4 కోట్ల మంది ప్రాణాలు తీసిన చైనా పిచ్చుకలు ఈ స్టోరీ వింటే షాక్

524

ఇటీవ‌ల రోబో 2 సినిమాలో పిచ్చుక‌ల గురించి ఓ సందేశాత్మ‌క చిత్రంగా వాటి విలువ గురించి అనేక ముఖ్య విష‌యాలు తెలియ‌చేశారు.. సిగ్న‌ల్స్ సెల్ ట‌వ‌ర్స్ వ‌ల్ల పిచ్చుక‌లు ప‌క్షుల జాతి ఎలా అంత‌రించిపోతుందో తెలియ‌చేశారు. అయితే మ‌నుషుల వ‌ల్ల పిచ్చుక‌లు చ‌నిపోవ‌డం అంటే తెలిసిందే , కాని పిచ్చుకలు 4 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయేందుకు కారణమయ్యాయంటే నమ్ముతారా.. కానీ ఇది అక్షరాలా నిజం.. చరిత్రలో నమోదైన దారుణం.. వందల కోట్ల జనాన్ని శాసించే నియంతలు అహంకారంతో, మూర్ఖత్వంతో తీసుకునే నిర్ణయాలు ఎలా విషాదాంతాలుగా మిగిలాయో ఈ చైనా పిచ్చుక కథ వివరిస్తుంది.

Related image
1949లో చైనాలో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మావో.. తన దేశాన్ని ప్రగతి దిశగా పరుగులు పెట్టించాలని భావించాడు.దేశాన్ని పారిశ్రామికంగా, వ్యవసాయపరంగా తిరుగులేకుండా చేయాలని సంకల్పించాడు. దేశభక్తి మత్తులో గుడ్డిగా కొన్ని కార్యక్రమాలు అమలు చేయడం అసలుకే మోసం తెచ్చింది. ప్రత్యేకించి ధాన్యాన్ని తింటూ నష్టం చేస్తున్నాయన్న కారణంగా పిచ్చుకలపై ఆయన యుద్ధాన్ని ప్రకటించాడు. ఒక పిచ్చుక ఒక సంవత్సరం లో సుమారు ఆరున్నర కిలోల బియ్యం తింటుందని మావో సూత్రీకరించారు.

Image result for పిచ్చుక‌లు

అలా దేశంలోని పిచ్చుకలన్నీ తింటున్న ధాన్యం లక్షల టన్నుల్లో ఉంటుందని వివరించాడు. ఆ ధాన్యం అంతా కాపాడితే అరవై వేల మంది జనాభాకి ఆహారం సమకూర్చవచ్చని దేశప్రజలకు నూరిపోశాడు. అంతే దేశమంతటా పిచ్చుకలపై మహా సంగ్రామం ప్రారంభమైంది. జనం పిచ్చుకలు కనిపిస్తే చాలు చంపేసేవారు. చెట్లపైకెక్కి వాటి గూళ్లను.. వాటిలోని గుడ్లను నాశనం చేసేవారు. పిచ్చుక పిల్లలను సైతం చంపేసేవారు.అలా చైనాలో పిచ్చుకలే లేకుండా సర్వనాశనం చేశారు. మావో చేసిన ఆ పిచ్చుకలపై యుద్ధం కారణంగా చైనాను కరవు రక్కసి కబళించింది. అక్షరాలా నాలుగున్నర కోట్ల మంది ఆకలితో అలమటించి అసువులు బాశారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

పిచ్చుకలు పొలాలపై వాలినప్పుడు కేవలం ధాన్యాన్ని మాత్రమే తినవు.. అవి పంటకు హానికరమైన అనేక పురుగులను కూడా తింటాయి. మరి దేశంలో పిచ్చుకలే లేకుండా చంపేస్తే ఆ పురుగులను చంపేదెవరు..? క్రమంగా పంటలను చీడపీడలు పాడు చేశాయి. దేశంలో ధాన్యం ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. కరవు కరాళ నృత్యం చేసింది. ఆకలి చావులకు దారి తీసింది. చూశారుగా ఈ సృష్టిలో ప్ర‌తీదీ ఓచైన్ లింక్, ఆహార‌ వ్య‌వ‌స్ధ, జీవ‌నం అన్ని మిలితం అయి ఉన్నాయి.. మ‌రి ఈ నిర్ణ‌యం పై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.