అప్పట్లో సైకిళ్లకు పంచర్లు వేసేవాడు ఇప్పుడు రూ150 కోట్ల ఆస్తి ఉంది..కానీ చివరికి ఏమైందో మీరే చూడండి

1195

బళ్ళు ఓడలు అవుతాయి.ఓడలు బళ్ళు అవుతాయనే సామెత గురించి మన అందరికి తెలిసిందే.అంటే ఈరోజు ఉన్న పరిస్థితి రేపు ఉండదు అనే అర్థం వస్తుంది.చాలా మంది విషయాలలో ఇది నిజం అయ్యింది కూడా.అప్పటివరకు కోటీశ్వరుడుగా ఉన్న వాడు ఒక్కసారిగా బికారిగా అవుతాడు.అప్పటివరకు బికారిగా ఉన్నవాడు బాగా డబ్బున్న వాడిగా అవుతారు.ఇప్పుడు మీకొక వ్యక్తి గురించి చెప్పబోతున్నాను.అతనిది అచ్చం ఇలాంటి పరిస్థితే.బీద నుంచి ధనికకు మారాడు.మళ్ళి ధనిక నుంచి బీద స్థితికి వచ్చాడు.మరి ఆ వ్యక్తి గురించి పూర్తీగా తెలుసుకుందామా.

ఇతని పేరు కందిశెట్టి రమేష్.ఈయన తిరుపతిలోని పల్లి వీధిలో పూలతోటలో నివాసం ఉంటున్నాడు.ఈయన 10 ఏళ్ల క్రితం పంచరు షాప్ నిర్వహిస్తు ఉండేవాడు.రోడ్డు పక్కన చిన్న షాపు పెట్టుకున్నాడు.ఇక్కడ సైకిలు అద్దెకి ఇవ్వబడును , సైకిల్ పంచరు వేయబడును మరియు గంట సైకిల్ అద్దె రూ.5 సైకిల్ పంచరు వేస్తే రూ.10 అనే బోర్డ్ పెట్టాడు. వానకొచ్చిన, వరదొచ్చినా షాపు కూలిపోతుంది.ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడితే వచ్చేది రోజుకి రూ.250 మాత్రమే.కానీ ఇది ఒకప్పుడు.ఇప్పుడు అతని రాతే మారిపోయింది.

సైకిల్ స్టోర్ నిర్వహించే సమయంలో అక్కడ అందరితో పరిచయాలు ఏర్పడ్డాయి.నమ్మకస్థుడు అని పేరు రావడంతో చీటిల వ్యాపారం మొదలు పెట్టాడు టైం టూ టైం చెల్లింపులు ఉండేవి. ప్రజలలో ఈయన పై నమ్మకం మరింత పెరిగింది. ఇదే సమయంలో వచ్చిన డబ్బును వడ్డీకి ఇచ్చేవాడు. సైకిల్ షాప్ పోయి చిట్స్ ఆఫీస్ వచ్చింది.ఈ చిట్స్ ఆఫీసులో సామాన్యులు నుంచి సంపన్నుల వరకు చిట్స్ వేయడం మొదలు పెట్టారు. వడ్డీకి వచ్చే అప్పులు కూడా వేలు, లక్షలు దాటి కోట్లకి పోయింది. తన లావాదేవీల కోసం ఏకంగా ముగ్గురు ఆడిటర్లను నియమించుకున్నాడు

ఇది కాకుండా బంగారం వ్యాపారంలోకి దిగాడు ఇలా అంచలంచలుగా ఎదిగిన రమేష్ ఆస్థి రూ.150 కోట్లకి పెరిగింది. ఇటీవలే అధునాతనమైన భవనము కూడా కట్టుకున్నాడు.ఇప్పుడు ఇతని దగ్గర ఒక బడా బిజినెస్ మ్యాన్ ఇతని దగ్గర ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా అప్పులు చేస్తుంటారు. 2014 ఎన్నికలలో పోటీ చేసిన ఐదుగురు రాజకీయ నాయకులకు వడ్డీకి డబ్బులు ఇచ్చాడు.పది ఏళ్లలో రూ.150 కోట్లు సంపాధించిన కందిశెట్టి రమేష్ ఐడియాల పై ఎవరికీ డౌట్ లేకపోయినా అయన ఆదాయ పన్ను ఏగొట్టడంతో అసలు సమస్య వచ్చింది.వీటన్నిటి గురించి ఆరాతీసిన ఆదాయపన్ను అధికారులు రమేష్ ఆస్తులపై దాడి చేసారు. అధికారులు ఏకంగా మూడు రోజులు సోదాలు చేశారు. సోదా చేసిన అధికారులకి 8 కేజీల బంగారం మరియు రూ.150 కోట్ల విలువ చేసి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.ప్రస్తుతం కందిశెట్టి రమేష్ పరారీలో ఉన్నాడు అంటా.అతని ఆస్తి మొత్తం పోయి కుటుంబం రోడు మీద పడింది.విన్నారుగా ఇతని జీవితంలో జరిగిన విచిత్రం.అంచెలంచెలుగా ఎదిగి పన్ను కట్టకుండా ఎంతటి స్థితికి వచ్చాడో.