు ముంబైలో భారీ వర్షాలు కురుస్తాయని ప్రయివేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ హెచ్చరికలు జారీచేసింది. ఇక ఇప్పుడు ముంబైని ముంచిన వర్షాలు మరో వారం రోజుల్లో ఏపీలో కూడా ఇలాంటి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. గోదావరి వరద నీరు భారీగా చేరే అవకాశాలు ఉన్నాయి అని ఏపీలో లోతట్టు ప్రాంతాలు మునిగే అవకాశం ఉంది అని చెబుతున్నారు. ఇటు తెలంగాణ నుంచి అటు వశిష్టగోదావరి వరకు ఈ వరద నీరు చేరుతుంది. దీంతో ఏపీలో ఈ వరదకు, ఏపీలో భారీ వర్షాలు తోడు అయితే ఆ నీరు అంతా గ్రామాలను ముంచుతుంది అని చెబుతున్నారు వాతావరణ సైంటిస్టులు.