బ్రేకింగ్ న్యూస్ : తాత కాబోతున్న మెగాస్టార్ చిరంజీవి..ఆనందంలో రామ్ చరణ్ ఫ్యామిలీ

292

మెగాస్టార్ చిరంజీవి…తెలుగు గడ్డ మీద ఈ పేరుకు ఒక చరిత్ర ఉంది.సినిమా అనే వ్యాపకం ద్వారా ఎంతోమంది తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినా చరిత్ర ఆయనది.ఆయన పేరు చెబితే చాలు పూనకంతో ఊగిపోయేవాళ్లు చాలా మంది ఉన్నారు.ఆయనను ఇన్స్పిరేషన్ గా తీసుకుని కొన్ని వందల మంది కష్టాలు పడి ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు.ఎంతో మందికి ఆయన రోల్ మోడల్.ఆయన ఇంట్లో ఏ చిన్న సంతోష సంఘటన జరిగిన అభిమానులు తమ ఇంట్లో జరిగినట్టు మురిసిపోతుంటారు.అలా మురిసిపోయే వాళ్ళ కోసమే ఇప్పుడు ఒక శుభవార్త చెప్పబోతున్నాను.మరి ఆ శుభవార్త ఏమిటో తెలుసుకుందామా.

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తాతయ్య కాబోతున్నారు. చాలా కాలంగా రామ్ చరణ్-ఉపాసనల నుండి ఈ శుభావార్త విందామని అభిమానులు ఎదురు చూస్తుంటే.. వారు మాత్రం కొంత సమయం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.ఇప్పట్లో పిల్లల్ని కనే ఆలోచనలో మెగా వారసుడు లేడు.అయితే ఇప్పుడు చిరు తాత ఎలా కాబోతున్నారంటే ఆయన రెండో కూతురు శ్రీజ ఇప్పుడు గర్భవతి. ఆ విషయాన్ని తన భర్త కళ్యాణ్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘శ్రీజ కల్యాణ్ బేబి2 #లోడింగ్’ అంటూ అతడు పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.తన మొదటి భర్తతో విడిపోయిన తరువాత కళ్యాణ్ కనుగంటి అనే వ్యక్తిని శ్రీజ రెండో వివాహం చేసుకుంది. బెంగుళూరులోని చిరంజీవి ఫామ్ హౌస్ లో వీరి వివాహం అట్టహాసంగా జరిగింది. శ్రీజకి ఇప్పటికే ఓ కుమార్తె ఉంది. ఆమె పేరు నివ్రితి.

మొదటి భర్తకి పుట్టిన కూతురైన కళ్యాణ్ ఆ పాపని కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. ఇప్పుడు ఈ జంటకి ఓ బిడ్డ పుట్టనుండడంతో మెగాఫ్యామిలీ సంబరాలు చేసుకుంటోంది.అటు కళ్యాణ్ సినిమా రంగంలో కూడా రాణించాలనుకుంటున్నాడు.హీరోగా విజేత తీసిన అనుకున్నంతగా ఆడలేదు. దాంతో ఇంకా మంచి కథ కోసం అన్వేషిస్తున్నాడు.దానికి మామ బ్లెస్సింగ్స్ ఎలాగో ఉన్నాయి కాబట్టి త్వరలో మరొక కథతో వచ్చేందుకు రెడీగా ఉన్నాడు.దానిని ఆల్ ది బెస్ట్ చెప్తూ ఇప్పుడు తండ్రి కాబోతున్నాడు అలాగే మెగాస్టార్ తాత కాబోతున్నాడు కాబట్టి వారికి కంగ్రాట్స్ చెపుదాం