కాకి ఇంట్లోకి దూరింది తర్వాత చూస్తే ఇంట్లోని వారంతా శవమై ఉన్నారు అసలు ఇంట్లో ఏం జరిగిందో తెలిస్తే కన్నీళ్ళు ఆగవు

575

మన సమాజం ఎంత డెవలప్ అవుతున్నా మన మనుషులు మాత్రం ఇంకా మూఢనమ్మకాలతోనే గడుపుతున్నారు.పిల్లి ఎదురొస్తే దరిద్రమని కాకి ఇంట్లోకి వస్తే అరిష్టమని… ఇలా చెప్పుకుంటూపోతే మనుషులు చాలా రకాల మూఢనమ్మకాలను పాటిస్తారు.అయితే అలా పాటించడం వలన ఎలాంటి నష్టం జరగకపోతే ఏమి కాదు కానీ ఏదైనా నష్టం జరిగితేనే అందరు బాధపడాల్సి వస్తుంది.ఇప్పుడు అలాంటి ఒక బాధాకర ఘటన గురించే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను.కాకి ఇంట్లోకి దూరిందని అరిష్టమని నమ్మి చివరకు కుటుంబంలోని అందరు ప్రాణాలనే కోల్పోయారు.అసలేమైంది.పూర్తీగా చెబుతా వినండి.

అనంతపురం కంబదూరు మండంలోని తిమ్మాపురం గ్రామంలో నివసించే సుబ్బరాయుడు కులవృత్తి వడ్డె పనికి పోతూ గ్రామంలో కూలీ పనులకు కూడా వెళ్లి భార్య, ఇద్దరు పిల్లలను పోషించుకునేవాడు. భార్య తిమ్మక్క వికలాంగురాలు కావడంతో ఇంటిలోనే పనులు చేసుకుంటూ ఉండేది.అయితే వీరు ఉంటున్న ఇంట్లోకి కాకి దూరింది.అయితే కాకి దూరిన ఇంట్లో ఉండటం మంచిది కాదని చెప్తే వెంటనే ఖాళీ చేసి వారికి ఉన్న పాత ఇంట్లోకి వెళ్లారు.అలా వెళ్లి మూడు నెలలు అవుతుంది. మూడునెలలు బుధవారానికి పూర్తవడంతో సొంతింటిలోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు బంధువులను ఫోన్‌ ద్వారా ఆహ్వానించారు. తమ ఇంటికి రంగులు కొట్టించాడు. మరుసటి రోజు తమ ఇంటికి వెళదామనుకున్న సమయంలో తెల్లవారకనే వారి బతుకులు తెల్లవారిపోయాయి. పాత మిద్దె ఆ కుటుంబాన్ని బలిగొంది. సుబ్బరాయుడు అప్పటివరకు బీడీ తాగుతూ ఇంటిలోనే ఒక మూలన కూర్చోని టీవీ చూస్తూ ఉన్నాడు. కనురెప్పపాటులో పాతమిద్దెకు ఉన్న దూలాలు కిందకు పడిపోవడంతో పైకప్పు అంతా కుప్పకూలిపోయింది. గట్టిగా కేకలు వేయడంతో చుట్టు పక్కల వాళ్లు లేచి చూసే సరికి అప్పటికే మూడు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వడ్డె సుబ్బరాయుడిని మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు.

సుబ్బరాయుడు కొడుకు రవి గ్రామంలోనే ఉన్న పాఠశాల్లో ఆరో తరగతి చదువుతున్నాడు. కూతురు మహాలక్ష్మీ ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. రవి ప్రతిరోజు గ్రామంలో ఉన్న ఆనందనిలయం వసతిగృహంలో తన స్నేహితులతో కలిసి అక్కడే భోజనం చేసి పడుకునేవాడు. మంగళవారం రాత్రి తమ తల్లి దగ్గరకు వెళ్లాలని చెప్పి వచ్చేశాడు. తల్లి తిమ్మక్క మంచంపైనే పడుకుంది. కుమారుడు రవి, కుమార్తె మహలక్ష్మీ ఇద్దరూ నేలపైనే పడుకున్నారు. నిద్రలోనే మృత్యుఒడిల్లోకి జారుకున్నారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పాతమిద్దెలో కాపురం వద్దని గ్రామస్థులు వారించారు. ఊరంతా గాలించినా అద్దె ఇల్లు దొరకకపోవడంతో గత్యంతరం లేకపోవడంతో చివరికి ఆ పాతమిద్దెల్లోనే ఉండాల్సిన దుస్థితి నెలకొంది. గాయాలతోనే ప్రైవేట్‌ వాహనంలో తిమ్మాపురం గ్రామానికి తండ్రిని తీసుకురావడంతో పిల్లలు రవి, మహలక్ష్మీ, భార్య తిమ్మక్కలను చూసి బోరును విలపించాడు. తాను ఏ పాపం చేశాను దేవుడా అంటూ రోదించడం అక్కడున్న వారి హృదయాలను కలిచివేసింది.చూశారుగా కాకి దూరిందని ఇంటిని వదిలి సౌకర్యంగా లేని పాత ఇంట్లోకి వెళ్లి ఎలా ప్రాణాలను కోల్పోయారో.