చెల్లికి తాళి కట్టిన అక్క. వీళ్ళు చేసిన పనికి ఊరు మొత్తం షాక్!

164

అక్కాచెల్లెల బంధం విడదీయరానిది అని అందరికీ తెలుసు. అయితే క్లోజ్ గా ఉండే అక్కాచెల్లి జీవితాంతం అలాగే ఉండాలనుకున్నారో ఏమోగానీ వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.సాధారణంగా స్త్రీపురుషులు వివాహం చేసుకుంటారనేది అందరికీ తెలిసిన సంగతే. అయితే స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సాక్షాత్తూ దేశ ఉన్నత న్యాయస్థానం తీర్పునిచ్చిన కారణంగా చాలామంది స్వలింగ సంపర్కులు తమ బంధాన్ని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. వారిలో కొంతమంది ఒక అడుగు ముందుకు వేసి పెళ్లి చేసుకుంటున్నారు. మరి పెళ్లి చేసుకున్న ఆ అక్కాచెల్లెళ్ల ఘటన గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Sisters

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వరుసకు అక్కాచెల్లెళ్లు అయిన ఇద్దరు అమ్మాయిలు బుధవారం నాడు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కాన్పూర్‌కు చెందిన ఓ యువతి తనకు చెల్లి వరుసయ్యే మరో యువతిని స్థానికంగా ఉండే శివాలయానికి తీసుకువెళ్లింది. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేలా ఎరుపు రంగు చున్నీని ముఖానికి ధరించి వెళ్లారు. తాము ఒకరినొకరు ప్రేమించుకున్నామని, తమకు పెళ్లి చేయవలసిందిగా పూజారిని కోరగా, ఆయన అందుకు నిరాకరించారు. అయితే అక్కడే భీష్మించుకుని కూర్చున్నారు. అయినా కానీ ఇది సృష్టికి విరుద్ధం అని నేను ఈ పాపాన్ని చేయలేనని పూజారి తెగేసి చెప్పాడు. అయినా కానీ ఆ యువతులు వినలేదు. పూజారి పెళ్లి చేస్తాడేమో అనుకున్నారు. కానీ పూజారి చేయకపోవడంతో కొంతసేపటికి వారు తమకు తాముగా వివాహం చేసుకున్నారు. ఇక వారు చేసుకున్న పెళ్లి అందరికి తెలియాలని ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఈ క్రింది వీడియో చూడండి

పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై ప్రస్తుతం వారణాసిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇటువంటి స్త్రీ స్వలింగ వివాహం జరగటం వారణాసి చరిత్రలో ఫస్ట్ టైం అని పలువులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి వివాహం పవిత్ర పుణ్యస్థలం అయిన వారణాసిలో జరగడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రధాని మోదీ ఎంపీగా గెలుపొందిన నియోజకవర్గం కావడం విశేషం. పెళ్లిపై అవగాహన లేకనే వీరు అలా ప్రవర్తిస్తున్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. కానీ స్వలింగ సంపర్కాన్ని అనుకరించే వారు, స్వలింగ సంపర్కాన్ని ఇష్టపడేవాళ్లు వీరిని ఆశీర్వదిస్తున్నారు. మరి ఈ అక్కాచెల్లెళ్ల పెళ్లి గురించి అలాగే సమాజంలో రోజురోజుకు పెరిగిపోతున్న స్వలింగ సంపర్కం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.

ఈ క్రింది వీడియో చూడండి