ఖమ్మం స్కూల్ హాస్టల్‌లో దారుణం:సైకిల్ కోసం గొడవపడ్డ ఇద్దరు విద్యార్దులు చివరకి ఎంత ఘోరం జరిగిందో తెలిస్తే షాక్

293

పిల్లలు అన్నాకా ఏదో ఒక గొడవ వస్తూనే ఉంటుంది వాళ్ళ మధ్యలో.స్కూల్ లో అయితే పెన్సిల్ కోసమని పెన్ను కోసమని..ఇలా చిన్న చిన్న విషయాలకు గొడవపడేవాళ్లు చాలా మంది ఉన్నారు. అయితే ఆ గొడవలను చూసే పెద్దవాళ్ళు కానీ టీచర్స్ కానీ పెద్దగా పట్టించుకోకుండా మళ్ళి వాళ్ళే కలుస్తారులే అని అనుకుంటారు.ఐతే ఇకపై ఆలా అనుకోకండి.ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు స్కూల్ స్టూడెంట్స్ మధ్యలో ఏం జరిగిందో తెలిస్తే ఇకపై మీరు పిల్లల గొడవ విషయంలో జాగ్రత్తగా ఉంటారని ఈ విషయం చెప్తున్నాను.మరి ఏమైందో పూర్తీగా తెలుసుకుందామా.

అది ఖమ్మంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల హాస్టల్‌.అక్కడ ఎంతో మంది బీద విద్యార్థులు ఉంటున్నారు.అందులో జోసెఫ్ అనే స్టూడెంట్ 4 వ తరగతి చదువుతున్నాడు.అయితే పదో తరగతికి చెందిన ఓ విద్యార్థి, మరి కొంత మంది బాలురు మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో భోజనం చేశారు. అనంతరం జోసెఫ్ పదో తరగతి విద్యార్థి(15)కి చెందిన సైకిల్ తీసుకొని పాఠశాల ప్రాంగణంలో రెండు రౌండ్లు వేసి వచ్చాడు.తాను చెప్పిన కూడా ఖాతరు చేయకుండా జోసెఫ్ తన సైకిల్ తీసుకెళ్లాడని పదో తరగతి విద్యార్థి ఆగ్రహానికి గురయ్యాడు. జోసెఫ్ వచ్చీ రాగానే అతడిపై దాడికి దిగాడు. తన టవల్‌తో జోసెఫ్ మెడ చుట్టూ బిగించి ఊపిరాడకుండా చేశాడు. అనంతరం అతడి తలను ట్రంకు పెట్టెకేసి బలంగా బాదాడు. దీంతో జోసెఫ్ అక్కడికక్కడే మరణించాడు.జోసెఫ్ తన గదిలో ట్రంక్ బాక్స్ ముందు విగత జీవిగా పడి ఉండటాన్ని వార్డెన్ ప్రతాప్ సింగ్ 4 గంటల సమయంలో గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు జోసెఫ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.ఇతర విద్యార్థులను విచారించి ప్రాథమిక వివరాలు సేకరించారు.

పదో తరగతి విద్యార్థితో ఘర్షణ కారణంగానే జోసెఫ్ మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పాఠశాలలో అమర్చిన సీసీటీవీ కెమెరాల దృశ్యాలను పరిశీలించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.జోసెఫ్ తన వస్తువులు ఉంచిన ట్రంక్ పెట్టెపై అమ్మ అని రాసుకోవడం చూసి పలువురు కంటతడి పెట్టారు. దసరా సెలవుల నిమిత్తం ఇంటికి వెళ్లిన జోసెఫ్ మంగళవారం ఉదయమే తిరిగి పాఠశాల హాస్టల్‌కు వచ్చాడు. అతడి తలను ట్రంకు బాక్సుకేసి బాదడంతో రక్తస్రావమై గదంతా భయానకంగా మారింది. జోసెఫ్ బంధువులు, విద్యార్థి సంఘం నేతలు పాఠశాల ముందు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఘటనపై విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే జోసెఫ్ మరణించాడని వారు ఆరోపించారు. పాఠశాల ప్రిన్సిపాల్, హాస్టల్ వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పాఠశాల వద్ద ఉద్రిక్త వాతావరణం ఉండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.చూశారుగా చిన్న దానికి గొడవ పడి చివరికి ఎంత పని చేశాడో.