1000 రూ.ల కోసం స్టేజ్ పై డ్యాన్సులు చేసేది.. ఇప్పుడు కొన్ని కోట్ల మంది ఈమె కోసం వెతుకుతున్నారు

825

మనం ఊర్లలో రికార్డింగ్ డాన్స్ షోలను చూస్తాం. ఆడవాళ్ళూ డాన్స్ లు చేస్తూ మగవారిని అలరిస్తారు.మగాళ్లు డబ్బులు వెదజల్లుతారు. ఆ డబ్బుల మీదనే ఆ డాన్స్ చేసే అమ్మాయిల జీవితం ఆధారపడి ఉంటుంది.ఎక్కువ డబ్బులు రావాలంటే ఆడవారు ఎక్కువగా అశ్లీలతతో డాన్స్ చెయ్యాలి.అలా ఎంత వాళ్ళ అందాన్ని చూపిస్తే వారికీ అంత ఎక్కువ డబ్బులు వస్తాయి.అయితే అలా డాన్స్ చేసేవాళ్ల గురించి తర్వాత ఎవరైనా పట్టించుకుంటారా అంటే అస్సలు పట్టించుకోరు. వారి మొహం కూడా గుర్తుకు ఉండదు.కానీ అలా రికార్డింగ్ డాన్స్ లు చేసే ఒక అమ్మాయి కోసం కోట్ల మంది నెట్ లో వెతికారు.ఆమె పేరు స్వప్న. ఈమె గురించి తెలుసుకోడానికి చాలా ఉంది.మరి తెలుసుకుందామా.

Related image

దక్షిణాది వారికి సప్న చౌదరి గురించి కొంత కాలం క్రితం వరకు పెద్దగా తెలియదు. కాని ఇప్పుడు దేశ వ్యాప్తంగా సప్న చౌదరి గురించి తెలుసు. సప్న చౌదరి గురించి దేశ వ్యాప్తంగా గూగుల్‌లో భారీ ఎత్తును ఈ సంవత్సరం సెర్చ్‌ చేశారు. దాదాపు దశాబ్ద కాలంగా సప్న చౌదరి స్టేజ్‌ షోలు ఇస్తుంది. కెరీర్‌ ఆరంభంలో మొదట రాజకీయ పార్టీలు మరియు ఏదైనా ప్రైవేట్‌ పార్టీల్లో స్టేజ్‌ షోలు ఇచ్చి డబ్బులు సంపాదించిన సప్న మెల్ల మెల్లగా స్టార్‌ క్రేజ్‌ను దక్కించుకుంది. ఆమెకు వచ్చిన క్రేజ్‌తో బిగ్‌బాస్‌లో కూడా ఛాన్స్‌ దక్కించుకుంది. సల్మాన్‌ ఖాన్‌ ప్రత్యేక ఆసక్తితో ఆమెను బిగ్‌బాస్‌లో ఎంపిక చేయించినట్లుగా అప్పుడు వార్తలు వచ్చాయి. సప్న చౌదరి ఉత్తరాధిన బాలీవుడ్‌ హీరోయిన్స్‌ కంటే ఎక్కువగా గుర్తింపు దక్కించుకుంది. అందుకు సాక్ష్యమే ఆమెను గుగూల్‌లో ఈసారి వెదకడమే అంటూ సినీ వర్గాల వారు చెబుతున్నారు.అప్పట్లో సప్న స్టేజ్‌ పై డాన్స్‌ వేస్తుంటే కొందరు డబ్బులు ఆమెపైకి వేసిరేవారు. అలా మొదలైన ఆమె కెరీర్‌ రోజుకు అప్పట్లో వెయ్యి నుండి అయిదు వేల వరకు సంపాదించేది. ఏ పార్టీ మీటింగ్‌ ఉన్నా, ఏ వేడుక ఉన్నా కూడా ఆమెకు తప్పకుండా పిలుపు అందేది.

Image result for village dance

సప్న పాటలకు మంచి క్రేజ్‌ ఉంది. ఆ తర్వాత సప్న కార్యక్రమాల్లో పాల్గొనాలంటే జనాలు టికెట్లు పెట్టి రావాల్సి వచ్చేది. నిర్వాహకులు భారీగా టికెట్ల రేట్లు పెట్టి ఆమె షోలు ఏర్పాటు చేశారు. టికెట్లు కొనుగోలు చేసి వచ్చి మరీ ఆమెపైకి వందలు అయిదు వందల నోట్లు సరదాగా విసిరేస్తూ ఉండేవారు.అంతటి క్రేజ్‌ దక్కించుకున్న సప్న చౌదరికి యూట్యూబ్‌ ద్వారా అద్బుతమైన ఫాలోయింగ్‌ దక్కింది. ఎప్పుడైతే ఆమె యూట్యూబ్‌లో ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుండి ఆమె గురించి ఇండియా వ్యాప్తంగా చర్చించడం, తెలుసుకోవాలనుకోవడం మొదలైంది. దాంతో ఈమె క్రేజ్‌ అమాంతం పెరిగి పోయింది. ప్రస్తుతం సప్న ఆదాయం కోట్లల్లోనే ఉంది. ఈమెకు బాలీవుడ్‌ నుండి కూడా ఆఫర్లు వస్తున్నాయి. కాని ఈమె మాత్రం స్టేజ్‌ షోలతోనే బిజీ బిజీగా గడిపేస్తోంది.

ముందు ముందు బాలీవుడ్‌లో కూడా ఈమె చక్రం తిప్పుతుందేమో అంటూ సినీ వర్గాల వారు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. వెయ్యి, అయిదు వందలకు స్టేజ్‌ పై డాన్స్‌లు వేసుకునే సప్న ఇప్పుడు కోట్లు సంపాదిస్తూ వస్తోంది.ఇదే సమయంలో ఆమెపై అశ్లీల డాన్స్‌లు చేస్తుందనే విమర్శలు కూడా ఉన్నాయి. దాంతో ఈమెకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. మొత్తానికి సప్న ఉత్తరాది నుండి మెల్లగా సౌత్‌కు కూడా అడుగు పెడుతోంది. ఇండియన్‌ క్రేజీ స్టార్‌గా సప్న ప్రస్తుతం దూసుకు పోతుంది.విన్నారుగా స్వప్న గురించి.మరి స్వప్న గురించి అలాగే ఆమె డాన్స్ షో స్టేజ్ నుంచి బాలీవుడ్ దాకా వెళ్ళడం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.