సీఐ కాదు..కామాందుడు

669

పోలీస్ అంటే ఒక రెస్పాన్సిబిలిటీ.ఆ ఉద్యోగానికి ఒక బాధ్యత ఉంటుంది.పోలీస్ చూస్తే చాలు భయపడేవాళ్లు చాలా మంది ఉన్నారు.ఎందుకంటే వాళ్లలో మంచివాళ్ళు ఉన్నా కొందరు దుర్మార్గులు కూడా ఉంటారు.సమాజంలో జరిగే దారుణాలను అరికట్టాల్సిన భాద్యత వాళ్ళ మీద ఉంటుంది.కానీ వాళ్లే దుర్మార్గాలకు పాల్పడితే ఏం చెయ్యాలి చెప్పండి. సమస్యను పరిష్కరించాల్సింది పోయి బాధితుల పాలిట సమస్యగా మారుతున్నారు. ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ అని చెప్పుకు తిరిగే ఖాకీల్లో కొందరు కామాంధులుగా మారుతున్నారు. ఇప్పుడు ఒక నీచ పోలీస్ అదే పనికి పాల్పడ్డాడు. న్యాయం కోసం పోలీసుస్టేషన్‌కు వస్తే దానిని అవకాశంగా మార్చుకుంటున్నాడు. మరి ఆ పోలీస్ చేసిన ఘనకార్యం ఏమిటో తెలుసుకుందామా.

Image result for police

విశాఖపట్నంలోని ఓ హోటల్లో పనిచేసే వారణాసికి చెందిన యువకుడు, మలేషియాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న యువతి సోషల్ మీడియాలో ప్రేమించుకున్నారు.ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకునే ప్రేమించుకున్నారు. అమ్మాయి అబ్బాయిని గాఢంగా ప్రేమించింది. అబ్బాయి మాత్రం ప్రేమిస్తున్నా అని కహానీలు చెప్పాడు అంతే. ప్రియుడి కోసం మలేషియా నుంచి విశాఖపట్నం వచ్చి, ప్రియుడు పనిచేసే హోటల్లోనే ఉద్యోగంలో చేరింది. అయితే, ఇరువురి మధ్య మనస్పర్ధలు రావడంతో ప్రియుడు ఉద్యోగం వదిలేసి విశాఖపట్నం నుండి వెళ్ళిపోయాడు. కొద్ది రోజుల ఎదురుచూసిన యువతి ప్రియుడి ఆచూకీ కోసం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసును విచారించిన పోలీసులు పంజాబ్లో ఉన్న అతన్ని గుర్తించి, విశాఖకు తీసుకొచ్చి జైలుకు తరలించారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అయితే, ప్రియుడిని జైలుకు పంపితే తర్వాత తనను వివాహం చేసుకోడని ఆందోళన పడిన యువతి జైలుకు పంపవద్దని సీఐను కోరింది. దాన్ని అవకాశంగా తీసుకున్న సీఐ యువతిపై లైంగిక వేధిపులు మొదలుపెట్టాడు. ఈ నేపధ్యంలో డిసెంబర్ 28న నేరుగా యువతి ఉంటున్న హోటల్ గదికే వెళ్ళి లైంగిక దాడికి దిగారు. దాంతో యువతి సీఐ ప్రవర్తనను వీడియో తీసి, నేరుగా నగర కమీషనర్‌కు ఫిర్యాదు చేసింది. కమీషనర్ వెంటనే విచారణకు ఆదేశించారు. యువతి అందించిన వీడియో సాక్ష్యాల ఆధారంగా కమీషనర్ సీఐను సస్పెండ్ చేశారు.ప్రేమ విషయంలో కూడా న్యాయం చేస్తామని కమిషనర్ హామీ ఇచ్చాడు. మరి ఈ విషయం గురించి మీరేమంటారు. యువతిని లైంగికంగా వేధించిన ఈ సీఐ ఘటన గురించి అలాగే సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్నలైంగిక వేధింపుల సమస్యల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.