అక్కడి వారు కండోమ్స్‌ను శృంగారానికి మాత్రమే కాకుండా ఇంకా చాలా రకరకాలుగా వాడుతారు.. గుండెను పిండేసే విషయం

390

గర్భాన్ని నిరోధించే వాటిలో అందరికి తెలిసిన మరియు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలిసినది కండోమ్. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 100 కన్నా ఎక్కువ కండోమ్’లను తయారుచేసే బ్రాండులు అందుబాటులో ఉన్నాయి. సంభోగంలో కండోమ్ వాడకం తప్పనిసరి మరియు తృప్తిని కలిగించే, సురక్షిత పధ్ధతి అని చెప్పవచ్చు.లైంగిక సంబంధిత వ్యాధులు వ్యాపించకుండా మరియు గర్భధారణను నిరోధించుటలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.అయితే కండోమ్ ను కేవలం శృంగారానికి కాకుండా ఇంకా అనేక విధాలుగా ఉపయోగించవచ్చని అంటున్నారు ఒక దేశం వాళ్ళు.మరి వారు కండోమ్ ను ఎన్ని రకాలుగా ఉపయోగిస్తున్నారా చూద్దామా.

Image result for condams

సాదారణంగా కండోమ్స్‌ అనగానే అందరికి శృంగారమే గుర్తుకు వస్తుంది. మనకు తెలిసినంత వరకు కండోమ్స్‌ కేవలం శృంగారంకు మాత్రమే ఉపయోగిస్తారు. నిజానికి మీరు అనుకునేది కూడా నిజమే. కాని క్యూబా దేశంలో మాత్రం కండోమ్స్‌ ఇంకా రక రకాల అవసరాలకు వాడుతారు. కండోమ్స్‌ క్యూబా దేశస్తుల రెగ్యులర్‌ జీవితంలో ఒక పార్ట్‌ అయ్యింది. చేతిలో కండోమ్‌తో కనిపిస్తే ఇక్కడ అవతలి వాడు పెద్ద నీతులన్నీ చెబుతూ ఉంటాడు. కాని క్యూబాలో మాత్రం కండోమ్స్‌ను నెత్తిన కూడా పెట్టుకుని తిరుగుతూ ఉంటారు.అమెరికాకు శత్రుదేశం క్యూబా. ప్రపంచంలోనే బద్ద శత్రు దేశాలుగా పేరు తెచ్చుకున్న అమెరికా, చైనా దేశాల మద్య క్యూబా దేశం నలిగి పోతుంది. చైనా మిత్ర దేశంగా క్యూబా కొనసాగుతుంది. ఆ కారణంగా క్యూబాకు అమెరికా రెగ్యులర్‌ అవసరాల వస్తువులు అయిన హెయిర్‌ బ్యాండ్స్‌, బెలూన్లు, బాటిల్స్‌కు మూతలుగా పెట్టడం, ఇంటో ఏదైనా పదార్థాలు స్టోరేజ్‌ చేయడంతో పాటు ఇంకా ఇతర కారణాలకు కూడా కండోమ్స్‌ను వాడుతూ ఉంటారు.

క్యూబాలో కండోమ్స్‌ను ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు. అమెరికా నుండి దిగుమతి అవ్వని హెయిర్‌ బ్యాండ్స్‌ ఇంకా పలు ఇతర వస్తువుల స్థానంలో అక్కడి వారు కండోమ్స్‌ను వాడుతూ ఉంటారు. కండోమ్స్‌ను వైన్‌ను పులియబెట్టడానికి ఎక్కువగా వాడుతూ ఉన్నారు. వైన్‌ బాటిల్స్‌ ఎక్కువగా ఖరీదైనవి మరియు వాటిని అమెరికా నుండి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే వైన్‌ ను కూడా కండోమ్‌లలోనే వారు పులియబెడతారు. క్యూబా బాసులు ఎదురు బొంగులకు కండోమ్స్‌ కట్టి, వాటితోనే చేపలను కూడా వేటాడుతూ ఉంటారు. ఇలా ఎన్నో, ఎన్నేన్నో రకాలుగా కండోమ్స్‌ను వాడుతూనే ఉంటారు. కండోమ్‌లో వైన్‌ను పులియబెట్టడం వల్ల ఆల్కహాల్‌ పర్సంటేజ్‌ పెరగడంతో పాటు, ఎక్కువగా రుచిగా కూడా ఉంటుందని అక్కడి వారు అంటున్నారు. క్యూబా వాసులు కండోమ్స్‌ను తమ రెగ్యులర్‌ అవసరాలకు వాడుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు.చూశారుగా కండోమ్ ను ఈ దేశం వాళ్ళు ఎలాంటి ఎలాంటి పనులకు ఉపయోగిస్తున్నారో.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.కండోమ్ గురించి దాని ఉపయోగం గురించి అలాగే క్యూబా వాళ్ళు కండోమ్ ను వినియోగిస్తున్న విధానం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.