భారతదేశంలో గత 50ఏళ్ళుగా పిల్లలు పుట్టని ఒక శాపగ్రస్తమైన గ్రామం ఎక్క‌డో తెలిస్తే మ‌తిపోవ‌డం ఖాయం

343

పిల్ల‌లు లేక చాలా మంది బాధ‌ప‌డుతూ ఉంటారు. పెళ్లి అయి 10 ఏళ్లు అయినా పిల్ల‌లు క‌ల‌గ‌లేదు అని, అనేక దేవాల‌యాలకు వెళ్లి పూజ‌లు చేస్తారు. అలాగే పెద్ద ఎత్తున మొక్కులు మొక్కుకుంటారు.. ఇక పూజ‌లు వ్ర‌తాలు ఉప‌వాసాలు ఇలా వీలైన‌వి అన్నీ చేస్తారు.. ఇక పెద్ద ఎత్తున దేశంలో అనేక దేవాల‌యాల్లో సంతానం గురించి పూజ‌లు చేసే మ‌హిళ‌ల‌ను చూసే ఉంటాము. ఇలా పిల్ల‌ల కోసం ఇంత క‌ష్ట‌ప‌డుతుంటే మ‌రో ప‌క్క ఓ ప్రాంతంలో ఓ శాపం వ‌ల్ల పిల్ల‌లు పుట్ట‌ర‌ట‌, విన‌డానికి కాస్త ఆశ్చ‌ర్యంగా ఉన్నా ఇది వాస్త‌వం.. మ‌రి ఆ ప్రాంతం మ‌న దేశంలో ఉంది.. ఆ ప్రాంతంలో శాపం ఏమిటి? ఎందుకు ఇలా జ‌రుగుతోంది? సైన్స్ డ‌వ‌ల‌ప్ అయిన స‌మ‌యంలో ఇది న‌మ్మ‌క‌మా మూడ‌న‌మ్మ‌క‌మా అనేది తెలుసుకుందాం.

Image result for village

చాలా ఏళ్ల నుంచి పిల్లలు అస్సలు పుట్టని ప్రదేశం గురించి మీరు ఊహించగలరా? అలాంటి ఒక గ్రామం భారతదేశంలో ఉంది, ఇక్కడ గత 50 ఏళ్ళుగా ఒక బిడ్డ కూడా పుట్టలేదంట. దేశంలో అంతగా పేరు తెలీని ఈ గ్రామంలో స్థానికులు గత 50 ఏళ్ళ నుంచి తమ గ్రామంలో పిల్లలు పుట్టడం జరగలేదని, ప్రోత్సహింపబడలేదని తెలిపారు.ఈ గ్రామం మధ్యప్రదేశ్ లో భోపాల్ కి 70 కిమీల దూరంలో ఉంది. ఇదేం ప్రసిద్ధి చెందిన స్థలం కాదు, ఇక్కడ జనాభా కూడా కేవలం పెద్దవారు, వృద్ధులు మాత్రమే.గ్రామస్తుల నమ్మకం ఏంటంటే, వారి గ్రామంలో పిల్లలు పుడితే, వారు బతకరని చెబుతారు, ఏదో విధంగా జ‌బ్బు వ‌స్తుంది అని వెంటనే తొందరగా చనిపోతారనే అభిప్రాయం చాలా గట్టిగా పాతుకుని ఉంది. వారి నమ్మకం ప్రకారం ఆ బిడ్డ వికలాంగులుగానే పుడతారు కూడా.

ఈ గ్రామం యొక్క చరిత్ర స్థానికుల కథనం ప్రకారం, ఇక్కడ శ్రీకృష్ణుడి గుడి ఒకటి ఉండేది. గ్రామంలో పవిత్రతను నిలిపి ఉంచడానికి, పూజారి గ్రామం వెలుపలే పురుడు పోసుకోవాలని సూచించారట. ఇక అప్పటినుంచి అదే సంప్రదాయం కొనసాగుతోంది.ఇక్కడ గ్రామపెద్ద వయస్సు 50 ఏళ్ళకి పైమాటే. ఆయన మాట్లాడుతూ గత 50 ఏళ్లనుంచి ఇక్కడ పిల్లలు పుట్టడాన్ని కనీ,వినీ ఎరగలేదని చెప్పారు.చాలా ఏళ్ళ తర్వాత, గ్రామస్తులు ఈ సంప్రదాయం మార్చటానికి సానుకూలంగా ఉన్నారు . అందుకని వారొక డెలీవరీలకోసం పురిటిగదిని నిర్మించారు. అందులో స్త్రీలు సురక్షితంగా పిల్లలను కనవచ్చు అని చెబుతున్నాడు. మ‌రి చూశారుగా ఆ క‌ట్టుబాట్లు పెట్టిన పూజారి లేడు కాని ఆ జ‌నం మాత్రం ఇంకా ఆ క‌ట్టుబాట్ల‌ని న‌మ్ముతూ జీవిస్తున్నారు. మ‌రి ఈ ప్రాంతం పై వారు న‌మ్ముతున్న సిద్దాంతం పై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.