కలలో శివుడు కనిపించాడని ఈ కానిస్టేబుల్ ఏం చేసాడో తెలిస్తే మీరు షాకవ్వడం పక్కా.

778

ప్రతి ఒక్కరు ఏదో ఒక ఉద్యోగం చేస్తూ ఉంటారు.ఉద్యోగం అంటే అప్పుడప్పుడు లీవ్స్ కూడా తీసుకుంటారు.లీవ్ లెటర్ పెట్టడం సర్వ సాధారణం. ఆ లెటర్‌లో సెలవుకు కారణం ఏంటో కూడా ప్రస్తావించడం కూడా మామూలే.అయితే సాధారణంగా కారణం ఏమని రాస్తారు.ఒంట్లో బాగాలేదని లేదా ఏదైనా ఫంక్షన్ ఉంది అని రాస్తారు.ప్రతి లీవ్ లెటర్ లో ఇవే కారణాలు ఉంటాయి.కాని ఓ కానిస్టేబుల్ సెలవు కోరుతూ రాసిన లేఖమాత్రం హాట్‌టాపిక్‌ అయ్యింది. సెలవు కోసం కానిస్టేబుల్ ప్రస్తావించిన కారణం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో అతడు రాసిన లీవ్ లెటర్ వైరల్‌గా మారింది.అంతలా వైరల్ అవ్వడానికి అతను రాసిన కారణం ఏమిటో చూద్దామా.

Image result for police india

ఉత్తరప్రదేశ్‌లో బులంద్‌షహర్‌ పీఎస్‌లో కానిస్టేబుల్ పని చేస్తున్నాడువినోద్ కుమార్ అనే వ్యక్తి.ఇతను చాలా సిన్సియర్.సెలవు పట్టలన్నా కూడా అతను చాలా ఆలోచిస్తాడని తోటి పోలీసులు చెప్తున్నారు.అయితే ఇతను ఉన్నట్టుండి ఈ నెల 5న సెలవు కోసం దరఖాస్తు చేసుకున్నాడు.అది కూడా ఒకరోజు రెండు రోజులు కాదు ఏకంగా 6 రోజులు లీవ్ కావాలని పెట్టాడు.అయితే ఇన్ని రోజులు ఎప్పుడు లీవ్ అడగలేదు అని ఉన్నతాధికారులు కూడా లీవ్ మంజూర్ చేశాడు.అయితే ఉన్నతిదికారులు పని ఏమిటి లీవ్ ఎందుకు అడిగాడో తెలుసుకోవాలని లీవ్ కవర్ ను ఓపెన్ చేసి చూస్తారు కదా.ఆ పోలిస్ ఉన్నతాధికారి కూడా అలాగే ఈ కానిస్టేబుల్ లీవ్ కవర్ ఓపెన్ చేసి చూశాడు.

Related image

అందులో లీవ్ ఎందుకు కావాలో అని అతను రాసిన కారణం చూసి ఆ పొలిసు ఉన్నతాదికారి ఒక్కసారిగా షాక్ అయ్యాడు.ఇంతకు కారణం ఏముందో తెలుసా..నాకు శివుడు కలలో కనిపించాడు. నీటితో నిండిన కమండలం ఆకారంలో దర్శనిమిచ్చాడు. దాని చుట్టూ సర్పాలు తిరగడాన్ని కూడా గమనించాను. దేవుడు తనకు జలాభిషేకం చేయడానికి హరిద్వార్ రమ్మన్నాడు. భగవంతుడి కోరిక నెరవేర్చేందుకు ఆరు రోజులు సెలవు కావాలని లేఖలో ప్రస్తావించాడు.ఇది చూసి ఆ పోలిస్ ఉన్నతాదికారి ఒక్కసారిగా షాక్ అయ్యాడు.ఎవరి నమ్మకాలు వారివి కాదనడం ఎందుకని వెంటనే లీవ్ లెటర్ మీద సైన్ పెట్టేశారు బాస్.లీవ్ కోరిన వైనం, కారణం కాస్త వింతగా వుండేసరికి ఆ లెటర్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఉన్నతాధికారులు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

వినోద్ కుమార్ రాసిన ఈ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దేవుడు కలలో కనపడటం జలాభిషేకం చేయమని అడగాడని చెప్పడం అధికారులు సెలవులు మంజూరు చేయడం హాట్‌టాపిక్ అయ్యింది.విన్నారుగా లీవ్ కోసం ఈ కానిస్టేబుల్ ఎలాంటి కారణం రాశాడో.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.శివుడు కలలో కనిపించి చెప్పడన్నా అతని కారణం నమ్మలనిపిస్తుందా..ఈ లీవ్ లెటర్ గురించి అలాగే అందులో అతను రాసిన రీజన్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.