పెద్దపల్లి: రూ.20కే చీర.. పోటెత్తిన మహిళలు

138

పండుగలకు వస్త్ర దుకాణాలు ఆఫర్లు ప్రకటించడం మామూలే. ఏదైనా ఆఫర్లు ఉన్నాయంటే మహిళలు షాపింగ్ చేయడానికి ముందుంటారు. ఇక ఆషాడం సేల్, సంక్రాంతి సేల్ ఆఫర్ల సమయంలో షాపింగ్ మాల్ లోనే ఎక్కువ సమయం వేచిస్తుంటారు. ఆఫర్లు అలా ప్రకటించారో లేదో.. మహిళలు వెంటనే షాపులకు క్యూ కడతారు. ఇక పండుగల కాకుండా ఆఫర్లు ప్రకటిస్తే ఊరుకుంటారా.. సమస్యే లేదు. ఉదయమే షాపు దగ్గరకు పరుగులు తీయరు. పెద్దపల్లిలోనూ అదే జరిగింది. రూ.20కే చీర అంటూ ఓ షాపు ప్రకటించింది. ఇంకేముంది పొద్దు, పొద్దునే షాపుకు క్యూ కట్టారు.. రోడ్లపై మహిళలంతా బారులు తీరారు.

Image result for sarees shops

మంచిర్యాల జిల్లాలోని పెద్దపల్లిలో ఉండే ఒక బట్టల దుకాణదారుడు మా షాప్ లో 20 రూపాయలకే చీర అనే ఆఫర్ ను ప్రకటించారు. షాప్ యజమాని రూ.20కే చీర అని కరపత్రాల ద్వారా ప్రచారం చేయడంతో ఈ నోటా.. ఆ నోటా వ్యాపించి.. ఆ షాప్ ముందు కిలోమీటర్ల దూరంలో క్యూలో నిల్చున్నారు. దుకాణం ముందు అర కిలోమీటరు పొడవున మహిళలు క్యూలు కట్టారు. షాపు షట్టర్ అలా తీశారో లేదో.. చీరల కోసం మహిళలు ఎగబడ్డారు. ఇక ఆ షాపు ఎప్పుడు తెరుస్తారా మంచి మంచి చీరలు దక్కించుకుందామా అని మహిళలు ఆశతో ఉన్నారు..ఒక దశలో ఆ షాపు తెరవడానికే ఇబ్బంది అయ్యే పరిస్థితి నెలకొంది. ఎలాగో అలా షాపు తలుపులు తెరిచిన తర్వాత దుకాణంలోకి వెళ్లేందుకు మహిళలు పోటీపడ్డారు. దీంతో తోపులాట చోటు చేసుకొంది.

ఈ క్రింది వీడియో చూడండి

ఒకరిని ఒకరు తోసుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. మహిళలు ఇంకా తరలివస్తుండటంతో.. వారిని అదుపు చేయడం షాపు నిర్వాహకులకు తలకు మించిన భారం అయ్యింది. దీంతో సిబ్బంది చేతులెత్తేసి.. షాపును మూసేశారు. షాపును మూసేయడంతో మహిళలు తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. రద్దీ తగ్గిన తర్వాత షాపు తీయకపోరా అనుకున్నారో ఏమో.. కొందరు మహిళలు మాత్రం అక్కడే కూర్చొన్నారట. ఈ ఘటనలో పలువురు మహిళలకు స్వల్పంగా గాయపడ్డారు. అంతే మరి మహిళలకు ఇష్టమైన చీరలూ..అందునా అంత తక్కువ ధర ఎవరు మాత్రం వదులుకుంటారు. ఇలా తక్కువ ధరకే చీర ఇస్తామనే పేరుతో ఆఫర్ ప్రకటించి మహిళలు రావడంతో చేతులెత్తేసిన ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో గతంలోనూ చాలానే జరిగాయి. సిద్దిపేటలోని సీఎంఆర్ షాపింగ్‌ మాల్‌లో 10 రూపాయలకే చీర అంటూ ఆఫర్‌ ప్రకటించడంతో పెద్ద ఎత్తున మహిళలు బారులు తీరారు. దీంతో ఒక్క సారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 20 మంది మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. మరి ఈ 20 రూపాయలకే చీర ఆఫర్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.