షూటింగ్ స్పాట్ లోనే మృతి చెందిన ప్రముఖ డాన్స్ మాస్ట‌ర్ షాక్ లో సినీ ఇండస్ట్రీ

246

త‌మిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత ఆ రేంజ్ లో మాస్ ఇమేజ్ సంపాదించిన హీరోలు అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు..అలాంటి వారిలో అజిత్ ఒకరు. అజిత్ నటించిన ఎన్నో తమిళ చిత్రాలు తెలుగు లో రిలజ్ అయి మంచి సక్సెస్ సాధించాయి.‘వీరం’,‘వేదాలం’,‘వివేగం’చిత్రాలతో వరుసగా సక్సెస్‌ కొట్టారు అజిత్‌. శివ డైరెక్షన్‌లో హ్యాట్రిక్‌ కొట్టిన అజిత్‌.. మరోసారి ‘విశ్వాసం’తో తన అభిమానుల ముందుకు రాబోతున్నాడు. ఈచిత్ర షూటింగ్ పూణే లో జరుగుతుంది.

ఈ షెడ్యూల్ లో ఒక సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. కాగా, విశ్వాసంకు సంబంధించిన పాటను షూట్‌ చేస్తుండగా.. డ్యాన్సర్‌ ఓవియన్‌ శరవణన్‌ హఠాత్తుగా మరణించాడు. గుండెపోటుతో అక్కడే కుప్పకూలిపోయిన అతన్ని చిత్రయూనిట్‌ ఆసుపత్రికి తరలించింది. హీరో అజీత్ కుమార్ కూడా సుమారు మూడు గంటల సేపు ఆసుపత్రిలోనే గడిపారు. అయితే ఆయ‌న‌కు చికిత్స్ అందించిన స‌మ‌యంలో ఆయ‌న ఆరోగ్యం కుదుట ప‌డుతుంది అని అనుకున్నారు కాని ఆయ‌న ఆరోగ్యం మ‌రింత క్షీనించింది.

శర్వాణన్ మరణించారనే వార్త తెలియగానే అజీత్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మృతదేహాన్ని పుణె నుంచి చెన్నైకు పంపేందుకు ఖర్చులన్నీ ఆయనే భరించారు. అజిత్ సుమారు రూ.8 లక్షలు వరకు వెచ్చించినట్లు చిత్రయూనిట్‌లో ఒకరు తెలిపారు. ఈవిషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాంతో అజిత్ చేసిన పనిని మెచ్చుకుంటూ ఆయన ఫై నెటీజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఆయ‌న‌కుటుంబానికి చిత్ర ప‌రిశ్ర‌మ నుంచి అండ‌గా ఉండేందుకు పెద్ద‌ల‌తో మాట్లాడ‌తాను అని అజిత్ తెలియ‌చేశార‌ట. ఇప్పటికే ప‌లు సినిమాలు ఆయ‌న‌తో క‌లిసి చేయ‌డంతో మంచి హిట్ డ్యాన్స‌ర్ గా ఆయ‌న పేరు సంపాదించుకున్నారు.. తాజాగా ఆయ‌న మ‌ర‌ణించ‌డంతో కోలీవుడ్ కు షాక్ త‌గిలింది. శ‌ర‌వ‌ణ‌న్ మ‌ర‌ణంతో ఇప్పుడు అంద‌రూ షాక్ లో ఉన్నారు, శ‌ర‌వ‌ణ‌న్ కుటుంబానికి ప‌రామ‌ర్శ‌లు తెలియ‌చేస్తున్నారు ఇటు కోలీవుడ్ ప్ర‌ముఖులు …ఆయ‌న భౌతిక కాయం చూడ‌టానికి ఆయ‌న ఇంటికి ఇప్పటికే పెద్ద సంఖ్య‌లో చేరుకుంటున్నారు..