స్టార్ హీరోయిన్ పై రూ.10వేల కోట్ల పరువునష్టం వేసిన మోడీ.!

416

ప్రముఖ కన్నడ సినీ నటి, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చీఫ్ దివ్య స్పందన గురించి అందరికీ తెలిసిందే..! రమ్యగా ఈమె పలు హిట్ సినిమాల్లో నటించింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి భారత ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఉంది. అయితే ఈమెపై రాజద్రోహం కేసు నమోదైంది. ఆమె ప్రధాని నరేంద్రమోడీపై చేసిన ఓ ట్విట్ వివాదాస్పదంగా మారింది. మోదీ తనను పోలిన మరో రూపంపై చోర్‌ అని రాసుకుంటున్నట్టు ఉన్న ఓ మార్ఫింగ్‌ ఫొటోను సోమవారం రోజున రమ్య ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.అయితే ఇప్పుడు ఇదే పెద్ద దుమారం అయ్యింది.అసలేమైంది.ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రమ్య కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా చీఫ్‌ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పుడు రమ్యపై దేశద్రోహం కేసు నమోదైంది.లక్నోలోని గోమ్తినగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సెక్షన్ 124-ఏ (రాజద్రోహం), సెక్షన్ 67 కింద ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అలా చేయడానికి ముఖ్య కారణం ప్రధాని మోదీని ఉద్దేశించి ‘దొంగ’ అని ట్వీట్ చేసినందుకే..!దీనితోపాటు రమ్య మీద రూ.10,000 కోట్లు పరువు నష్టం దావా వేసేందుకూ ప్రయత్నాలు జరుగుతున్నాయి.దివ్యపై సయ్యద్ రిజ్వాన్ అనే న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రధానిని తీవ్రంగా అవమానించినందుకే పోలీసులకు ఫిర్యాదు చేశానని రిజ్వాన్ తెలిపారు. ఈ కేసుపై దివ్య స్పందిస్తూ… ‘నిజమా.. చాలా మంచిది’ అంటూ ట్వీట్ చేశారు.గత కొద్దీ రోజులుగా రాఫెల్ యుద్ధ విమానాల కుంభకోణం జరిగిందంటూ కాంగ్రెస్ నేతలు, విపక్షాలు బీజేపీపై ఎదురుదాడికి దిగాయి.

రాహుల్‌గాంధీ మాట్లాడుతూ ‘ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు మేము బయటపెట్టిన అంశాలు ఆరంభం మాత్రమే. త్వరలో మొత్తం గుట్టు రట్టు చేస్తాం. దీంతోపాటు ఆర్థిక నేరగాడు మాల్యా దేశం విడిచి పారిపోవడం వెనకున్న అసలు కథను వెల్లడిస్తాం’ అంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు.దీనిపై లక్నోకు చెందిన న్యాయవాది సయీద్‌ రిజ్వాన్‌ అహ్మద్‌ గోమతినగర్‌ పోలీసులను ఆశ్రయించారు. ‘దేశ ప్రధాని ఖ్యాతిని దిగజార్చేలా రమ్య ట్వీట్‌ చేశారు. ప్రధాని పట్ల వారికి గల ద్వేషాన్ని ఇది తెలియజేస్తుంది. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ఓ నాయకుడిని, దేశ ప్రధానిని అంతర్జాతీయంగా చులకన చేసే విధంగా ట్వీట్‌ చేశార’ని రిజ్వాన్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.చూడాలి మరి ఈ కేసు ఎక్కడికి వెళ్తుందో.