గ్యాస్ సిలిండర్ ఉన్నవాళ్లకు ఇప్పుడే వచ్చిన పెద్ద గుడ్ న్యూస్

134

ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ఉపయోగించే వారికి కేంద్రం తీపికబురు అందించింది.. గ్యాస్ సిలిండర్ మరోసారి తగ్గింది. ఇటీవలనే రూ.100కు పైగా తగ్గిన సిలిండర్ ధర ఇప్పుడు మళ్లీ మరో రూ.62 తగ్గింది. గ్యాస్ సిలిండర్ తగ్గింపు ధర నేటి నుంచే అమలులోకి వచ్చింది. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర రెండు నెలల్లో రూ.160కు పైగా దిగొచ్చింది. గ్యాస్ సిలిండర్ ధర ప్రతి నెలా తొలి రోజు మారతాయి. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఎల్‌పీజీ ధరలు, డాలర్-రూపాయి మారకపు విలువ వంటి అంశాల నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ ధర పెరగడం లేదా తగ్గడం ఉంటుంది. ‘దేశీ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.62.50 తగ్గింది. 2019 ఆగస్ట్‌లో 14.2 కేజీల సిలిండర్ బుకింగ్‌కు రూ.574.5 చెల్లిస్తే సరిపోతుంది. జూలైలో గ్యాస్ సిలిండర్ బుకింగ్ ధర రూ.637గా ఉంది’ అని ఇండియన్ ఆయిల్ తెలిపింది. గ్యాస్ సిలిండర్ ధర కోల్‌కతాలో రూ.601గా, ముంబైలో రూ.546.5గా, చెన్నైలో రూ.590.50గా ఉంది. ఇకపోతే ఏడాదిలో 14.2 కేజీ 12 సిలిండర్లను సబ్సిడీ రూపంలో పొందొచ్చు. సబ్సిడీ మొత్తం డైరెక్ట్‌గా కన్సూమర్ బ్యాంక్ అకౌంట్‌లో పడిపోతుంది. సబ్సిడీ మొత్తం ప్రతినెలా మారుతూ ఉంటుంది.

గతేడాదికి ఈ ఏడాదికి ధరల్లో మార్పును ఒకసారి గమనిస్తే… సబ్సీడీయేతర వంటగ్యాస్ ధర గతేడాది రూ.96 ఉండగా ప్రస్తుతం అది రూ. 98.5కు చేరుకుంది. సబ్సీడీ వంట గ్యాస్ ధర గతేడాది రూ.4.71 ఉండగా ఈ ఏడాది అది రూ.4.83కి చేరుకుంది. ప్రస్తుతం ప్రభుత్వం ఒక ఇంటికి 12 సిలిండర్లకు సబ్సడీ ఇస్తోంది. సబ్సీడీ ధర నేరుగా వినియోగదారుడి బ్యాంకు ఖాతాలో వేస్తోంది. ఇక సబ్సీడీ సిలిండర్ కాకుండా ఇంకా ఎక్కువ గ్యాస్ సిలిండర్‌లు అవసరమైతే వినియోగదారుడు మార్కెట్ ధర చెల్లించాల్సి ఉంటుంది. అయితే సబ్సడీ ధరలు ప్రతినెల మారుతూ ఉంటాయి. ఇక మన రాష్ట్ర విషయానికి వస్తే.. LPG గ్యాస్ సిలిండర్లు రేట్లు ఈ విధంగా ఉన్నాయి. హైదరాబాద్ లో 690.00 రూపాయలు ఉండగా, విజయవాడలో 643.50., విశాఖపట్నం 642.50, కర్నూల్ 691.00 , గుంటూరు 664.00, వరంగల్ 708.50, ఖమ్మంలో 670.50 రూపాయలుగా ఉంది.

ఈ క్రింద వీడియో చూడండి

బీజేపీ ప్రభుత్వం 2014 మేలో అధికారం చేపట్టింది. అప్పుడు సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.414 ఉండేది. అది ఇప్పటికీ పెరుతూనే వస్తుంది. అప్పటి నుంచి సిలిండర్ ధర సరాసరి 16శాతం పెరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. విమానాల్లో ఉపయోగించే ఏటీఎఫ్ ధరను ప్రభుత్వం తగ్గించింది. సబ్సిడీ కింద కొనుగోలు చేసే ఎల్‌పీజీ సిలిండర్ ధర స్వల్పంగా రూ.1.23 మేర పెరిగింది. ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఒక కుటుంబం సబ్సిడీ కింద ఏడాదికి గరిష్టంగా 12 గ్యాస్ సిలిండర్లను పొందే అవకాశం ఉంది. సిలిండర్ ధరను చెల్లించిన తర్వాత సబ్సిడీ బ్యాంక్ అకౌంట్‌లో జమ అవుతుంది. సవరించిన ధరలు ఆగస్టు 1 నుంచి అమలులోకి వచ్చాయి.