క్రిస్ గేల్ లైఫ్ స్టోరీ

179

క్రిస్ గేల్ త‌న‌దైన దూకుడు బ్యాటింగుతో ప్ర‌పంచం మొత్తం త‌న‌వైపు ఆక‌ర్షించుకున్నాడు గెయిల్, మైదానంలో బంతిని బౌండ‌రీలు దాటించి స్టేడియం అవ‌త‌లకు బాల్ ను కొట్టిన వ్య‌క్తిగా కూడా గేల్ కు రికార్డులు ఉన్నాయి. బంతిని ఎలా వేసినా దాని రూటుని త‌న బ్యాటుతో బాధ‌డం గేల్ స్టెయిల్, ఇన్నింగ్స్ లో గేల్ ఉన్నంత సేపు మ్యాచ్ గెలిచేది ఎవ‌రు అనేది ప్ర‌త్య‌ర్ది సులువుగా చెప్ప‌లేడు. ఒక్క ఓవ‌ర్ లో 24 ర‌న్స్ కొట్టి ఓడిపోతాము అని అనుకునే మ్యాచుల‌ను సైతం గెలిపించిన స‌త్తా ఉన్న ఆట‌గాడు గేల్, వెస్టిండీస్ లోనే కాదు ప్ర‌పంచం వ్యాప్తంగా గేల్ బ్యాటింగ్ స్ట్రైకింగ్ కు ఫిదా అయిన వారు ఎందరో ఉన్నారు.

Image result for chris gayle

ఇప్పుడు ల‌గ్జ‌రీ లైఫ్ అనుభ‌విస్తున్న గేల్ జీవితంలో కూడా ఎన్నో చీక‌టి రోజులు బాధ‌లు ప‌డిన సంద‌ర్బాలు ఉన్నాయి .మ‌రి ఈ స్టార్ బ్యాట్స్ మెన్ గురించి అత‌ని జీవితం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. క్రిస్ గేల్1979, సెప్టెంబర్ 21న జమైకా లోని కింగ్‌స్టన్లో జన్మించాడు క్రిస్టోఫర్ క్రిస్ హెన్రీ గేల్ , గేల్ వెస్ట్‌ఇండీస్ కు చెందిన క్రికెట్ క్రీడాకారుడు. ఎడమ చేతితో బ్యాటింగ్, కుడి చేతితో బౌలింగ్ చేయగల నైపుణ్యం ఇతనికి ఉంది. 2001 జూలైలో క్రిస్ గేల్స్, డారెన్ గంగాతో కలిసి జింబాబ్వేపై బులావయో మ్యాచ్‌లో తొలి వికెట్టుకు 214 పరుగుల భాగస్వామ్యం చేసి రికార్డు సృష్టించారు.

Image result for chris gayle

అయితే గేల్ చిన్న‌త‌నం నుంచి క‌ఠిక పేద‌రికం అనుభ‌వించాడు.. తిండి దొరక్క అన్నం లేక‌ దొంగ‌త‌నాలు కూడా చేశాడ‌ట‌. గేల్ ని చ‌దివించ‌లేక తండ్రి చిన్న‌త‌నంలోనే చ‌దువుమానేయ‌మన్నాడు… స్కూల్ లో కొన్ని సంవ‌త్స‌రాలు మాత్ర‌మే చ‌దివాడు, ఇక ఇంట్లో ఉండ‌టం ఎందుకు అని త‌ల్లికి సాయం చేయ‌డానికి ప‌నికి వెళ్లాడు చిన్న‌పిల్ల‌వాడు కావ‌డంతో ఎవ‌రూ ప‌ని ఇవ్వ‌లేదు.. చివ‌ర‌కు అక్క‌డ కంద‌రు పిల్ల‌ల‌తో చెత్త‌లో దొరికే ప్లాస్టిక్ వ‌స్తువులు అమ్ముకునేవాడు , ఇలా కాలం గ‌డుపుతున్న స‌మ‌యంలో అత‌నికి ఓ అవ‌కాశం వ‌చ్చింది అదే అత‌ని జీవితాన్ని ఇప్పుడు ఇలా మార్చేసింది.

ఈ క్రింది వీడియో చూడండి

లూకాస్ క్రికెట్ క్లబ్ లో గ‌ల్లీవారితో ట్ర‌య‌ల్స్ వేస్తుండ‌గా చూడ‌టానికి వెళ్లాడు గేల్.. అప్ప‌టి వ‌ర‌కూ క్రికెట్ గురించి ఏమాత్రం తెలియ‌దు. కాని వారు ఆడ‌గ‌టం చూసి బంతిని ఎలా కొట్టాలో అర్దం అయింది, ఓరోజు త‌ను ఆడాడు ఏ బంతి వేసినా అంద‌రికంటే వేగంగా దానిని బౌండ‌రీలుదాటించాడు చాలా బ‌లంగా షాట్లు కొట్ట‌డంతో అక్క‌డ ట్రైన‌ర్స్ గేల్ లో మంచి ఆట‌గాడు ఉన్నాడు అని గుర్తించారు. రెండు పూట‌లా భోజ‌నం పెడ‌తాం ప్రాక్టీసుకి రా అని ఆనాడు చెప్పారు ట్రైన‌ర్స్ వారి మాట‌లు విని మూడునెల‌లు ట్రైనింగ్ తీసుకున్నాడు ఆ త‌ర్వాత అక్క‌డ టోర్నీలు చిన్న చిన్నమ్యాచ్ లు ఆడాడు. త‌ర్వాత టోర్న‌మెంటుల నుంచి వెస్టిండీస్ టీమ్ లో చేరాడు, ఒకే కాలెండ‌ర్ ఇయ‌ర్ లో 1000 ర‌న్స్ కొట్టి వెస్టిండీస్ క్రికెట్లో చ‌రిత్ర సృస్టించాడు గేల్. ఇప్పుడు కోట్ల రూపాయ‌ల ఆస్తి సంపాదించాడు, త‌న మొత్తం ఆస్తి 15 మిలియ‌న్ డాలర్లుగా ప్ర‌క‌టించాడు గేల్. చాలా సంద‌ర్బాల‌లో లూకాసా అకాడ‌మి లేక‌పోతే ఇప్పుడు త‌న ప‌రిస్దితి ఎలా ఉండేదో అని చెబుతూ ఉంటాడు గేల్, మ‌రి చూశారుగా గేల్ చెప్పిన విష‌యాలు అతని చ‌రిత్ర ఈ వీడియోపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.