బిగ్ బాస్ హౌస్ లో కౌశ‌ల్ -దీప్తికి వివాదం సీరియ‌స్ అయిన బిగ్ బాస్

404

బిగ్ బాస్ ఎంట్రీకి వ‌చ్చి నానితో క‌లిసి మాట్లాడారు కాని వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్ లోకి వ‌చ్చిన శ్యామలా నూత‌న నాయుడు బిగ్ బాస్ ఇంట్లోకి మాత్రం వెళ్ల‌లేదు. అయితే గ‌త వారం ఎలిమినేష‌న్ లేక‌పోవ‌డంతో హౌస్‌లో ఎనర్జీ లెవెన్స్ పెరిగాయి. ఇక తాజాగా జ‌రిగిన ఎపిసోడ్‌లో ర్యాప్ సింగర్ రోల్ రైడా ‘పరపరపర ప్పప్పరా అంటూ ర్యాప్‌తో బిగ్ బాస్ హౌస్‌ను ఊపేశాడు. హౌస్‌లో ఉన్న ఒక్కో కంటెస్టెంట్స్ గురించి ర్యాప్ చేస్తూ పాడిన పాట ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. రోల్ రైడా పాట పాడుతుంటే మిగిలిన కంటెస్టెంట్స్ కోరస్ అందిస్తూ దరువేస్తూ బాగా ఎంజాయ్ చేశారు. చివర్లో అందరి గురించి రోల్ రైడా పాడితే రోల్ రైడా కోసం కౌశల్ పాడి ఫినిషింగ్ టచ్ ఇచ్చారు ‘పరపరపర ప్పప్పరా’.. ర్యాప్ సాంగ్‌లో.

Image result for kaushal manda
నేటి ఎపిసోడ్‌లో కంటెస్టెంట్ బిగ్ బాస్ టైటిల్ గెలుపుదశలో ఎవరి స్థానాలు ఏంటి? అసలు వారి గురించి ఏమనుకుంటున్నారు? ఇప్పటి వరకూ జరిగిన ఎపిసోడ్‌లో ఆధారంగా మీకు మీరుగా ఇచ్చుకున్న స్థానం ఎంత? ఫైనల్‌లో నిలవాలంటే మీలో ఎలాంటి మార్పు కోరుకుంటున్నారు? ఎందుకు ఆ నంబర్‌ను ఎంచుకున్నారో తెలుపుతూ.. ఆ స్థానం ఉన్న బోర్డ్ ఎదురుగా ఉండాలని బిగ్ బాస్ ‘ర్యాంక్ బోర్డ్’ టాస్క్ ఇచ్చారు.

Image result for deepthi nallamothu

ఇలా 12 మంది కంటెస్టెంట్స్‌కి 12 నంబర్స్ ఉన్న బోర్డ్‌లు ఇవ్వగా.. పోటీపడి నంబర్లను ఎంచుకున్నారు కంటెస్టెంట్స్. ఈ ‘ర్యాంక్ బోర్డ్’ ఎంపికలో తనీష్ నంబర్ వన్ స్థానం నాదే అంటే నెం.1 బోర్డ్ ముందుగా నిలబడ్డారు. రోల్ రైడా నెంబర్ 2 స్థానంలో నిలబడ్డారు. ఇక మిగిలిన 3 స్థానం కోసం కౌశల్, దీప్తిలు పోటీ పడ్డారు. చివరి వరకూ ఇద్దరూ 3 స్థానం ఎంపికలో వెనక్కి తగ్గలేదు. ఇద్దరూ 3వ స్థానంలోనే నిలబడ్డారు.

ఇలా ర్యాంక్ బోర్డ్ టాస్క్ ఇచ్చింది సరదాగా కాదని.. మీరు ఎంచుకున్న నంబర్ల ఆధారంగానే ఈ వారం ఎలిమినేషన్ ఉంటుందని చివర్లో బాంబ్ పేల్చారు బిగ్ బాస్. ఇక కంటెస్టెంట్స్ ఎంచుకున్న స్థానాల ఆధారంగా తొలి 6 స్థానాలకు ఎంచుకున్నవాళ్లు ఈ వారం ఎలిమినేషన్‌లో ఉండరని.. 7 నుండి 12 వరకూ స్థానాలను ఎంచుకున్న వాళ్లు ఈ వారం ఎలిమినేషన్‌లో ఉంటారన్నారు. అయితే 11 వ స్థానంలో ఉన్న గీతా మాధురి ఈ వారం కెప్టెన్‌గా ఉండటం వల్ల, 12వ స్థానాన్ని ఎంచుకున్న పూజా రామచంద్రన్ ఈ వారమే బిగ్ బాస్ హౌస్‌కి రావడం వల్ల మినహాయింపు ఇచ్చారు. అయితే 3 వ స్థానం కోసం పోటీపడిన కౌశల్, దీప్తిలు ఇద్దరూ 3వ స్థానంలోనే ఉండటం వల్ల కౌశల్, దీప్తి నల్లమోతులను ఎలిమినేషన్‌కి నామినేట్ చేశారు బిగ్ బాస్. దీంతో ఈ వారం ఎలిమేషన్‌లో కౌశల్, దీప్తిలతో పాటు బాబు గోగినేని, గణేష్, నందినిలు వచ్చి చేరారు. దీంతో ఈ ఐదుగురిలో ఒకరు, లేదా ఇద్దరు బిగ్ బాస్ హౌస్‌ను వ‌దిలివెళ‌తారు అని తెలుస్తోంది. మ‌రి చూడాలి ఎటువంటి స్ట్రాట‌జీలు ఈ వారం హౌస్ లోచూపిస్తారో ఈ కంటెస్టెంట్స్.

కాపు రిజ‌ర్వేష‌న్ల పై టీడీపీ ఎంపీ పోరాటం