ఆకలికి తట్టుకోలేక అత‌ను ఏమి తిన్నాడో చూస్తే క‌న్నీరు పెట్టుకుంటారు

450

చేతిలో చిల్లి గ‌వ్వ‌లేక‌పోతే ఎవరికైనా ఎటువంటి రెస్పెక్ట్ స‌మాజంలో ఉంటుందో తెలిసిందే.. డ‌బ్బుచుట్టూనే స‌మాజం న‌డుస్తోంది..ఇక ఆక‌లో రామ‌చంద్రా అన్నా నేటి రోజుల్లో ప‌ట్టించుకునే వాడు లేడు.. ఎవ‌రి లైఫ్ వారిది.. త‌మిళ‌నాడులో ఓ వ్య‌క్తి ద‌గ్గ‌ర చేతిలో చిళ్లి గ‌వ్వ‌లేదు, న‌మ్ముకున్న వారి ఇంటికి ప‌నికి వెళితే నువ్వు దేనికి ప‌నికి రావు అని ఛీ కొట్టారు… ఇలాంటి స్దితిలో ఓ వ్య‌క్తి ఎటువంటి ఆహారం తిన్నాడో తెలిస్తే మీరు క‌న్నీరు పెట్టుకుంటారు.. అస‌లు ఆ వ్య‌క్తి ఏమి తిన్నాడు.. ఇప్పుడు ఎందుకు ఈ విష‌యం ఇంత చ‌ర్చ‌నీయాంశ‌మైంది అనేది తెలుసుకుందాం.

Image result for indian beggars

తమిళనాడు రాష్ట్రంలోని థేనికి చెందిన గురుస్వామి వయసు 52 సంవత్సరాలు.దగ్గరి బందువులు పనిఇస్తామని చెప్పడంతో వారితో పాటే శబరిమళకు వెళ్లాడు..తీరా అక్కడికి వెళ్లిన తర్వాత నువ్వు ఇక్కడ ఏ పనికి సరిపోవంటూ చేతులెత్తేశారు..తీసుకెళ్లిన బంధువులు కనీసం దారిఖర్చులకైనా డబ్బులివ్వకుండా వెళ్లిపొమ్మంటూ పంపేశారు. చేతిలో ఉన్న కొంచెం డబ్బులతో 100 కిలోమీటర్ల దూరంలోని ఎరుమెలికి చేరుకున్నాడు. అక్కడ నుంచి థేనికి వెళ్లడానికి చేతిలో చిల్లిగవ్వ లేదు.. దీనికితోడు రెండు రోజులు అన్నపానీయాలు లేకుండా కాలం గడిపాడు.

Image result for indian beggars
ఆకలికి తట్టుకోలేక మండే ఎండలో ఓ ఆయుర్వేద షాప్ దగ్గర కూర్చొని ఓ కాగితంలో ఇసుక పోసుకుని దాన్ని తింటున్నాడు. చేతిలో డబ్బులు లేక,ఏం చేయలేక దిక్కుతోచని స్థితిలో..ఆకలికి తట్టుకోలేక దొరికిన ఇసుకనే పంచభక్ష్య పరమాణ్నం అనుకుని తింటున్నాడు ఆ వ్యక్తి..దారిన పోయే వారందరూ చూస్తున్నారు..చుట్టుపక్కల వారు కొందరు దీన్ని గమనించారు.మండుటెండలో ఆకలికి తట్టుకోలేక అతడు ఇసుక తినడం చూసిన వారికి కడుపు తరుక్కుపోయింది. కొంద‌రు త‌మ‌కెందుకులే అని అనుకున్నారు…. అలాగే మ‌రికొందరు పేపర్లో అన్నం తింటున్నాడేమో అనుకున్నారు..కాని దగ్గరికి వెళ్లి చూస్తే కాని తెలియలేదు అది అన్నం కాదు మట్టి అని.. దాంతో వెంటనే అతడికి కడుపు నిండా అన్నం పెట్టాలని నిశ్చయించుకున్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అతడిని దగ్గర్లోని హోటల్ కి తీసుకెళ్లి భోజనం పెట్టించారు… అత‌ని ప‌రిస్దితిని చూసి పోలీసులకు సమాచారం అందించారు.. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని అతడిని సొంత ఊరు పంపేందుకు అవసరమైన డబ్బులు స్థానికుల సాయంతో అందించారు….మనకు రోడ్డు మీద ఎందరో తారసపడుతుంటారు.పిచ్చోళ్లని మనం చూసీ చూడనట్టుగా వెళ్లిపోతాం….లేదంటే చీదరించుకుంటాం.కాని ఒక్కొక్కరి వెనుక ఒక బాధ ఏమిటో తెలుసుకుని మ‌న‌కు చేత‌నైనా సాయం చేయాలి అని మ‌ర‌చిపోకండి.. మ‌నకు ఆర్దిక సాయం చేయ‌డానికి కుద‌ర‌క‌పోయినా వేరేవారిద్వారా అయినా సాయం చేసే ప్ర‌య‌త్నం చేయాలి.. ఈ వీడియో పైమీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.