ట్రైన్ ముందు డ్యాన్స్ చేశాడు చివ‌ర‌కు కోర్టు ఎంత దారుణ‌మైన శిక్ష విధించిందో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు

518

యువ‌త స‌ర‌దాలు వారిని నిలువునా ముంచుతున్నాయి.. ఫీట్లు చేయ‌కండి అని చెప్పినా అవే చేస్తూ వారి ప్రాణాల మీద‌కు తెచ్చుకుంటున్నారు.. ఇలా ఫీట్లు చేసే వారిని ఎక్క‌డా ఉపేక్షించేది లేదు అని పోలీసులు కూడా చెబుతున్నారు. ఇక ఇటీవ‌ల కాలేజీ యువ‌త ముఖ్యంగా ముంబైలో రైలులో ప్ర‌యాణీస్తూ పుట్ బోర్డుపై నిల‌బ‌డి క‌దులుతున్న రైలులో విన్యాశాలు చేస్తున్నారు.. మొత్తానికి ఆర్పీఎఫ్ పోలీసులు సీసీ కెమెరాల ద్వారా ఈ గ్యాంగ్ ను ప‌ట్టుకుని జైలుకి పంపారు అయితే ఇప్పుడు దీని కంటే ప్ర‌మాద‌క‌ర‌మైన ఛాలెంజ్ కొంద‌రు స్టూడెంట్ చేస్తున్నారు… అదే కిక్ ఛాలెంజ్… తాజాగా ఓ యువ‌కుడికి ఈ ఛాలెంజ్ ఇచ్చిన గిఫ్ట్ ఏమిటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Related image

కికి ఛాలెంజ్.. ఈ మధ్య ఎక్కడ విన్నా ఇదే పేరు. కారులో నుంచి కిందకు దిగి రోడ్డుపై డ్యాన్స్ చేస్తూ విన్యాసాలు చేసేశారు యూత్. ఈ కికితో ప్రమాదాలు జరుగుతుండటతో.. పోలీసులు కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశారు. దీంతో ఈ కికి ఛాలెంజ్‌ దూకుడుకు కళ్లెం పడిందని అందరు అనుకున్నారు. కాని ముంబైలో కార్లకు బదులు ట్రెయిన్లలో కికి పేరుతో విన్యాసాలు చేశారు ముగ్గురు కుర్రాళ్లు. అంతటితో ఆగకుండా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇవి వైరల్‌గా మారడంతో వ్యవహారం అరెస్ట్, కోర్టు వరకు వెళ్లింది. ఈ కేసులో విచారణ జరిపిన కోర్టు.. ముగ్గురికి ఓ వెరైటీ శిక్ష వేసింది.

railway court orders kiki challenge takers to clean vasai railway station

ముంబైకి చెందిన నిషాంత్ షా, శ్యామ్ శర్మ, ధ్రువ్ షాలు కికి ఛాలెంజ్ అంటూ కదులుతున్న ట్రైయిన్‌లో విన్యాసాలు చేసి.. ఆ వీడియోను యూ ట్యూబ్‌లో పెట్టారు. ఇది వైరల్‌గా మారగా.. ఏకంగా 1.4 మిలియన్ల మంది చూశారు. ఈ వీడియో రైల్వే పోలీసుల దగ్గరకు చేరింది. ఈ ముగ్గురు కుర్రాళ్ల గురించి ఆరా తీసిన పోలీసులు మొత్తానికి అరెస్టు చేశారు. ముగ్గుర్ని రైల్వే కోర్టులో హాజరుపరిచారు. వారిని కోర్టులో విచారించగా.. అంబులెన్స్ దగ్గర కూడా కికి ఛాలెంజ్ చేసినట్లు చెప్పారట.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఈ ముగ్గురు చేసిన పనికి కోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. వారికి వెరైటీగా రెండు శిక్షలు విధించింది. మూడు రోజుల పాటూ కికి ఛాలెంజ్ పేరుతో విన్యాసాలు చేస్తే ప్రమాదాలు జరుగుతాంయటూ ప్రజలకు అవగాహన కల్పించాలని వారికి కోర్టు సూచించింది. అలాగే రైల్వే స్టేషన్‌ను శుభ్రం చేయాలని ఆదేశించింది. ముగ్గురు శిక్షలు పాటించే సమయంలో ఓ వీడియో తీసి కోర్టుకు సమర్పించాలని పోలీసులకు సూచించింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు.. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5గంటల వరకు ఈ రెండు శిక్షలు అమలు పరచాలని కోర్టు ఆదేశించింది.. మొత్తానికి మూడు నిమిషాల వీడియో ముగ్గురిని మూడురోజుల పాటు క‌ష్ట‌పెట్టింది.. చూశారుగా ఈ శిక్ష‌లు ఎలా ఉన్నా ఇలాంటి వాటి వ‌ల్ల ప్ర‌మాదం పొంచి ఉంది అందుకే ఈ కిక్ ఛాలెంజ్ కు దూరంగా ఉండండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.