బిర్యానీ ఆర్డర్ చేస్తే అందులో ఉన్నది చూసి షాకైన వ్యక్తి..

474

హైద‌రాబాద్ లో ప్రారంభ‌మైన వర‌ల్డ్ క్లాస్ స్టోర్ గురించి మీడియా అంతా కోడై కూసింది.. ఇంత ఆర్భాటాలు హంగుల‌తో అతి పెద్ద బిజినెస్ ప్రారంభించారు ఆ స్టోర్ యాజ‌మాన్యం. తెలంగాణ‌లో ఓ ఐకాన్ గా ఐకియా మారింది. అలాంటి ఐకియా స్టోర్ నెల‌రోజులు పూర్తి అయ్యే స‌మ‌యానికి ఓ పెద్ద అభాండం మీద వేసుకుంది.నెల రోజుల క్రితమే హైటెక్‌సిటీ ప్రాంతంలో గ్రాండ్‌గా ప్రారంభమైన ఐకియా స్టోర్‌కు చెందిన ఫుడ్‌కోర్టులో, శాఖాహార బిర్యానీలో గొంగళిపురుగు వచ్చిన ఘటన కలకలం సృష్టించింది. దీంతో అక్క‌డ ఉన్న‌వారు కూడా అంద‌రూ షాక్ అయి బిర్యానిని ప‌క్క‌న పెట్టేశారు..బిర్యానీ బాధితుడు సామాజిక మాధ్యమం ద్వారా చేసిన ఫిర్యాదుకు స్పందించి జీహెచ్‌ఎంసీ అధికారులు తనిఖీలు నిర్వహించి నిర్వాహకులకు రూ.11,500 జరిమానా విధించారు.

Image result for ikea

రెండు రోజుల క్రితం ఐకియా స్టోర్‌కు వెళ్లిన మొహమ్మద్‌ అక్కడి ఫుడ్‌కోర్టులో బిర్యానీ తింటుండగా.. అందులో గొంగళి పురుగు కనిపించింది.ఈ విషయాన్ని అతడు స్టోర్‌ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా ట్విట్టర్‌ ద్వారా సంబంధిత అధికారులకు ఈ విషయాన్ని చేరవేశారు. దీనిపై స్పందించిన జీహెచ్‌ఎంసీ ఫుడ్‌ సెఫ్టీ అధికారులు స్టోర్‌లో తనిఖీలు నిర్వహించారు. స్టోర్‌లోని ఆహార పదార్థాలను పరిశీలించిన అధికారులు.. వాటిని పరీక్షలు నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. అదేవిధంగా ఐకియాకు 11,500 రూపాయల జరిమానా విధించారు. ఐకియాకు బిర్యానీ సరఫరా చేస్తున్న నాగ్‌పూర్‌కు చెందిన హల్దీరామ్ సంస్థకు కూడా నోటీసులు జారీచేశారు.ఈ ఘటనపై ఐకియా ప్రతినిధులు స్పందిస్తూ.. జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపడతామని.. మరోసారి ఇలా జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నిర్వహణ లోపాలను సరిచేసుకుంటామని ప్రకటించింది  ఐకియా స్టోర్‌కు మ‌రోప‌క్క మొహమ్మద్ ఈ విష‌యం పై మాట్లాడుతూ అక్కడి ఫుడ్‌కోర్టులో బిర్యానీ తింటుండగా.. అందులో గొంగళి పురుగు కనిపించిందని చెప్పాడు. యాజ‌మాన్యానికి చెప్ప‌డ‌మే కాకుండా ట్విట్టర్‌ ద్వారా సంబంధిత అధికారులకు ఈ విషయాన్ని చేరవేశారు.దీంతో అధికారుల రంగ‌ప్ర‌వేశం చేశారు. లేక‌పోతే ఇలాంటి ఘ‌ట‌న‌లే మ‌ళ్లీ జ‌రుగుతాయ‌ని, అందుకే ఇలా చేశాను అని అంటున్నాడు. మ‌రి ఐకియా సేల్స్ లో దూసుకుపోతోంది, క‌స్ట‌మ‌ర్ల‌కు ఇలా ఫుడ్ స‌ర్వీసు విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోతే క‌ష్టం అంటున్నారు క‌స్ట‌మ‌ర్లు… చూశారుగా ఈ ఘ‌ట‌న‌పై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.