పడక గదిలోకి వస్తే ఆఫర్.. నా తల్లిపై కూడా.. మరో హీరోయిన్ ఆవేదన

285

మీటూ ఉద్యమంతో నటీమణులు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నారు. నటించడానికి ఎన్నో కలలతో సినిమా రంగంలోకి వచ్చిన నటీమణులకు వేధింపులు తప్పడం లేదు. వారి అవసరాన్ని అలుసుగా తీసుకుని రెచ్చిపోతున్న ఉందంతాలు వెలుగు చూస్తున్నాయి. దీనిపై మీటూ పేరుతో బాలీవుడ్‌లో ఉద్యమం మొదలైన సంగతి తెలిసిందే.దక్షిణాది చిత్ర పరిశ్రమలో గాయని చిన్మయి శ్రీపాద, లీనా మణిమేకలై లాంటి సినీ తారలు కొందరిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేవారు. వారిలో హీరో అర్జున్, రచయిత వైరముత్తు, డైరెక్టర్ సుశీ గణేషన్ లాంటి వాళ్లు ఉండటం చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది. అయితే ఇప్పుడు మరొక హీరోయిన్ కూడా తన గొంతును విప్పింది. మరి ఆ హీరోయిన్ ఎవరో ఎవరి మీద ఆరోపణలు చేసిందో చూద్దామా.

Image result for కణి కసృతి

సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల ఆరోపణలు ఇటీవల కాలంలో ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అందాల తారలకు ఆఫర్ల ఆశచూపి లైంగికంగా, శారీరకంగా వేధించే విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అదే కోవలో కాస్త ఆలస్యంగా.. లైంగిక వేధింపులకు గురైన కణి కసృతి అనే నటి విషయం బయటకు పొక్కింది. విభిన్నమైన, విలక్షణమైన నటనతో ఆకట్టుకొంటున్న అందాల తార కణి కసృతికి కెరీర్ ఆదిలోనే చేదు అనుభవం ఎదురైంది. కాక్‌టెయిల్, షికార్ లాంటి చిత్రాల్లో అందం, అభినయంతో మెప్పించింది. తమిళంలో కూడా పిసావసు, బర్మా అనే చిత్రాల్లో కనిపించింది. ఇక కేఎం సర్జున్ దర్శకత్వంలో వచ్చిన మా షార్ట్ ఫిలిం ద్వారా సినీరంగంలో మంచి గుర్తింపు తెచ్చుకొన్నది. ఆమె నటనకు అద్భుతమైన స్పందన వచ్చింది. మంచి నటిగా రాణిస్తుందని అనుకొంటున్న సమయంలో అనూహ్యంగా నటనకు స్వస్తి చెబుతూ కణి కసృతి షాకింగ్ నిర్ణయం తీసుకొన్నది. కారణమేమిటని ఆరా తీయగా లైంగిక వేధింపులని తెలిసింది.

ఈ క్రింది వీడియో చూడండి 

మలయాళ మీడియాకు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కణి మాట్లాడుతూ.. ఓ చిత్ర దర్శక, నిర్మాతలు తమను శారీరకంగా సుఖపెట్టాలని కోరారు. పడకగదిలోకి పంపిస్తే ఆఫర్ ఇస్తామని నా తల్లిపై కూడా ఒత్తిడి తెచ్చారు. నేను ఒప్పుకోకపోవడంతో అవకాశాలు రాలేదు. జీవితం గడిచే పరిస్థితి లేకపోవడం వల్ల నటనను వదులుకొన్నాను పేర్కొన్నారు. సినీ పరిశ్రమలో మీటూ ఉద్యమం ఊపందుకోవడం శుభపరిణామం. సినీ రంగంలో మహిళలకు కొంత మేలు జరుగుతుంది. కొందరైనా మారితే తారలకు న్యాయం జరుగుతుంది అని కణి వెల్లడించింది. కణి మాదిరిగానే మరికొందరు మహిళా నటులు ముందుకొస్తే పరిస్థితిలో స్పష్టమైన మార్పు కనిపించే అవకాశం లేకపోలేదు. మరి కాణి చేసిన ఈ వ్యాఖ్యల గురించి అలాగే సినీ ఇండస్ట్రీలో ప్రకంపనలు స్పృష్టిస్తున్న మీటూ ఉద్యమం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.