వీళ్ళ ముగ్గురిలో ఉన్న కామన్ పాయింట్ ఏంటో తెలుసా..తెలిస్తే షాక్ అవుతారు

305

పవన్ కళ్యాణ్,విజయ్ దేవరకొండ,కౌశల్… ఈ ముగ్గురికి ఒకరికి ఒకరికి సంబంధం లేదు.ముగ్గురు ఉన్నదీ సినిమా రంగంలోనే అయినా ఏ ఇద్దరి మధ్య సంబంధం లేదు.కానీ ఇప్పుడు ఈ ముగ్గురిని కనెక్ట్ చేసే ఒక పాయింట్ ఇప్పుడు జనాలను ఆకట్టుకుంటుంది.ఇంతకు ఆ పాయింట్ ఏమిటి..ఆ విషయం గురించి తెలుసుకుందాం.

పవన్ కళ్యాణ్.. ఈ పేరుకి ఒక బ్రాండ్ ఉంది. ఆయనొక సైగ చేస్తే చాలు రాష్ట్రం మొత్తం సెగలు పుట్టించేస్తారు ఆయన అభిమానులు. టాలీవుడ్ లో ఏ హీరోకి లేనంత ఫ్యాన్ ఫాలోయింగ్ పవన్ కుంది.అసలు పవన్ పేరు చెబితే పూనకం వచ్చేస్తది ఫ్యాన్స్ కి. ఏ హీరోకైనా అభిమానులు మాత్రమే ఉంటారు, పవన్ కి మాత్రం భక్తులు ఉంటారు. పవన్ ని తమ దేవుడిగా భావిస్తారు. సినిమాల్లో పవన్ పేరు వాడితే, సినిమా హిట్ అవుతుందనే సెంటిమెంట్ ని ఫాలో అయ్యేవారంటే అర్ధం చేసుకోవచ్చు పవన్ క్రేజ్ ఏ పాటిదో. “కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు” అని పవన్ కటౌట్ ని పెట్టుకుని ఎంతో మంది ఎదిగారు.ఈ క్రేజ్, ఫాలోయింగ్ కేవలం ఆయన నటనని చూసి ఏర్పడినవి కావు, నిజ జీవితంలో నటించకుండా జీవిస్తారు, నిరాడంబరంగా జీవిస్తారు అనే ఒకే ఒక్క కారణంతో ఏర్పడ్డవి. అలాంటి పవన్ సినిమాలకి బ్రేక్ ఇచ్చి జనం కోసం రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. ఇక పవన్ ని సినిమాల్లో చూడలేమా ? కనీసం పవన్ లా అలరించే హీరో ఇండస్ట్రీలో లేరా అనుకుంటున్న సమయంలో విజయ్ దేవరకొండ వచ్చారు.

పవన్ కళ్యాణ్ తర్వాత ఆ స్థాయిలో యూత్ లో పిచ్చ క్రేజ్ ఉన్న హీరో ఎవరూ అంటే విజయ్ దేవరకొండే. పిల్లల నుంచి పెద్దల వరకూ అన్ని వయసుల వారు విజయ్ ని విపరీతంగా లైక్ చేస్తారు. అలాంటి విజయ్ కి, పవన్ కి కొన్ని పోలికలు ఉన్నాయి. పవన్ లా క్రేజ్, పవన్ లోని సేవా గుణం, పవన్ లా తడబడకుండా మాట్లాడేతత్వం, ధైర్యం ఇవన్నీ విజయ్ లో ఉన్నాయి. సినిమాల పరంగా విజయ్ ని ఇష్టపడతారు, అంతకంటే ఎక్కువగా తన యాటిట్యూడ్ కారణంగా ఇష్టపడతారు. అందుకే ఆ రేంజ్ క్రేజ్ వచ్చింది. పవన్ సినిమా అంటే ఎలా ఎగబడి వెళ్తారో, అలానే విజయ్ సినిమా అంటే కుడా ఈమధ్య జనాలు ఎగబడుతున్నారు.ఇక సేవా గుణంలో విజయ్ ది కూడా వెన్నలాంటి మనసు.

కష్టం వచ్చిందంటే చాలు కరిగిపోతారు. మొన్నా మధ్య కేరళలో వరదలు వస్తే తన వంతు సాయంగా 5 లక్షలు విరాళం ఇచ్చారు. ఇక స్టేజ్ ఎక్కినా, పబ్లిక్ లోకి వచ్చినా తన మాటలతో బాగా ఆకట్టుకుంటారు. విజయ్ మాటలకి పిచ్చెక్కిపోతారు జనం. పవన్ లానే విజయ్ స్పీచ్ కూడా పవర్ ఫుల్ గానే ఉంటుంది. ఇక ధైర్యం విషయంలో పవన్ ది, విజయ్ ది ఒకటే తీరు. ఏ విషయాన్ని ఐనా ఉన్నది ఉన్నట్టు ఎలాంటి బెరుకూ లేకుండా ఎక్స్ ఫ్రెష్ చేయగలరు. ఈ కారణంగానే విజయ్ ని జూనియర్ పవన్ కళ్యాణ్ అంటున్నారు.

ఇక విజయ్ తర్వాత, ఆ స్థాయిలో పవన్ లా మెప్పించగల వ్యక్తి కౌశల్. ఈ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్లందరి నోళ్లలో నానుతున్న పేరు.జీరో నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు రియల్ హీరోగా ఎదిగారు. సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ, సీరియల్స్ లో విలన్ రోల్స్ చేస్తూ కష్టపడి పైకొచ్చిన కౌశల్, బిగ్ బాస్ షోలో అడుగుపెట్టి తన వ్యక్తిత్వంతో రియల్ హీరో అనిపించుకున్నారు. అలాంటి కౌశల్, పవన్ లా వ్యక్తిగత అభిమానులని సంపాదించుకున్నారు. దీనికి కారణం కౌశల్ లో ఉన్న సహనం, ధైర్యం, సాయం చేసే గుణం. పవన్ ని రాజకీయంగా దెబ్బ తీయాలని చూస్తే సహనంతో ఎదుర్కున్నారు. అలానే కౌశల్ కూడా తనని బిగ్ బాస్ షోలో టార్గెట్ చేస్తే సహనంగా ఉంటూ వచ్చారు. చివరికి అభిమానుల అండతో టైటిల్ గెలిచారు.అలాగే సేవాగుణంలో కూడా పోలిక ఉంది.బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు వినాయక చవితికి వచ్చిన పిల్లలలో ఇద్దరిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళు పైకి వచ్చెనంతవరకు నా వంతుగా సహాయం చేస్తా అన్నాడు.అలాగే బిగ్ బాస్ ప్రైజ్ మనీని క్యాన్సర్ భాదితుల కోసం ఇచ్చాడు.ఇలా ఈ ముగ్గురిలో ఉన్న ఒక క్వాలిటీ ఇప్పుడు ఇంతమంది అభిమానులను సంపాదించుకునేలా చేస్తుంది.