నిజంగా ఇది అద్భుతం:ఆవు పేడతో నడుస్తున్న బస్సు

362

గోవును హిందువులు పవిత్రంగా పూజించే విషయమూ తెలిసిందే. ప్రస్తుతం దేశంలో గోవుకు ఎంత ప్రాధాన్యత పెరుగుతుంది.ఈ నేపధ్యంలో గోమూత్రం, పేడ కూడా అత్యంత విలువైనవిగా మారిపోతున్నాయి.

గోమూత్రాన్ని పూజలప్పుడు ఇంటి శుద్ది చేయడానికి,గోవు పేడను ఇంటి ముందు కల్లాపి చల్లుకోవడానిక,పిడకలు కొట్టడానికి ఉపయోగిస్తారని మనకు తెలుసు.అయితే ఇప్పుడు ఏకంగా వాహనాన్ని నడపడానికే ఉపయోగిస్తున్నారు.అది కూడా మామూలు స్పీడ్ తో కాదు.ఏకంగా 123 కి.మీ.వేగంతో నడుస్తుంది.ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది నిజం.మరి ఆ వాహనం ఆవు పేడతో ఎలా నడుస్తుందో పూర్తీగా తెలుసుకుందామా.

హిందువులకు పవిత్రమైన ఆవు తన పేడతో అద్భుతం సృష్టించింది. తన పేడ పెట్రోల్, డీజల్ కంటే ఏమి తీసిపోదని నిరూపించింది. ఆవు పేడతో ఒక అత్యాధునికమైన బస్సును గంటకు 123.57 కిలో మీటర్లు నడపవచ్చని నిరూపించారు. ఆవు పేడతో వంట గ్యాస్, విద్యుత్ తయారు చేశారు. ఆవు పేడను అనేక విదాలుగా ఉపయోగిస్తుంటారు. అయితే మొదటి సారి ఒక బస్సుకు ఆవు పేడ వేసి అత్యంత వేగంగా నడపవచ్చని నిరూపించారు. లండన్ లోని బెడ్ ఫోర్డ్స్ లోని మిల్ బ్రూక్ గ్రౌండ్స్ లో బుధవారం ఈ పరీక్ష నిర్వహించారు. అత్యాధునిక మైన బస్సు ఆవు పేడతో గంటకు 123.57 కిలో మీటర్ల వేగంగా ప్రయాణించి రికార్డు సృష్టించింది. బస్సు పై కప్పు మీద ఎర్పాటు చేసిన 7 ట్యాంకులలో ఆవు పేడను నింపుతున్నారు. తరువాత ఆ ట్యాంకులలో ఉద్బవించే బయోమీథేన్ గ్యాస్ ఆదారంగా ఈ బస్సు ప్రయాణిస్తున్నది.

బస్సులోని ప్రయాణికులకు ఆవు పేడ వాసన రాకుండా పలు జాగ్రతలు తీసుకున్నామని తయారీదారులు అంటున్నారు. ఇంత చేసినా గిన్నీస్ బుక్ రికార్డులో చోటు దక్కలేదు. గిన్నీస్ బుక్ రికార్డులో గంటకు 250 కిలో మీటర్ల వేగంతో నడిచే బస్సు రికార్డు ఉంది. త్వరలోనే ఆవు పేడతో 250 కిలో మీటర్ల వేగంతో బస్సు నడిపి గిన్నిస్ బుక్ రికార్డులో చోటు దక్కించుకుంటామని వారు అంటున్నారు. మొత్తం మీద ప్రపంచంలో ఆవు పేడతో అత్యంత వేగంగా నడిచే బస్సు అందరిని ఆకర్షిస్తున్నది.మరి ఈ అధ్బుతం గురించి మీరేమంటారు