మ‌నదేశంలో ఈ ఐదు చోర్ బ‌జార్ల గురించి తెలుసా ల్యాప్ టాప్ 200 రూపాయ‌లే

494

బ్రాండెడ్ వ‌స్తువులు ఇమిటేష‌న్ వ‌స్తువుల గురించి చాలా వ‌ర‌కూ వినే ఉంటాం అయితే మ‌న‌కు తెలిసిన మహాన‌గ‌రాల్లో కొన్ని ఖ‌రీదైన వ‌స్తువులు అతి త‌క్కువ ధ‌ర‌ల‌కు అమ్ముతూ ఉంటారు అవే చోర్ బ‌జార్లు…మన భారతదేశంలో గల ప్రముఖ ప్రదేశాలలో వున్నటువంటి చోర్ బజార్ల గురించి తెలుసుకుందాం… మన ఇండియాలో ఫేమస్ చోర్ బజార్ల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. చోర్ బజార్ అంటే తెలియని వారుండరు. అయితే ఇక్కడ వాస్తవాల గురించి చాలా తక్కువ మందికి తెలుసు. తక్కువ ధరకే సామాగ్రి దొరుకుతుందనే క్రమంలో అక్కడికి వెళుతూవుంటారు. ఇక్కడ దొంగతనం చేయబడిన వస్తువులు దొరుకుతాయి. దొంగతనం అయిన ఫోన్స్, మొబైల్స్, ల్యాప్ టాప్స్,ఆటో స్పేర్ పార్ట్స్ నుంచి కార్లవరకు ఇక్కడ లభిస్తాయి.

దేశంలోని చోర్ బజార్లలో దొంగతనమైన వాహనాలను మార్పు చేసి అమ్ముతుంటారు. ఇక్కడ గల చోర్ బజార్లలో ఏవైనా వస్తువులు కొనటానికి వెళ్ళినప్పుడు వాహనాలు, బైక్లు తీసుకుని వెళ్ళకూడదు.అక్కడ వాహనం నిల్పారంటే ఇక అంతే సంగతి. మన వాహనంలో గల స్పేర్ పార్ట్స్ అక్కడ ఉన్న షాప్ లలో దర్శనమిస్తాయి. భారతదేశంలో 5 అతిపెద్ద చోర్ బజార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

!! ముంబై చోర్ బ‌జార్ !!
దక్షిణ ముంబైలోని , మటన్ స్ట్రీట్, మహమ్మద్ అలీ రోడ్ వద్ద వుంది ఈ బ‌జార్ ..ఈ మార్కెట్ సుమారు 150ఏళ్ల నుంచి ఇక్కడ వుంది.మొదట్లో దీనిని షోర్ బజార్ అని పిలిచేవారు.ముంబై చోర్ బజార్ షోర్ అంటే అవసరం.ఇక్కడ అరుస్తూ అమ్ముతుంటారు. రాను రాను ఇది చోర్ బజార్ గా మారిపోయింది. ఇక్క‌డ నిత్యం కోట్ల‌లో వ్యాపారం జ‌రుగుతుంది. ఉద‌యం 11 గంట‌ల‌కు ఇక్క‌డ మార్కెట్ మొద‌లు అవుతుంది. గ‌తంలో ఇక్క‌డ అరుస్తూ వ్యాపారం చేసేవారు. అందుకే షోర్ బ‌జారు అని అంటారు. కాని బ్రిటీష్ వారు ఇక్క‌డ అరుపులతో అమ్మ‌కాలు నిషేదం అని చెప్ప‌డంతో అరుపులు ఆపేశారు… ఇక్క‌డ బ‌ట్ట‌లు ఆటోమోబైల్స్ అతి త‌క్కువ ధ‌ర‌కు దొర‌కుతాయి.. విక్టోరియా మ‌హారాణి ఇండియా నుంచి తిరిగి వెళ్లే స‌మ‌యంలో షిప్ ద‌గ్గ‌ర ఆమె ల‌గేజీని కొంద‌రు దొంగిలించారు, చివ‌రకు ఆ ల‌గేజీ ఈ చోర్ బ‌జారులో దొరికింది దీంతో ఈ చోర్ బ‌జార్ కు మ‌రింత పేరు వచ్చింది.

!!ఢిల్లీ చోర్ బజార్!!
ఇది దేశంలోనే పురాతన చోర్ బజార్. మొదట్లో ఇక్కడ సండే మార్కెట్ ఎర్రకోట వెనక వుండేది. ప్రస్తుతం దరియాగంజ్ లోని జమా మసీద్ దగ్గర వుంది. ఇక్క‌డ ఏది కావాలి అన్నా దొరుకుతుంది దీనిని క‌బాడీ మార్కెట్ అంటారు. ఇక్క‌డ ఎవ‌రైనా బండి పార్క్ చేసి సామాన్లు కొనుక్కోవ‌డానికి వెళితే వ‌చ్చేస‌రికి హెడ్ లైట్ మిన‌హా బండికి ఏమీ మిగ‌ల‌వు అన్నీ స్పేర్ పార్ట్స్ గా తీసేసి అమ్మేస్తారు.

!!మీరట్ చోర్ బ‌జార్ !!
సూతీ గంజ్ లో ఈ చోర్ బ‌జార్ ఉంది.. ఇక్క‌డ పెద్ద పెద్ద వ్యాపారాలు న‌డుస్తాయి. ఇది స్త్రాప్ మార్కెట్ గా పేరు తెచ్చుకుంది. బ‌ళ్లు ఫోన్స్ ల్యాప్ టాప్స్ ఇక్క‌డ చీప్ గా దొరుకుతాయి.. ఉదయం 9 గంట‌ల నుంచే ఇక్క‌డ ప్రొడ‌క్ట్స్ అమ్ముతారు.. ముందు ఎవ‌రిది అయినా బండిపోతే ఇక్క‌డ చెక్ చేస్తారు.ఏ వాహ‌నాల‌కు అయినా స్పేర్ పార్ట్లు ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ చోరీ చేసిన పాతవాహనాలు, యాక్సిడెంట్ వాహనాలు ఎక్కువగా దొరుకుతాయి.

!! బెంగ‌ళూరు చోర్ బ‌జార్!!
చీక్ పేట్ ఢిల్లీ,ముంబై చోర్ బజార్లతో పోలిస్తే బెంగుళూరు తక్కువ అని చెప్పవచ్చు. ఈ మార్కెట్ బెంగుళూరులోని చీక్ పేట్ లో ఉంది. ఇక్క‌డ మార్కెట్ ఆదివారం నాడు వుంటుంది. అయ్యంగ‌రి రోడ్ లో ఉంటుంది ఈ మార్కెట్…ఇక్కడ సెకండ్ హ్యాండ్ ఫోన్లు, దొంగతనమైన కెమెరాస్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇంకా ఎన్నెన్నో సామాన్లు తక్కువ ధరలో దొరుకున్నాయి. ఈ మార్కెట్ లోకల్ మార్కెట్ మాదిరిగానే వుంటుంది.

!!సెంట్ర‌ల్ చెన్నైచోర్ బ‌జార్ !!
సెంటర్ చెన్నైలో వున్నఈ చోర్ బజార్ లో, ఆటోనగర్ లో పురాతన,దొంగతనమైన కార్లు మాడిఫై చేస్తారు…ఇక్కడ వేలసంఖ్యలో దుకాణాలు వున్నాయి.. చెన్నై ఈ దుకాణాలు వాహనాల ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ ను బదిలీచేయటానికి ఫేమస్ అని చెప్పవచ్చు.