కాఫీ డే అధినేత వీజీ సిద్ధార్థ చనిపోయేముందు రాసిన లేఖ చూస్తే కన్నీరు వస్తుంది

243

కాఫీ డే వ్యవస్థాపకులు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్థ మంగళూరు సమీపంలోని నేత్రావతి నదిలో లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.. ఆయన మృతదేహం లభించడంతో కుటుంబంలో విషాదం నెలకొంది, బ్రతికే ఉంటారు అని అనుకున్న వారు అందరూ ఒక్కసారిగా కుంగిపోయారు… కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరుకు కారులో వెళుతున్న వీజీ సిద్ధార్థ నేత్రావతి నది వంతెన రాగానే ఆపారు. సోమవారం రాత్రి ఆరున్నర గంటలకు నది ఒడ్డున డ్రైవరును కారు ఆపమని చెప్పి దిగి నదిలోకి వెళ్లారు. కారులో ఫోన్ లో మాట్లాడుతూ సిద్ధార్థ కారు దిగి నది వైపు వెళ్లి తిరిగి రాలేదని కారు డ్రైవరు సిద్ధార్థ కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. దక్షిణ కన్నడ పోలీసులు సిద్ధార్థ కోసం నేత్రావతి నదిలో గాలింపు చేపట్టారు. నదిలో గాలించినా సిద్ధార్థ ఆచూకీ మాత్రం లభించ లేదు. 24 గంటల తర్వాత ఆయన మృతదేహం లభించింది…కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ ఇటీవల బీజేపీలో చేరారు. సిద్ధార్థ అదృశ్యమైన నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప మంగళవారం ఉదయం ఎస్ఎం కృష్ణ ఇంటికి వచ్చి ఆయనను పరామర్శించారు.. కాని ఈవిషాదం మాత్రం వారి ఇంటిలో అలముకుంది.ఆత్మహత్యకు ముందు తన కేఫ్ కాఫీ డే బోర్డు మెంబర్స్ ని ఉద్దేశించి ఆయన ఓ లేఖ రాశారు.

Image result for వీజీ సిద్ధార్థ

37 సంవత్సరాలపాటు బలమైన నిబద్ధతతో.. హార్డ్ వర్క్ చేశాను. దాని కారణంగానే మా కంపెనీలలో, దాని అనుబంధం సంస్థలలో 30వేల మందికి ప్రత్యక్షంగా, 20వేల మందికి పరోక్షంగా ఉద్యోగాలు కల్పించాను. ఈ కంపెనీని ప్రారంభించినప్పటి నుంచి దీనికి లార్జెస్ట్ స్టాక్ హోల్డర్ గా నేనే ఉన్నాను. అయితే ఇప్పుడు ఎంత ప్రయత్నించినా… లాభాలు సాధించలేకపోతున్నాను. లాభదాయక వ్యాపారాన్ని సృష్టించడంలో విఫలమౌతున్నాను. చాలా కాలంగా దీని కోసం పోరాడుతూనే ఉన్నాను. ఇక నాకు పోరాడే ఓపిక లేదు. అందుకే అన్నీ వదిలేస్తున్నాను. ప్రైవేట్ ఈక్విటీ పార్ట్ నర్స్ షేర్లను బై బ్యాక్ చేయమని నాపై ఒత్తిడి చేస్తున్నారు. ఆ ఒత్తిడిని ఇక నేను తట్టుకోలేను. ఆదాయపన్ను మాజీ డీజీ నుంచి కూడా ఎన్నో వేధింపులకు ఎదుర్కొన్నాను. నాపై ఇప్పటి వరకు మీరు ఎంతో నమ్మకం ఉంచారు. దానిని నిలబెట్టుకోలేక పోయినందుకు క్షమించండి. కొత్త యాజమాన్యంతో మీరంతా మళ్లీ వ్యాపారాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను. ఈ తప్పులన్నింటికీ నాదే బాధ్యత. నా లావాదేవీల గురించి మా మేనేజ్ మెంట్ కీ, ఆడిటర్లకు తెలీదు. వాటిన్నింటికీ నేనే జవాబుదారిని. నేను ఎవరినీ మోసం చేయాలని అనుకోలేదు. మీరంతా ఈ విషయం అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను.ఇట్లు మీ వీజీ సిద్ధార్థ్ ఇలా ఆయనతన చివరి లేఖను రాశారు.

Image result for వీజీ సిద్ధార్థ

కేఫ్‌ కాఫీ డే ప్రమోటర్‌ వీజీ సిద్దార్థ అప్పులు కూడా బాగానే ఉన్నాయి. 2018-19 ఆర్థిక సంవత్సరానికిగాను ఆయన అప్పు రూ. 6,547 కోట్లకు పెరిగాయి. అంతక్రితం ఏడాది ఉన్న అప్పులతో పోలిస్తే 64 శాతం అధికంగా ఉంది. డిసెంబర్‌ 2018తో ముగిసిన త్రైమాసికానికిగాను కంపెనీ కన్సాలిడేటెడ్‌ రూ. 996 కోట్ల ఆదాయంపై రూ.73 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఐటీ సంస్థ మైండ్‌ట్రీలో ఉన్న 22 శాతం వాటాను విక్రయించడంతో ఆయనకు రూ.3,269 కోట్ల నగదు నిల్వలు వచ్చాయి. , 2015-16 నుంచి 2017-18 వరకు సిద్ధార్థ, ఆయన భార్య మాళవిక ఎలాంటి వేతనం తీసుకోకపోవడం ఇక్కడ విచిత్రం.

ఈ క్రింద వీడియో చూడండి

ఇంతకీ ఆయనతో చివరి వరకూ ఉన్న డ్రైవర్‌ ఏమంటున్నాడంటే

సిద్ధార్థ అదృశ్యం నేపథ్యంలో చివరిదాకా ఆయన వెంటే ఉన్న కారు డ్రైవర్‌ బసవరాజ్‌ పాటిల్‌.. ఈ కేసులో కీలకంగా మారారు. మంగళవారం ఉదయం పోలీసులతో మాట్లాడుతూ వంతెనపై కారు ఆపి సిద్ధార్థ దిగారని, ఆ తర్వాత తనను కాస్త ముందుకు వెళ్లి, వేచి ఉండమని చెప్పారని తెలిపారు. గత మూడేండ్లుగా సిద్ధార్థ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు చెప్పిన పాటిల్‌.. సోమవారం ఉదయం 8 గంటలకు బెంగళూరులోని సిద్ధార్థ నివాసానికి వెళ్లానని, అక్కడి నుంచి విఠల్‌ మాల్యా కార్యాలయానికి వెళ్లి.. 11 గంటలకల్లా తిరిగి ఇంటికి వచ్చామని వివరించారు. మధ్యా హ్నం 12:30 గంటలకు సక్లేశ్‌పూర్‌కు వెళ్దామని చెప్పడంతో ఇన్నోవాలో బయలుదేరామని, అయితే మధ్యలో మంగళూరుకు వెళ్లమని సూచించడంతో ఆ దిశగా కారును తిప్పానని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే వంతెన వద్దకు కారు చేరగానే ఆపి సిద్ధార్థ దిగారని, వంతెన చివరకు వెళ్లి ఆగితే.. నడుచుకుంటూ తాను వస్తానని చెప్పారని పాటిల్‌ పోలీసులకు వివరించారు. రాత్రి 8 గంటలు అవుతుండగా.. సిద్ధార్థకు తాను ఫోన్‌ చేశానని, అయితే స్విచాఫ్‌ అని వస్తుండటంతో వెంటనే ఆయన కుమారుడికి ఫోన్‌ చేశానని తెలిపారు. ఆయన కాల్‌ చేసినా స్విచాఫ్‌ వచ్చిందని, దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చామని చెప్పారు. అప్పుల కంటే ఆస్లులు ఎక్కువ శాతం ఉన్న సిద్దార్ద్ ఇలా ఆత్మహత్య చేసుకోవడం వెనుక పోలీసులు అనేక విషయాలను విచారణ చేస్తున్నారు.